హైదరాబాద్ నుంచి ఏపీ రాజధాని అమరావతి ప్రాంతానికి వచ్చి పని చేస్తున్న ఉద్యోగుల ఉచిత వసతి సదుపాయాన్ని మరో రెండు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏప్రిల్ 30వ తేదీ అంటే ఇవాళ్టితో గతంలో పొడిగించిన సమయంలో ముగియడంతో.. మే 1 తేదీ నుంచి జూన్ 30 తేదీ వరకూ ఉచిత వసతి సదుపాయాన్ని పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సచివాలయం మహిళా ఉద్యోగుల సంఘం, ఏపీ ఎన్జీఓలు, ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ ఇతర ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు.. మరో రెండు నెలల పాటు ఉచిత వసతి పొడిగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం.. అయితే, ఏపీ సచివాలయం, శాసనసభ, హెచ్‌వోడీ కార్యాలయాలు, హైకోర్టు, రాజ్ భవన్ ఉద్యోగులకు మాత్రమే ఈ పొడిగింపు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం.
Read Also: YS Jagan: మరో 12 మెడికల్ కాలేజీలకు అనుమతి ఇవ్వండి..