ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదలయ్యాయి… విశాఖలో ఏపీ ఎడ్ సెట్ ఫలితాలను విడుదల చేశారు కన్వీనర్ విశ్వేశ్వర్ రావు… ఈ ఏడాది ఎడ్ సెట్‌కు 15638 మంది దరఖాస్తు చేసుకోగా… అందులో 13,619 మంది పరీక్షకు హాజరయ్యారు.. ఇక, ఫలితాల్లో 13,428 మంది అంటే.. 98.60 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించినట్టు ఎడ్‌సెట్ కన్వీనర్ విశ్వేశ్వర్రావు వెల్లడించారు.. ఇక, కిందటేడాది డాటా ప్రకారం అందుబాటులో ఉన్న సీట్లు 42 వేలు కాగా… కౌన్సెలింగ్ తేదీలను త్వరలోనే […]
హైదరాబాద్ శివారులో జరిగిన దిశ ఘటన సంచలనం సృష్టించింది.. ఇక, నిందితుల ఎన్‌కౌంటర్‌పై పోలీసులపై ప్రశంసల వర్షమే కురిసిందే.. ముఖ్యంగా అప్పట్లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సజ్జనార్‌ను హీరోగా కీర్తించిది సోషల్ మీడియా.. ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంటూ ప్రశంసలు కురిపించింది.. అయితే, దిశ ఘటనలో నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ చేపట్టిన త్రి సభ్య కమిషన్.. సజ్జనార్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది.. దిశ ఘటన ఎప్పుడు తెలిసింది..? కేసు ఎప్పుడు నమోదు చేశారు? విచారణ ఎలా […]
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మున్సిపల్ కమిషనర్ లావణ్యపై సస్పెన్షన్ వేటు పడింది… విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు కమిషనర్ ను సస్పెండ్ చేసినట్లు అధికారులు వివరించారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాజాగా, షాద్‌నగర్ లోని రాంనగర్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టారు. పనుల కోసం ఫరూఖ్‌నగర్ మండలపరిధిలోని ఉప్పరిగడ్డ గ్రామానికి చెందిన శ్రీను, కృష్ణ, రాజు సోమవారం కూలీ పనుల నిమిత్తం తమ కుటుంబసభ్యులతో కలిసి షాద్‌నగర్‌కు వచ్చారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనుల్లో భాగంగా పైప్ […]
దేశవ్యాప్తంగా లఖింపూర్ ఖేరి ఘటన తీవ్ర కలకలం సృష్టించింది… కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా కాన్వాయ్‌తో రైతుల ర్యాలీపైకి దూసుకుపోవడంతో నలుగురు రైతులు మృతిచెందగా.. ఆ తర్వాత జరిగిన హింసలో మరో నలుగురు మృతిచెందడం సంచలనంగా మారింది… అయితే, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసేందుకు సిద్ధం అయ్యారు కాంగ్రెస్ నేతులు.. రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ నేతల ప్రతినిధి బృందం.. రేపు రాష్ట్రపతితో సమావేశం కానుంది.. ఈ సందర్భంగా లఖింపూర్ ఖేరి హింస ఘటనపై వాస్తవాలను […]
తెలంగాణకు కృష్ణా జలాల్లో వాటా కేటాయించే వరకు గెజిట్ నోటిఫికేషన్ ఆపాలని కోరినట్టు తెలిపారు తెలంగాణ సాగునీటిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్.. జలసౌధలో ఇవాళ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం జరిగింది.. కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నీటిపారుదల శాఖ అధికారులు హాజరయ్యారు. కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ అమలుపైనే ప్రధానంగా చర్చ జరిగింది.. ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి […]
టీఆర్ఎస్ అంతర్గత ఆధిపత్య పోరుతోనే హుజురాబాద్‌లో ఉప ఎన్నికలు వచ్చాయని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి… హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని మామిడాలపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూర్ వెంకట్ తరపున ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరలుఉ ప్రచారం నిర్వహించారు.. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ. టీఆర్ఎస్ అంతర్గత ఆధిపత్య పోరుతో ఉప ఎన్నికలు వచ్చాయని ఆరోపించారు.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా రెండుసార్లు మంత్రిగా పనిచేసిన […]
స్కూళ్ల నిర్వహణ, విద్యార్థుల హాజరు, అమ్మ ఒడి, విద్యాకానుకపై సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్ జగన్.. సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. కరోనా తర్వాత పాఠశాలల్లో పరిస్థితులపై ఆరా తీసిన ఆయన.. పాఠశాలల్లో కరోనా నివారణ చర్యలను అడిగి తెలుసుకున్నారు.. విద్యాకానుకలో భాగంగా ఇవ్వనున్న స్పోర్ట్స్ డ్రస్, షూలను పరిశీలించి.. వాటికి కొన్ని సూచనలు చేశారు.. ప్రభుత్వం పాఠశాలల్లో హాజరు భారీగా పెరిగిందని, ప్రస్తుతం 91శాతం హాజరు ఉందని ఈ సందర్భంగా సీఎంకు తెలిపారు […]
కేరళలోని కొల్లంలో దివ్యాంగురాలైన ఓ వివాహిత పాటు కాటుతో మరణించింది.. అయితే, అదంతా ఓ ప్లాన్ ప్రకారం చేసిన మర్డర్ కావడం అంతా కంగుతినే విషయం.. ఈ కేసును సవాల్‌గా తీసుకుని రంగంలోకి దిగిన పోలీసులు.. సజీవ పాము, ఓ బొమ్మ దాని చేతిని ఉపయోగించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం సంచలంగా మారింది.. ఈ తరహాలో పోలీసులు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.. దీంతో.. ఇది దేశవ్యాప్తంగా సంచనలంగా మారింది.. అయితే, ఈ కేసులో మృతురాలి […]
జమ్మూ అండ్ కాశ్మీర్లో మరోసారి రెచ్చిపోయారు ఉగ్రవాదులు.. పూంచ్ సెక్టార్లో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు.. ఇవాళ ఉదయం పూంచ్ సెక్టార్లో జవాన్లు-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.. ఓ జూనియర్ కమిషన్డ్ అధికారి సహా నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. టెర్రరిస్టుల కోసం ఆర్మీ, స్థానిక పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పూంచ్ సెక్టార్లో ఉగ్రవాదుల ఏరివేతకు సైనిక బృందం వెళ్లిన సమయంలో ఎదురుకాల్పులుకు తెగబడ్డారు ఉగ్రవాదులు.
ప్రతీనెల గ్యాస్ ధర పైపైకి ఎగబాకుతూనే ఉంది.. సబ్సిడీ వంట గ్యాస్ ధర ఏకంగా వెయ్యి రూపాయలకు చేరువైంది.. అయితే.. తన గ్యాస్ వినియోగదారులకు నవరాత్రి సందర్భంగా హిందూస్థాన్ పెట్రోలియం బంపరాఫర్ తెచ్చింది.. నవరాత్రి సమయంలో గ్యాస్ సిలిండర్ల కొనుగోలుపై రూ.10,000 వరకు బంగారం గెలుచుకునే అవకాశాన్ని కలిపించింది.. హిందూస్థాన్ పెట్రోలియం ప్రకటించిన ఈ బంపరాఫర్ ఈ నెల 7వ తేదీ నుంచి 16 తేదీల మధ్య అందుబాటులో ఉండనుండగా.. ఈ ఆఫర్ కింద ప్రతీరోజూ ఐదుగురు […]