Punjab: రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు.. అందుకే అమరీందర్ సింగ్ తొలగింపు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు.. చాలా సార్లు బహిర్గతం అయ్యాయి.. మాజీ సీఎం అమరీందర్ సింగ్, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ మధ్య వివాదాల నేపథ్యంలో.. చివరకు అమరీందర్ సింగ్ సీఎం పదవి పోయింది.. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.. అయితే, ప్రస్తుతం పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. అప్పటి పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఫతేఘర్ సాహిబ్‌లో పర్యటించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ… పంజాబ్ మాజీ సీఎం కెఫ్టెన్ అమరీందర్ సింగ్ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు.. పంజాబ్ సీఎంగా ఉన్న అమరీందర్ సింగ్‌ను ఎందుకు తొలగించారో తాను చెబుతున్నా.. పేద ప్రజలకు ఉచిత కరెంటు ఇచ్చేందుకు ఆయన అంగీకరించకపోవడమే కారణంగా తెలిపారు.. నాకు విద్యుత్ సరఫరా చేసే కంపెనీలతో ఒప్పందం ఉందని కెఫ్టెన్ అమరీందర్ సింగ్ చెప్పారని ఈ సందర్భంగా బహిర్గతం చేశారు రాహుల్ గాంధీ.
Read Also: Godavari-Cauvery: నదుల అనుసంధానం.. ఐదు రాష్ట్రాలతో కీలక భేటీ
Also Read
- INDIA Bloc: సీఈసీకి వ్యతిరేకంగా నేడు చెన్నైలో విపక్ష కూటమి నిరసన.. పాల్గొననున్న టీవీకే
- మళ్లీ తెరపైకి Ankita Bhandari Case.. ఢిల్లీలో అంకిత తల్లిదండ్రుల నిరసన.. రాహుల్ గాంధీ మద్దతు..!
- Supreme Court: "సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి".. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
మరోవైపు, పంజాబ్‌లో డ్రగ్స్ వ్యవహారంపై కూడా రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ దేశానికి ముప్పు అని తాను చెబుతూనే ఉన్నానని.. పంజాబ్ ప్రయోగాలు చేయవలసిన రాష్ట్రం కాదని ఇప్పుడు మరోసారి చెబుతున్నట్టు తెలిపారు.. పంజాబ్‌లోని యువత జీవితాలను డ్రగ్స్ నాశనం చేయడం కొనసాగితే రాష్ట్ర అభివృద్ధి అర్థరహితమే అవుతుందన్నారు.. కాగా, పంజాబ్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ.. కాంగ్రెస్ పార్టీలో రిమోట్ కంట్రోల్ సీఎంగా పనిచేయలేదనే.. కెఫ్టెన్ అమరీందర్ సింగ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించారంటూ ఆరోపించారు.. ఈ నేపథ్యంలో.. అసలు అమరీందర్ సింగ్‌ను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ.. కాగా, ఈ నెల 20వ తేదీన పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ జరగబోతోంది.. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉన్నా.. ఫిబ్రవరి 16వ తేదీ శ్రీ గురు రవిదాస్ జీ జయంతి ఉత్సవాల నేపథ్యంలో.. పోలింగ్ వాయిదా వేయాలని అన్ని రాజకీయ పార్టీలు కోరాయి.. దీంతో.. ఫిబ్రవరి 20న పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..