అన్ని రాజకీయ పార్టీలు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఫోకస్ పెడుతున్నాయి.. జనసేన పార్టీ కూడా క్రియాశీల సభ్యత్వ నమోదుపై దృష్టిసారించింది.. దీనికోసం జనసైనికులు, వీర మహిళలకు విజ్ఞప్తి చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ నెల 21వ తేదీ నుంచి జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రకటించిన ఆయన.. జనసేన క్రియాశీల సభ్యత్వ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలని పిలుపునిచ్చారు.. ప్రతీ నియోజకవర్గంలో కనీసం 2 వేల మంది క్రియాశీల సభ్యత్వం తీసుకునేలా చూడాలని పేర్కొన్నారు… పార్టీ క్షేత్ర స్థాయిలో బలోపేతం అవుతోందని వెల్లడించిన పవన్ కల్యాణ్.. పార్టీని మరింత బలోపేతం చేసేలా క్రియాశీల సభ్యత్వ కార్యక్రమం చేపట్టాలన్నారు.. ఇక, గతంలో జనసేన సభ్యత్వం తీసుకున్న వారికి బీమా సౌకర్యం కల్పించామని.. లక్ష మందికి బీమా సౌకర్యం వర్తింప చేశామని.. చనిపోయిన కార్యకర్తలకు అండగా నిలిచామని ఈ సందర్భంగా గుర్తుచేసిన పవన్ కల్యాణ్.. పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Read Also: Viral: మరో వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. నీ సంగతి చూస్తా..!