ప్రముఖ ఆన్‌లైన్ రిటైల్ సంస్థ, క్లౌడ్ కంప్యూటింగ్ దిగ్గజం అమెజాన్ సంచలన రికార్డు నెలకొల్పింది.. తాజాగా, అమెజాన్ విడుదల చేసిన త్రైమాసిక నివేదిక ప్రకారం.. ఆ సంస్థ షేర్లు 13.5 శాతం పెరిగాయి. ట్రేడింగ్ ముగిసే నాటికి అమెజాన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ సుమారు 190 బిలియన్ డాలర్లకు అంటే.. రూ.14.18 లక్షల కోట్లుకు పెరిగింది..
Read Also: అనుమానాస్పదంగా తిరిగిన కోడి.. అరెస్ట్ చేసిన పోలీసులు..
గత నెల 28వ తేదీన ఐఫోన్ తయారీ సంస్థ ఆపిల్ త్రైమాసిక నివేదిక తర్వాత స్టాక్ మార్కెట్లో 181 బిలియన్ డాలర్ల లాభాలను ఆర్జించి రికార్డు సృష్టించింది ఆ సంస్థ.. అయితే, ఇప్పుడు ఆ రికార్డును అమెజాన్ బ్రేక్ చేసి.. 190 బిలియన్ డాలర్ల లాభాలు నమోదు చేయడం విశేషం.. ఇక, ఈ-కామర్స్ సంస్థ షేర్లు భారీగా పెరగడంతో అమెజాన్ నికర విలువ దాదాపు 1.6 ట్రిలియన్ డాలర్లకు చేరింది.. ఓవైపు త్రైమాసిక ఫలితాలు మెప్పించడానికి తోడు.. అమెరికాలో ప్రైమ్ సభ్యత్వం ధరలను పెంచనున్నట్లు ప్రకటించడం కూడా అమెజాన్ షేర్ల ర్యాలీకి కారణంగా విశ్లేషిస్తున్నారు మార్కెట్ నిపుణులు.