మాజీ హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఇళ్లలో ఏకకాలం సోదాలు నిర్వహిస్తున్నారు సీబీఐ అధికారులు.. మహారాష్ట్రకు చెందిన ఈ మాజీ మంత్రిపై గతంలో కొన్ని అభియోగాలున్నాయి.. అయితే, ఇప్పుడు జరుగుతోన్న తనిఖీలు ఏ విషయంలో అనేదానిపై స్పష్టత లేదు.. కానీ, మాజీ మంత్రికి చెందిన వివిధ ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నట్లు అధికారులు చెప్పారు. నాగపూర్‌తో పాటు ముంబైలో ఉన్న ఆయన ఇల్లలో తనిఖీలు చేపట్టింది సీబీఐ.. నేరపూరిత కక్ష సాధింపు, అవినీతి ఆరోపణలపై గతంలో అనిల్ దేశ్ముఖ్తో […]
వీళ్లు మామూలు దొంగల కాదు.. ఎందుకంటే ఏకంగా డిప్యూటీ కలెక్టర్ ఇంటికే కన్నం వేశారు.. ఉన్నకాడికి ఊడ్చేశారు.. అయినా వారికి ఏదో వెలితి అనిపించినట్టుంది… ఎందుకంటే.. దొంగతనం చేసింది డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో.. దొరికిన నగదు చాలా తక్కువ అని ఫీలయ్యారేమో.. అక్కడ ఓ లేఖను వదిలివెళ్లారు.. ఆ తర్వాత ఆ లేఖ చూసిన డిప్యూటీ కలెక్టర్ షాక్ తిని.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరరిగింది.. ఆ ఘటకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి […]
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలకు తెరదించాలన్న ఉద్దేశంతో కృష్ణానది యాజమాన్యబోర్డు, గోదావరి నది యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం.. దీనిపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ నెల 14వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది.. ఇప్పటికే రెండు బోర్డులు దీనిపై కసరత్తు చేస్తున్నాయి.. అయితే.. ఈ నెల 14వ తేదీ నుంచి అమల్లోకి రానున్న గెజిట్ నోటిఫికేషన్ అమలు వాయిదా వేయాలని కోరుతోంది తెలంగాణ ప్రభుత్వం… గోదావరి నదిపై ఉన్న పెద్దవాగు […]
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్‌చంద్ర ప్రమాణస్వీకారం చేయించారు.. ఇవాళ రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ సతీష్చంద్రచే రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు.. ఈ కార్యక్రమానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, సీఎస్ సోమేష్ కుమార్ తదితరులు హాజరయ్యారు… కాగా, దేశవ్యాప్తంగా 13 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. సెప్టెంబర్ 16న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు […]
భారత దేశంలో ఆధునిక మహిళలకు పెళ్లి, పిల్లలు అక్కర్లేదు అనుకుంటున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కర్ణాటక ఆరోగ్య మంత్రి డాక్టర్ సుధాకర్.. నేటి మహిళలు ఒంటరిగా ఉండాలని కోరుకుంటారని, పెళ్లైన తర్వాత కూడా పిల్లల్ని కనడానికి ఇష్టపడడం లేదన్న ఆయన.. సరోగసీ ద్వారా సంతానానికి జన్మనివ్వాలని భావిస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. ఇది మానసిక సమస్యలకు దారి తీస్తోందని.. మా మార్పు మంచిది కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు… ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా బెంగళూరులో […]
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ‘దిశ’ ఘటన సంచలనం సృష్టించింది.. హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై అప్పట్లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సజ్జనార్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.. అయితే, ఈ ఘటనపై సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల జస్టిస్ వీఎస్ సిర్పూర్ కర్ కమిషన్ నియమించింది.. ఆ కమిషన్ విచారణ తిరిగి ప్రారంభం కానుండగా.. ఇవాళ అత్యంత కీలకంగా మారింది.. దిశ హత్యాచారం జరిగిన సమయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న వీసీ సజ్జనార్‌ను ఇవాళ త్రిసభ్య కమిటీ […]
గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం ఇప్పటికే సమావేశం అయ్యింది.. జీఆర్ఎంబీ సభ్య కార్యదర్శి బీపీపాండే నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి తెలుగు రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. ఈ నెల 14 నుంచి గెజిట్ నోటిఫికేషన్ అమలుపై చర్చించారు.. పెద్దవాగు ప్రాజెక్టును బోర్డు అధీనంలోకి తీసుకోవడంపై సమాలోచనలు చేవారు.. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ అమలు దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమైంది.. మొదటి దశలో అయిదు ప్రాజెక్టుల పరిధిలోని 29 కేంద్రాలను […]
సుప్రీంకోర్టుకు ఇవాళ్టి నుంచి దసరా సెలవులు వచ్చాయి… ఆ తర్వాత మిలాద్ ఉన్ నబీ సెలవులు కూడా ఉండడంతో ఈ నెల 19వ తేదీ వరకు కోర్టు మూతపడనుంది.. అయితే, శనివారం నుంచే సెలవులు ప్రారంభం అయ్యాయని చెప్పవచ్చు.. శని, ఆదివారాలు వారాంతపు సెలవులు కాగా ఇవాళ్టి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు. ఇక, 17న ఆదివారం, 18, 19 తేదీల్లో మిలాద్ ఉన్ నబీ సెలవులు ఉండడంతో.. సుప్రీంకోర్టు […]
రోజురోజుకీ పెరుగుతోన్న పెట్రో ధరలు సామాన్యుడికి భారంగా మారుతూనే ఉన్నాయి.. అయినా, చమురు కంపెనీల రోజువారి వడ్డింపు ఆగడం లేదు.. కాస్త బ్రేక్ తర్వాత మళ్లీ పెరుగుతోన్న పెట్రో ధరలు.. వరుసగా ఏడో రోజు కూడా పైకి ఎగబాకాయి.. తాజాగా లీటరు పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసలు వడ్డించాయి చమురు సంస్థలో దీంతో.. దేశ రాజధాని ఢిల్లీలో చమురు ధరలు ఆల్‌టైం హైకి చేరి కొత్త రికార్డు సృష్టించాయి.. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర […]
ఈ సారి ‘మా’ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి.. సాధారణ ఎన్నికల తరహాలో ఎన్నో హైడ్రామాలు నడిచాయి.. మొత్తంగా ఎన్నికల కోలాహలం ముగిసి.. ఫలితాలు కూడా వచ్చాయి.. ఈ ఎన్నికల్లో అనేక అంశాలు తెరపైకి వచ్చినా.. మా అధ్యక్ష బరిలోకి దిగిన ప్రకాష్‌రాజ్‌పై ఘన విజయం సాధించారు మంచు విష్ణు.. మా ఎన్నికలను రాజకీయ నేతలను కూడా ప్రభావితం చేస్తున్నారనే చర్చ కూడా సాగింది. అయితే, మా ఎన్నికలపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు […]