ఆరోగ్యకర భారతం కలలు సాకారం చేయాలనే తపనతో ప్రధాని నరేంద్ర మోడీ పనిచేస్తున్నారని.. భారత్‌లో ఆరోగ్యం, అభివృద్ధి రెండింటినీ కలిపి ముందుకు తీసుకువెళ్లే సంప్రదాయం గతంలో లేకపోయినా.. ఇప్పుడు ఆ పని విజయవంతంగా ప్రధాని మోడీ చేస్తున్నారని.. మంచి ఫలితాలను సైతం సాధిస్తున్నారని ప్రశంసలు కురిపించారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుక్ మాండవీయ.. ఢిల్లీలో ఎయిమ్స్ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భారత్దేశ ఆరోగ్య బడ్జెట్ […]
హైదరాబాద్ కొత్తపేటలోని గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ ఇవాళ అర్ధరాత్రి నుంచి మూతపడనుంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి మార్కెట్ మూసివేయనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ మార్కెట్‌ను బాటసింగారం లాజిస్టిక్ పార్కుకు తరలిస్తున్నారు. అయితే.. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ తరలింపుపై హైకోర్టును ఆశ్రయించారు పండ్ల వ్యాపారులు.. ఈ నెల 25 నుండి మార్కెట్ క్లోజ్ చేస్తునట్టు అధికారులు ప్రకటించిన నేపథ్యంలో కోర్టు మెట్లెక్కారు.. కొహెడలో నూతన మార్కెట్ నిర్మాణం పూర్తి చేసే వరకు బాట సింగారంలో […]
ఈనెల 27 న భారత్ బంద్ నిర్వహించాలని జాతీయ రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్.. రైతు, కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ బంద్ కొనసాగనుంది.. ఇందుకు దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలన్ని మద్దతు ప్రటిస్తున్నాయి. మోడీ ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎండగడుతూ దేశ వ్యాప్తంగా ఈ నెల 27న తలపెట్టిన భారత్ బంద్ చరిత్రాత్మకంగా నిలిచిపోతుందని సంయుక్త కిసాన్ మోర్చా పేర్కొంది.. అయితే.. 27న రైతు సంఘాలు […]
ఎవరూ చట్టానికి చుట్టాలు కాదు.. వారు ప్రజాప్రతినిధులైనా సరే.. గతంలో నమోదైన ఓ కేసు విషయంలో కోర్టుకు హాజరు కాకపోవడంతో.. తాజాగా కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ రామ్ శంకర్ కథేరియాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిది కోర్టు.. 11 సంవత్సరాల క్రితం జరిగిన రైలు దిగ్బంధనం కేసులో ఇప్పటి వరకూ కోర్టుకు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. ఈ వారంట్ జారీ చేసింది. ఇక, ఎంపీ కథేరియాతో పాటు, […]
సీఎం వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు.. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దుపై స్పందించిన ఆయన.. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే బెణకని వైఎస్ జగన్ కాలు.. ఢిల్లీ అంటే బెణికిందా..? అంటూ ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ఒక పిరికిపంద అని వ్యాఖ్యానించిన ఆయన.. జగన్ చెప్పిన ప్రత్యేక హోదా ఎక్కడ ఉంది..? కేంద్రాన్ని హోదా అడగకుండా తాడేపల్లిలో తల దాచుకున్నారు అంటూ మండిపడ్డారు. ఏ అంశం పైనైనా టీడీపీ […]
ప్రపంచ దేశాలను ఇప్పటికే వణికిస్తూనే ఉంది కరోనా మహమ్మారి.. భారత్‌లో కరోనా ఫస్ట్ వేవ్ కంటే.. సెకండ్ వేవ్ సమయంలో పెద్ద సంఖ్యలో కేసులు వెలుగు చూడడమే కాదు.. మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగిపోయింది.. ఇక, ఇప్పటికీ పూర్తిస్థాయిలో కోవిడ్ కేసులు అదుపులోకి వచ్చిందేలేదు.. మరోవైపు థర్డ్ వేవ్ హెచ్చరికలు కూడా ఉన్నాయి.. ఈ తరుణంలో కోవిడ్ పరిస్థితులపై తాజాగా హెచ్చరించింది ఎయిమ్స్.. వచ్చే 6 నుంచి 8 వారాల పాటు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు […]
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతుంటారు.. ఇక, సర్వదర్శనం కోసం అయితే బారులు తీరుతుంటారు.. అయితే, టీటీడీ ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్లు విడుదల చేసిన అరగంటలోనే అన్నీ పూర్తి అయ్యాయి.. సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు సంబంధించిన టికెట్లను ఆన్లైన్లోపెట్టింది టీటీడీ.. రోజుకి 8వేల టోకెన్ల చొప్పున మొత్తం 2.79 లక్షల టికెట్లను విడుదల చేయగా… హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.. 25 నిముషాల్లోనే 2.4 […]
వైద్యారోగ్య శాఖపై కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ సర్కార్.. ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ సేవలపై నిషేధం విధించాలని వైఎస్ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.. ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ లేదా ప్రైవేట్ ఆస్పత్రుల్లో విధులు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది.. వైద్యారోగ్య శాఖలో కొత్తగా చేపట్టనున్న 14 వేలకు పైగా పోస్టుల భర్తీలో ఈ నిబంధనను కచ్చితంగా అమలయ్యేలా చూడాలని అధికారులు భావిస్తున్నారు. డీఎంఈ, ఏపీవీవీపీ, డీపీహెచ్ సెంటర్లలో మొత్తంగా 14,037 పోస్టుల భర్తీకి ప్రణాళికలు […]
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయ్యింది.. రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలపై ఆరా తీశారు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాకూర్.. అంతే కాదు.. ఇవాళ సాయంత్రం గాంధీభవన్‌లో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు.. ఈ సమావేశంలో జగ్గారెడ్డి కామెంట్లపై సీరియస్‌గా చర్చించాలని రాష్ట్ర నేతలను మాణిక్యం ఠాకూర్ ఆదేశించినట్టు తెలుస్తుంది… ఏఐసీసీ కార్యదర్శి బోస్ […]
భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడనున్నాయన్నారు అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్. ఇరుదేశాల సంబంధాల్లో టెక్నాలజీ కీలకపాత్ర పోషించనుందన్నారు బైడెన్. వాణిజ్య రంగంలో పరస్పర సహకారం రెండు దేశాలకు లాభదాయకమన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోడీతో.. వైట్‌హౌజ్‌లో సమావేశమైన బైడెన్.. భారత్-అమెరికా సంబంధాల్లో కొత్తశకం మొదలవుతోందని చెప్పారు. అమెరికాకు ప్రధాన మిత్రదేశాల్లో భారత్ కూడా ఒకటని స్పష్టం చేశారు. బైడెన్‌తో భేటీ వల్ల అన్ని అంశాలపై చర్చించుకునే అవకాశం లభించిందన్నారు ప్రధాని మోడీ. ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడే […]