ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే ముగియబోతున్నాయి.. ఈ నెల 7వ తేదీన చివరి విడత పోలింగ్‌తో ఐదు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ పరిపూర్ణం కానుంది.. ఇక, 10వ తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. అయితే, వరుసగా పెరుగుతూ కొత్త రికార్డులను తాకిన పెట్రో ధరలు.. ఎన్నికల ముందు మాత్రం ఉపశమనం కలిగిస్తూ కాస్త తగ్గించింది సర్కార్.. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో.. పెరుగుదలకు కామా పడింది.. అయితే, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిపోయాయి.. ఎన్నికలు కూడా ముగింపునకు రావడంతో.. మళ్లీ పెట్రో మంట తప్పదనే అంచనాలున్నాయి.. ఈ నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం సెటైర్లు వేశారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. త్వరగా పెట్రోల్ ఫుల్‌ట్యాంక్ చేసుకోండి. ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ ఎన్నికల ఆఫర్ అయిపోతుంది అంటూ వ్యాఖ్యానించారు.. ఇంకో రెండు రోజుల్లో ఉత్తరప్రదేశ్ లో చివరి దశ పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ ఈ ట్వీట్ చేశారు..
फटाफट Petrol टैंक फुल करवा लीजिए।
— Rahul Gandhi (@RahulGandhi) March 5, 2022
मोदी सरकार का ‘चुनावी’ offer ख़त्म होने जा रहा है। pic.twitter.com/Y8oiFvCJTU