డిసెంబర్ 15, బుధవారం రాశిఫలాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఈ రోజు ఈ రాశివారు దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగండి. ఒక ముఖ్య విషయమై న్యాయ సలహా పొందుతారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి పెరుగుతుంది.
వృషభం : ఈ రోజు ఈ రాశిలోని హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధు మిత్రుల రాకపోకలు, కుటుంబీకులతో ఉల్లాసంగా గడుస్తుంది. సంఘంలో గుర్తింపు, పేరు, ప్రఖ్యాతులు లభిస్తాయి.
Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
- Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
- Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
మిథునం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. విద్యా సంస్థల వారికి ఆందోళన తప్పదు. దూర ప్రయాణాలు సంతృప్తినిస్తాయి. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. రుణయత్నాలు ఫలిస్తాయి. బంధువుల రాకతో ఖర్చులు అధికం. ఎదుటివారిని అతిగా విశ్వసించటం అంత మంచిది కాదని గమనించండి.
కర్కాటకం : ఈ రోజు ఈ రాశివారికి బంధువులతో సఖ్యత లోపిస్తుంది. విద్యార్థులు విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు సంతృప్తినిస్తాయి. మీ తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. కోర్టు వ్యవహారాలు, భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. రిప్రజెంటటేటివ్‌లు, ఉపాధ్యాయులకు సదావకాశాలు లభిస్తాయి.
సింహం : ఈ రోజు ఈ రాశిలోని పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. బంధువుల నుంచి ఒత్తిడి, మొహమాటాలు ఎదుర్కుంటారు. సొంతంగా వ్యాపారం, సంస్థలు స్థాపించాలనే మీ నిర్ణయం బలపడుతుంది. ఎదుటివారితో వీలైనంత మితంగా సంభాషించండి. విద్యార్థులకు విద్యావిషయాల పట్ల ఏకాగ్రత అవసరం.
కన్య : ఈ రోజు ఈ రాశివారు ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. కీలకమైన వ్యవహారాల్లో కుటుంబీకుల సలహా పాటించటం మంచిది. రాజకీయ నాయకులకు విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. వాతావరణంలో మార్పుతో రైతులు ఊరట చెందుతారు. కొబ్బరి, పండ్లు, పూలు కూరగాయలు, చిరు వ్యాపారులకు లాభదాయకం.
తుల: ఈ రోజు ఈ రాశివారికి కళత్ర ఆరోగ్యంలో అధికమైన జాగ్రత్త అవసరం. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. వస్త్ర వ్యాపారులకు లాభదాయకం. మీ వాక్చాతుర్యం, లౌక్యంతో అనుకున్నది సాధిస్తారు. మీ సామర్థ్యానికి ఆశించినంత ప్రతిఫలం లభిస్తుంది. మీ కుటుంబీకులతో కలసి ఆలయాలను సందర్శించుకుంటారు.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులు విలువైన కానుకలు అందించి అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. పెద్దలను, గురువులను గౌరవించడం వల్ల మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్టేషనరీ, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసివచ్చే కాలం. విద్యార్థులు అపరిచిత వ్యక్తులతో అధికంగా సంభాషించడం శ్రేయస్కరం కాదు.
ధనస్సు : ఈ రోజు ఈ రాశిలోని స్త్రీలు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ సామర్థ్యానికి ఆశించినంత ప్రతిఫలం లభిస్తుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. మీ వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఉన్నతాధి కారులకు తనిఖీలు, పర్యవేక్షణలలో ఏకాగ్రత ముఖ్యం.
మకరం : ఈ రోజు ఈ రాశివారికి ఆర్థిక ఇబ్బందులు లేకున్నా తెలియని అసంతృప్తి వెన్నాడుతుంది. కొంతమంది మీ నుండి ధనం లేక ఇతరత్రా సహాయం అర్థిస్తారు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. పెద్దలను, ప్రముఖులను కలుసుకొని వారికి బహుమతులు అందజేస్తారు. దంపతుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి.
కుంభం : ఈ రోజు ఈ రాశివారికి వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. బంధువుల నుండి సహాయ సహకారాలు అందిస్తారు.
మీనం : ఈ రోజు ఈ రాశివారు ముఖ్యమైన వ్యవహారాల్లో ఎదుటివారిని సలహా అడగటం మంచిదని గమనించండి. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది, మీ జీవితభాగస్వామి సలహా పాటించి లబ్ది పొందుతారు. హోటల్, కేటరింగ్ రంగాల వారికి లాభదాయకం.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!