పాడి పరిశ్రమకు ఎన్నో అవకాశాలున్నాయి.. ఓవైపు వ్యవసాయం చేస్తూనే.. మరోవైపు పాడి ఉత్పత్తులకు రైతులు ప్రయత్నిస్తున్నారు.. కొందరైతే వ్యవసాయానికి స్వస్తి చెప్పి.. పాల డైరీలను నిర్వహిస్తూ.. ఉపాధి పొందుతూ.. మరో నలుగురికి పని కల్పిస్తున్నారు. క్రమంగా పాలు, పాల ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుండడంతో.. రైతులకు లాభాలు తెచ్చి పెడుతోంది ఈ పరిశ్రమ.. అయితే, నిర్వహణ కూడా చాలా కష్టంతో కూడుకున్న పనే.. బర్రెలు, ఆవులు తీసుకురావడం.. వాటికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఏర్పాట్లు చేయడం.. గడ్డి, గాసం, వాటిని శుభ్రపరచడం.. సమయానుకూలంగా ఫీడ్ ఇవ్వడం.. అవసరమైన వైద్యం చేయించడం.. ఇలా ఎన్నో సవాళ్లు ఉన్నాయి.. ఈ నేపథ్యంలో.. డైరీలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి.. వాటి నిర్వహణ ఎలా ఉంది.. ఎలాంటి సవాళ్లు ఆ రైతులు ఎదుర్కుంటున్నారో మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం..
Read Also: AP: కొత్త జిల్లా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చార్జీల సవరణ.. ఉత్తర్వులు జారీ..
తెలంగాణలోని గద్వాల్ జిల్లా పుటాన్‌పల్లి గ్రామంలో కోటేశ్వర్‌రెడ్డి అనే రైతు గత 14 ఏళ్లుగా డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు.. వ్యవసాయానికి బదులు డైరీ ఫామ్ పెట్టుకున్న తర్వాతే మా పరిస్థితి మారిందని చెబుతున్నారు.. ప్రతీ రోజు ఉదయం 3 గంటలకు లేవడం.. 4 గంటల నుంచే పాలు పితకడం ప్రారంభిస్తామని.. ఆ తర్వాత రెండు గంటల గ్యాప్ తీసుకుని ఉదయం 8 గంటలకు తిరిగి పని ప్రారంభిస్తారు.. ఈ లోగా మేం పాలు తీసుకెళ్లి.. స్వీటు షాపులకు.. ఇతరులకు పాలు పోసి వస్తామని.. ఆ తర్వాత గేదెలకు నీళ్లు పెట్టడం.. గడ్డి వేయడం.. దానం వేయడం, చొప్ప తీసుకురావడం.. అది కట్ చేసి వేయడం.. ఇలాంటి పనులు ఉంటాయని వెల్లడించారు.. మొత్తంగా 60 వరకు బర్రెలు తమ డైరీలో ఉన్నాయని.. అందులో 50కి పైగా పాలు ఇస్తాయని రోజు 310-320 లీటర్లు పాల ఉత్పత్తి చేస్తున్నట్టు తెలిపారు.. ఇక, బర్రెలలోని రకాలు.. వాటి పోషణ, తీసుకుంటున్న జాగ్రత్తలు.. చేయాల్సిన పనులు ఆ రైతు మాటల్లోనే తెలుసుకోవడానికి డైరీలో ఒక రోజు కార్యక్రమంలో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి..