ఏదైనా స్పెషల్ డే వచ్చిందంటే చాలు.. ప్రత్యేక ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునే పనిలోపడిపోతాయి ఈకామర్స్ సంస్థలు.. ఈ పోటీలో ఈ కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ముందు వరుసలో ఉంటాయి.. ఫెస్టివల్ సీజన్, ఇంకా ఏదైనా స్పెషల్ డే వస్తుందంటే.. ముందే భారీ డిస్కౌంట్లతో సేల్స్ ప్రారంభిస్తాయి.. ఇక, రిపబ్లిక్‌డే సందర్భంగా కూడా స్పెషల్ సేల్ జరుగుతోంది.. జనవరి 17 నుంచి ఫ్లిప్ కార్ట్ ‘బిగ్ సేవింగ్ డేస్’, అమెజాన్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’కు వెళ్తున్నాయి.. ఈ సందర్భంగా వివిధ రకాల ఉత్పత్తులపై 70 నుంచి 80 శాతం డిస్కౌంట్లను ప్రకటించాయి..
Read Also: గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం.. 120 మంది వైద్యులకు పాజిటివ్
అమెజాన్ యొక్క గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో అమెజాన్ ఫ్యాషన్‌పై 80 శాతం వరకు తగ్గింపు, ఇల్లు, గృహోపకరణాలపై 70 శాతం వరకు తగ్గింపు, రూ. 99 నుండి రోజువారీ నిత్యావసర వస్తువులు, రూ. 99 నుండి ఎలక్ట్రానిక్స్ మరియు యాక్సెసరీలు, తక్కువ ధకలు ప్రసిద్ధ చెందిన మొబైల్ బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్‌లు మరియు ఇతర వస్తువులపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది.. ఇవాళ ప్రారంభమై రాబోయే 4-5 రోజుల పాటు కొనసాగుతుంది. సాధారణంగా ఈ సీజన్ విక్రయాలు జనవరి 20 నుండి ప్రారంభమవుతాయి, అయితే ఈ-కామర్స్ దిగ్గజాలు ఈ సంవత్సరం మరింత ముందుగానే ఆఫర్ల మోత మోగిస్తున్నాయి. ఇక, ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ జనవరి 22 వరకు అంటే ఆరు రోజుల పాటు కొనసాగుతుంది.. డిజిటల్ కెమెరాలు, స్మార్ట్‌వాచ్‌లు, వైర్‌లెస్ స్టీరియో (TWS) ఇయర్‌బడ్‌లతో సహా వివిధ స్మార్ట్‌ఫోన్‌లు మరియు గాడ్జెట్‌లపై భారీ తగ్గింపు ఇస్తూ ఆఫర్లు తీసుకొస్తుంది. ఇక, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ కస్టమర్‌లు ఎంపిక చేసిన వస్తువులపై గరిష్టంగా 10శాతం అదనపు తగ్గింపు పొందవచ్చు.