రోజుకో తరహాలో మోసాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి… తాజాగా వరంగల్‌లో వెలుగుచూసిన ఘటన విస్మయానికి గురిచూస్తోంది.. ఏకంగా న్యాయస్థానాన్నే బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు.. కానీ, వరంగల్ పోలీసు వారి ఆటలను సాగనివ్వలేదు.. అరెస్ట్ చేసిన కటకటాల వెనక్కి నెట్టారు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వివిధ కేసుల్లో నిందితులుగా వున్న సమయంలో వారికి కోర్టు బెయిల్ ఇచ్చేందుకు కావల్సిన వత్రాలు, పూచికత్తు సంతకాలను ఫోర్జరీ చేసి ధ్రువీకరణ పత్రాలను సృష్టిస్తున్న ఐదుగురు సభ్యుల గ్యాంగ్ […]
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ హైదరాబాద్‌లో ఎంటరైంది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలినట్టు తెలంగాణ వైద్య శాఖ ప్రకటించింది.. కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరు విదేశీయులకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించడం.. వారికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆస్పత్రిలో చికిత్స అందించడం జరుగుతున్నాయి. కొత్త వేరియంట్ ఎంట్రీతో అప్రమత్తం అయ్యారు అధికారులు.. ఇక, ఆ ఇద్దరూ మొహిదీపట్నం టోలీచౌకీ ప్రాంత వాసులే కావడంతో.. ఆ […]
సౌతాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్.. ఇప్పుడు భారత్ దేశంలోని పలు రాష్ట్రాలకు వ్యాపించింది.. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీని ఒమిక్రాన్ టెన్షన్ పెడుతోంది.. తాజాగా మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 10కి పెరిగింది.. ప్రస్తుతం తొమ్మిది మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. మరో వ్యక్తి ఒమిక్రాన్ నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్టు అధికారులు ప్రకటించారు.. మరోవైపు.. కొత్త వేరియంట్ కలకలం […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరో లేఖ రాశారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.. ప్రభుత్వానికి అనేక అంశాలపై లేఖలు రాస్తూ వచ్చిన ఆయన.. ఈ సారి కోడిగుడ్ల నాణ్యతను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే కోడిగుడ్లల్లో నాణ్యత లేదని లేఖలో పేర్కొన్నా సోము వీర్రాజు.. కుళ్లిపోయిన కోడిగుడ్లను ఇవ్వడం వల్ల పిల్లలకు వాంతులు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.. పౌష్టికాహార లోపాన్ని నివారించేలా కేంద్రం తగినంతగా నిధులిస్తున్నా.. […]
దేశంలో అమ్మాయిల కనీస వివాహ వయస్సుపై గత కొంతకాలంగా చర్చ సాగుతూనే ఉంది… గతంలో ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం.. ప్రస్తుతం పురుషుల కనీస వివాహ వయస్సు 21 ఏళ్లు, అమ్మాయిల వయసు 18 ఏళ్లుగా ఉండగా.. దీనిపై సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం… అమ్మాయిల వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచాలనే ప్రతిపాదనకు తీసుకొచ్చింది.. ఇక, ఈ ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర కూడావేసినట్టుగా చెబుతున్నారు.. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ […]
పీఆర్సీ పై పీటముడి వీడడం లేదు.. పీఆర్సీ, ఇతర 70 డిమాండ్లపై ఉద్యోగ సంఘాలతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుల సజ్జల నిన్న జరిపిన చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి.. అయితే.. ఇవాళ అంటే.. వరుసగా మూడో రోజూ కూడా చర్చలు కొనసాగనున్నాయి.. ఉద్యోగ సంఘాలతో మరో దఫా చర్చించనున్నారు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల.. ఫిట్మెంట్, మానిటరీ బెనిఫిట్స్ అమలు తేదీ తేలటమే కీలకంగా మారినట్టుగా తెలుస్తోంది.. మరోవైపు, […]
రాజకీయాల్లో.. ప్రభుత్వంలో వివిధ హోదాల్లో ఉన్న నేతలపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి… పదువులు కూడా పోగొట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.. తాజాగా, గోవా మంత్రి మిలింద్ నాయక్.. తన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది… మంత్రి మిలింద్ నాయక్.. అధికారాన్ని దుర్వినియోగం చేశారని.. ఒక మహిళను లైంగికంగా వేధించారంటూ కాంగ్రెస్ పార్టీ గోవా అధ్యక్షుడు గిరీష్ చోడంకర్ ఆరోపణలు గుప్పించారు.. ఆ మంత్రిని కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.. […]
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి నానక్‌రాంగూడలో సీబీఐ అధికారులమంటూ ఓ ఇంట్లోకి దూరిన దొంగల ముఠా.. సోదాలు చేయాలంటూ ఇంటిని గుల్ల చేశారు.. కిలో 44 గ్రాముల బంగారంతో పాటు రూ.2 లక్షల నగదును దోచేశారు.. ఇక, నకిలీ సీబీఐ అధికారులను పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు.. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు.. నకిలీ ఐడీ కార్డులు సృష్టించి దోపిడీకి పాల్పడ్డారని.. ఇంటి యజమాని సుబ్రహ్మణ్యంతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సంవత్సరం క్రితం కలిసి పని చేసిన వ్యక్తులే దొంగతనానికి […]
బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాటపట్టారు.. ప్రభుత్వ రంగ బ్యాంకులు నేటి నుంచి రెండు రోజుల పాటు సమ్మెలో పాల్గొనబోతున్నాయి.. డిసెంబర్ 16, 17 తేదీల్లో దేశవ్యాప్తంగా ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకుల ఈ సమ్మెలో పాల్గొని.. తమ డిమాండ్లను వినిపించబోతున్నాయి.. ఇంతకీ బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు వెళ్లాల్సిన కారణాలు ఏంటి? వారి డిమాండ్లు ఏంటి? అని ఓసారి పరిశీలిస్తే.. ప్రభుత్వ రంగం బ్యాంకుల్లో రెండింటిని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రైవేటీకరించాలని ప్రభుత్వం బడ్జెట్ 2021-22లో కేంద్రం నిర్ణయించడం.. […]