లఖింపూర్ ఖేరి ఘటన దర్యాప్తుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది… పక్కా ప్రణాళికతో, ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటన జరిగిందని, నిర్లక్ష్యం కాదని స్పష్టం చేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం ( సిట్)… ఈ నేపథ్యంలో నిందితులపై హత్యాయత్నం అభియోగాలు నమోదు చేసేందుకు అనుమతించాలని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్‌ను కోరింది సిట్.. ప్రస్తుతం నిందితులపై సెక్షన్ 279, 338, 304ఏ నిర్లక్ష్యంగా వ్యవహరించారనే అభియోగాలు నమోదు చేశారు పోలీసులు.. అయితే, సెక్షన్ 307(హత్యాయత్నం), సెక్షన్ 326 (ప్రమాదకరమైన ఆయుధాలతో ఉద్దేశపూర్వకంగా గాయపర్చడం), సెక్షన్ 34ను చేర్చాలని మేజిస్ట్రేట్‌ను కోరింది సిట్ టీమ్..
Read Also: మహేష్‌బాబుకు సర్జరీ.. రెస్ట్‌లో సూపర్ స్టార్..
మరోవైపు అశీష్ మిశ్రా బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని అలహాబాద్ హైకోర్టు, లక్నో ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందు కోసం రెండు వారాల గడువు ఇచ్చింది. అక్టోబర్ 3వ తేదీన జరిగిన లఖింపూర్ ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మరణించారు. నిరసన తెలియజేస్తున్న రైతుల పైకి కేంద్రమంత్రి అజైయ్ మిశ్రా కుమారుడు ఆశీష్ మిశ్రా కారు దూసుకెళ్లింది. కారు ఢీకొని నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోగా.. ఆ తర్వాత చెలరేగిన హింసలో ఓ జర్నలిస్టు సహా నలుగురు చనిపోయారు. ఆశీష్ మిశ్రా సహా పలువురిని అ కేసులు అరెస్ట్ చేశారు పోలీసులు.. ప్రస్తుతం నిందితులు లఖింపూర్ ఖేరి జిల్లా జైలులో ఉన్నారు.