Godavari-Cauvery: నదుల అనుసంధానం.. ఐదు రాష్ట్రాలతో కీలక భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై కీలక సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం… ఢిల్లీలో రేపు మధ్యహ్నం 2 గంటలకు గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై 5 రాష్ట్రాలతో కేంద్రం సమావేశం నిర్వహించనుంది… కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ నేతృత్వంలో జరగనున్న ఈ కీలక భేటీకి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్నాటక రాష్ట్రాల కారదర్శులు హాజరుకాబోతున్నారు.. ఈ సమావేశంలో ఐదు రాష్ట్రాల అభిప్రాయాలు, ఆలోచనలు తీసుకోనుంది సర్కార్.
కాగా, ఇప్పటికే సుమారు 75 వేల కోట్ల రూపాయల వ్యయ అంచనాతో “డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్” ను రూపొందించిన జాతీయ జల అభివృద్ధి సంస్థ (నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఎజెన్సీ).. వృథాగా పోతున్న 247 టీఎంసీల గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలన్నదే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా ఉంది… అయితే, మొత్తం ఖర్చులో 90 శాతం కేంద్రం, 10 శాతం ఖర్చు ఆయా రాష్ట్రాలు భరించాల్సి ఉంది… తెలంగాణ సుమారు 80 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ సుమారు 90 టీఎంసీలు, పుదుచ్చేరి 5 టీఎంసీలు, తమిళనాడు సుమారు 45 టీఎంసీలు, కర్నాటక సుమారు 25 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది.. మొత్తంగా ఐదేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందడుగు వేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇక, రేపటి సమావేశంలో ఎలాంటి చర్చ సాగనుంది.. ఆయా రాష్ట్రాలు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయనున్నాయి.. వాటికి అనుగుణంగా కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!+
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!