ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా ఆపేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది.. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్‌తో సమావేశమైన మంత్రుల కమిటీ.. ఉద్యోగులకు ఎలా పరిష్కారం చూపాలనేదినాపై కసరత్తు చేసింది.. ఇక, సీఎంతో సమావేశం ముగియడంతో.. మంత్రులు బొత్స, పేర్ని నాని, బుగ్గన, సలహాదారు సజ్జల, సీఎస్ సమీర్ శర్మ సచివాలయానికి చేరుకున్నారు.. అప్పటికే సచివాలయానికి చేరుకున్న పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సభ్యులతో సమావేశం అయ్యారు.. పీఆర్సీ అంశాన్ని ఒక కొలిక్కి తెచ్చేందుకు సచివాలయంలో ఇవాళ మరోసారి పూర్తిస్థాయి చర్చలు జరుపుతోంది ప్రభుత్వం.. ఈ రోజు చర్చల్లో ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.. కాగా, శుక్రవారం రాత్రి.. ఉద్యోగుల ఉద్యమం విరమణ దిశగా మంత్రుల కమిటీ, ఉద్యోగ సంఘాల మధ్య సానుకూల చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది.. తమ డిమాండ్లలో ప్రధాన అంశాల్లో కొన్నింటిపై మంత్రుల కమిటీ సానుకూలంగా ఉందని ఉద్యోగ సంఘాలు వెల్లడించారు.. తాము కూడా ఓ మెట్టు దిగేందుకు సిద్ధమన్నారు.. దీంతో.. ఇవాళ ఏకాభిప్రాయం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
Read Also: మా సమస్యలు పరిష్కరించండి.. సజ్జల కాళ్లపై పడిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు..