కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది.. ఇప్పటికే విస్తృతంగా ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ టీకాలు పంపిణీ జరగగా.. మరోవైపు బూస్టర్ డోస్ పంపిణీపై కూడా ఫోకస్ పెట్టింది కేంద్రం.. ఇప్పటివరకు, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ కార్మికులు మరియు 60+ ఏజ్ గ్రూప్ వారు ఇలా 2.4 కోట్ల కంటే ఎక్కువ మందికి బూస్ట్ డోస్ పంపిణీ జరగగా.. ఇప్పుడు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.. అందరికీ వ్యాక్సిన్ అందించాలనే నిర్ణయానికి వచ్చింది.. అందులో భాగంగా 18 ఏళ్లు పైబడినవారికి కోవిడ్ 19 బూస్టర్ డోస్ పంపిణీ చేపట్టనున్నారు.. ఏప్రిల్ 10వ తేదీ నుంచి ప్రైవేట్ ఆస్పత్రుల్లో 18 ఏళ్లు పైబడిన వారందరికీ బూస్టర్ డోస్ వేయనున్నారు..
Read Also: Supreme Court: ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు.. సుప్రీం కీలక నిర్ణయం
ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఏప్రిల్ 10 నుండి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ కోవిడ్ -19 బూస్టర్ డోస్ అందుబాటులో ఉంటుందని ఈ రోజు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.. ఇదిలా ఉండగా, ఫస్ట్ మరియు సెకండ్ డోసుల కోసం ప్రభుత్వ టీకా కేంద్రాల ద్వారా ఉచిత టీకా కార్యక్రమం కొనసాగుతూనే ఉంది.. 18 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకుని తొమ్మిది నెలలు పూర్తి అయిన తర్వాత బూస్టర్ డోస్‌కు అర్హులు. ఆదివారం నుంచి అన్ని ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ కార్మికులు, 60 ఏళ్లు పైబడినవారు 2.4 కోట్ల కంటే ఎక్కువ ముందు బూస్టర్ డోసు తీసుకున్నారు.. దేశంలోని మొత్తం జనాభాలో 15 ఏళ్లు పైబడినవారిలో 96 శాతం మంది కనీసం ఒక కోవిడ్ వ్యాక్సిన్ డోస్‌ను పొందారు, 15 ఏళ్లు దాటిన జనాభాలో 83 శాతం మంది రెండు డోస్‌ల వ్యాక్సిన్ తీసుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి.