సైనాకు హీరో సిద్ధార్థ్ బహిరంగ క్షమాపణ.. వివాదం ముగిసినట్టేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో సిద్ధార్థ్ సోషల్ మీడియా వేదికగా బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌పై చేసిన ఓ కామెంట్ పెద్ద దుమారమే రేగింది.. ప్రధాని పంజాబ్ పర్యటనలో చోటుచేకున్న భద్రతాలోపాన్ని ప్రస్తావించిన సైనా.. దేశ ప్రధానికే భద్రత లేకపోతే.. ఇక ఆ దేశం భద్రంగా ఉందని ఎలా భావించగలం? ప్రధాని మోడీపై అరాచకవాదుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.. అయితే, సైనా ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. చిన్న కాక్‌తో ఆడే ప్రపంచ ఛాంపియన్..! దేవుడా ధన్యవాదాలు.. భారత్‌ను కాపాడటానికి కొందరు రక్షకులు ఉన్నారు.. అంటూ కామెంట్ చేయడంతో అసలు వివాదం మొదలైంది.. జాతీయ మహిళా కమిషన్, కొందరు ప్రముఖులు, చివరకు సైనా తండ్రి హర్వీర్‌సింగ్ నెహ్వాల్ కూడా సిద్ధార్థ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు.. ఈ నేపథ్యంలో బహిరంగంగా సైనా నెహ్వాల్‌కు క్షమాపణలు చెప్పారు హీరో సిద్ధార్థ్..
Read Also: వంగవీటి రాధాకు కరోనా.. హైదరాబాద్‌కు తరలింపు..
Also Read
- Kuldeep Yadav: 10 వికెట్స్ పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. గౌతమ్ గంభీర్ చూస్తున్నాడా?
- Vaibhav vs Ishan: క్రెడిట్ అంతా తీసుకున్నావ్.. వైభవ్ భవిష్యత్ కెప్టెన్.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Sunil Gavaskar: ఇంకెంతకాలం ఆటగాళ్లను పిండేస్తారు? ఐసీసీకి గవాస్కర్ సూటి ప్రశ్న
- CSK New Coach: సీఎస్కే కొత్త కోచ్.. ఎంఎస్ ధోనీ రెండు కీలక షరతులు!
సైనా నెహ్వాల్‌కు బహిరంగ క్షమాపణలు చెబుతూ ఓ లేఖను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు హీరో సిద్ధార్థ్.. తాను ఎవరినీ అగౌరవపరిచ లేదని చెప్పే ప్రయత్నం చేసిన సిద్ధార్థ్.. సైనా నెహ్వాల్ పెట్టిన ట్వీట్ మీద తాను రియాక్ట్ అవుతూ చేసిన ఆ కామెంట్.. ఒక జోక్ మాత్రమే నంటూ తన లేఖలో పేర్కొన్నాడు.. కాకపోతే తాను చేసిన ఆ కామెంట్ చాలా మందిని బాధించిందని, మహిళలను కించపరుస్తూ కామెంట్స్ చేయాలనే ఉద్దేశంతో మాత్రం అలా చేయలేదని సిద్దార్థ్ వివరణ ఇచ్చుకున్నాడు.. సైనా నెహ్వాల్ ఓ గొప్ప క్రీడాకారిణి, ఆమెను ఎప్పుడూ గౌరవిస్తానని పేర్కొన్నాడు.. నువ్వు ఎప్పుడూ నాకు ఛాంపియన్‌గా ఉంటావు’ అని రాసుకొచ్చాడు సిద్ధార్థ్.. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుండగా.. మరి ఈ వివాదం ఇంతటితో ముగిసిపోందా? సైనా ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?