Yadadri: కొండపై పార్కింగ్ ఫీజు గంటకు రూ. 500.. క్లారిటీ ఇచ్చిన ఈవో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాదాద్రి ఆలయంలో పునర్‌ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు ప్రైవేట్ వాహనాలను కొండపైకి అనుమతించలేదు అధికారులు.. ఎవ్వరైనా భక్తులు కొండపైకి చేరుకోవాలంటే.. ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కల్పించారు.. లేదా మెట్ల మార్గంలో కూడా కొండపైకి చేరుకోవచ్చు.. అయితే, మే 1వ తేదీ (రేపటి) నుంచి యాదగిరిగుట్టపైకి ప్రైవేట్ వాహనాలను కూడా అనుమతించనున్నారు.. ఇదే, సమయంలో భక్తులకు షాకిచ్చే ఓ నిర్ణయం తీసుకున్నారు యాదాద్రి ఆలయ అధికారులు.. కొండపైకి అనుమతించే వాహనాలకు భారీగా పార్కింగ్ రుసుం వసూలు చేయనున్నారు.. కొండపైకి వెళ్లే వాహనాలకు గంటకు రూ.500 రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఇక, గంట దాటితే.. ప్రతీ గంటకు అదనంగా రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని.. ఫీజు నుంచి ప్రోటోకాల్, దాతల వాహనాలకు మినహాయింపు ఇచ్చినట్టు ప్రకటించారు.
Read Also: Amaravati: ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మరో 2 నెలలు ఉచితంగానే..
Also Read
- AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
- Bus Fire Accident: మీర్పేట్లో బస్సులో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
- Hyderabad: గణేష్ నిమజ్జనంలో విషాదం.. గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొని ఎస్ఐ మృతి..!
అయితే, ఇప్పటి వరకు వాహనాలను కొండపైకి అనుమతించాలని డిమాండ్ చేస్తున్న భక్తులు.. వాహనాల పార్కింగ్ ఫీజును చూసి షాకవుతున్నారు.. ఇంత భారీ తరహాలో ఫీజులు ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు.. మరోవైపు, కొండపైకి వాహనాల అనుమతి, పార్కింగ్ ఫీజులపై క్లారిటీ ఇస్తూ.. మరో ప్రకటన విడుదల చేశారు అధికారులు.. కొండపైకి వచ్చే వాహనాల్లో కేవలం నాలుగు చక్రాల వాహనములకు మాత్రమే ఫీజు వర్తిస్తుందని స్పష్టం చేశారు.. కొండపైన పార్కింగ్ స్థలం తక్కువగా ఉన్న నేపథ్యంలో.. భారీ సంఖ్యలో వాహనములు కొండపైకి చేరకుండా నివారించేందుకు మాత్రమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు గమనించాలని యాదాద్రి కార్యనిర్వహణాధికారి ప్రకటించారు.
తాజావార్తలు
-
Nissan Pixo: నిస్సాన్ పిక్సో విడుదల.. 259KM రేంజ్, 10-అంగుళాల డిస్ప్లే, Gemini వాయిస్ అసిస్టెంట్.. ఫీచర్లు ఇవే
-
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
-
Mental Illness: 20ఏళ్ల ఆయుష్షు తగ్గుతుంది!
-
Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
-
UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!