నేడు కర్ణాటక బంద్‌కు ముస్లిం సంఘాల పిలుపు.. హిజాబ్ వివాదంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో బంద్ నిర్వహిస్తున్నాయి ముస్లిం సంఘాలు నేడు హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద బీజేపీ దీక్ష.. హైకోర్టు సూచనను స్పీకర్ తిరస్కరించడాన్ని నిరసిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష పేరుతో బీజేపీ దీక్ష, అనుమతి ఇవ్వని పోలీసులు అనంతపురం జిల్లా పుట్టపర్తిలో నేడు సత్య సాయి శ్రీగిరి ప్రదర్శన కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతపురం జిల్లా కదిరి శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా […]
మేషం : ఈ రోజు ఈ రాశివారు సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. విందులలో పరిమితి పాటించండి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. ప్లీడర్లకు ఒత్తిడి, అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం, చికాకులు అధికమవుతాయి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృషభం : ఈ రోజు ఈ రాశివారు పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. నిరుద్యోగులు పోటీ పరీక్షలలో ఏకాగ్రత వహించి జయం పొందుతారు. […]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపారు బ్రదర్ అనిల్, సీనియర్ రాజకీయ నేతలతో పాటు.. క్రిస్టియన్ నేతలు, ఎస్సీ, ఎస్సీ, బీసీ సంఘాల నేతలతో సమావేశాలు నిర్వహించారు.. ఇక, త్వరలోనే వైఎస్ షర్మిల ఏపీలోనూ కొత్త పార్టీ పెడతారనే గుసగుసలు వినిపిస్తున్నాయి… తాజాగా, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై బ్రదర్ అనిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దోషులు తప్పించుకోలేరని చెప్పారు. సీబీఐ నిష్పాక్షిక దర్యాప్తు చేస్తోందన్న ఆయన.. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. అయితే, బ్రదర్ […]
జేఈఈ మెయిన్ ఎంట్రెన్స్ 2022 తేదీలు మారడంతో తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ మార్చిన ఇంటర్ బోర్డు.. తాజాగా కొత్త తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే కాగా.. ఇదే సమయంలో రాష్ట్రంలో జరగనున్న పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్… తెలంగాణలో మే 23వ తేదీ నుంచి ఎస్ఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రతీ పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించనున్నట్టు […]
తెలంగాణలో గతంలో ప్రకటించిన ఇంటర్ పరీక్షల తేదీలు మారిపోయాయి.. జేఈఈ మెయిన్ ఎంట్రెన్స్ 2022 తేదీలు మారడంతో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ మార్చనున్నట్టు.. నేడో.. రేపో కొత్త షెడ్యూల్ వస్తుందంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే కాగా.. తాజాగా, ఇంటర్ పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను ప్రకటించింది ఇంటర్ బోర్డు.. ఇక, ఏప్రిల్ 22 నుండి జరగాల్సిన పరీక్షలు… మే 6 నుండి ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చారు.. తెలంగాణలో మే 6వ […]
కర్ణాటకలో ప్రకంపనలు సృష్టించిన హిజాబ్ వివాదం సుప్రీంకోర్టు గడప తొక్కింది. విద్యాలయాల్లోకి హిజాబ్‌ను అనుమతించేది లేదన్న ఉడుపి విద్యా సంస్థ ఆదేశాలను కొట్టేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుతో తమకు న్యాయం జరగలేదని పిటిషనర్లు ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేశారు. కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తలుపు తట్టారు. హైకోర్టు తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, కర్ణాటకకు చెందిన ముస్లిం […]
జగనన్న విద్యాదీవెన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో బటన్ నొక్కి విద్యాదీవెన కార్యక్రమం కింద విద్యార్థుల తల్లుల అక్కౌంట్లకు నగదు బదిలీ చేశారు సీఎం.. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. 10.82 లక్షల మంది విద్యార్ధులకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి రూ.709 కోట్ల రూపాయలు పిల్లల తల్లుల ఖాతాలలోకి జమ చేసినట్టు వెల్లడించారు.. 100 శాతం లిటరసీ ఉన్న సమాజాలు ఎలా […]
పిల్లలు ఉత్సాహంగా ఆడుకుంటుండగా జరిగిన ఓ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.. సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్‌లో ఎయిర్ గన్ పేలి బాలిక మృతిచెందింది.. పిల్లల ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు.. వెంటనే బాలికను ఉస్మానియా ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసిన అప్పటికే మృతిచెందినట్టు తెలుస్తోంది.. ప్రస్తుతం బాలిక శాండ్వి మృతిదేహం ఉస్మానియా ఆస్పత్రిలో […]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి… ఇవాళ కూడా సభ నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం.. కల్తీ సారా మరణాలపై సీఎం వైఎస్ జగన్ సభను తప్పు దారి పట్టించారంటు స్పీకర్ పోడియం దగ్గర ఆందోళనకు దిగారు టీడీపీ సభ్యులు.. దీంతో సభ్యులను ఇవాళ ఒకరోజు సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి… ఈ సందర్భంగా టీడీపీ సభ్యులపై తీవ్రస్థాయిలో మండిపడ్డ నారాయణస్వామి.. టీడీపీ సభ్యులకు సవాలు […]
తెలంగాణలో గుంట భూమి ఉన్నా.. రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలను వర్తింపజేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.. అయితే, రాష్ట్రంలోని 148 మంది రైతులకు రైతు బంధు ఆపాలని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది ఎక్సైజ్‌శాఖ.. గంజాయి పండిస్తున్న రైతులకు రైతు బంధు కట్ చేయాలని కోరింది.. గంజాయి పండిస్తున్న 148 మంది రైతులపై 121 కేసులు నమోదు అయినట్టు సీఎం దృష్టికి తీసుకెళ్లింది ఎక్సైజ్ శాఖ.. గంజాయి సాగు చేస్తున్న వీరికి రైతు బంధు నిలిపివేయాలని […]