ఎవరికైనా కొన్ని కలిసివచ్చే నెంబర్లు ఉంటాయి.. ఆ తేదీలో లేదా ఆ నెలలో.. ఏది చేసిన వాళ్లకు కలిసివచ్చే సందర్భాలుంటాయి.. దీంతో అవే తమ లక్కీ నెంబర్లుగా ఫాలో అయిపోతుంటారు.. ఇక, వికెట్ కీపర్‌గా టీమిండియాలో అడుగుపెట్టి.. జట్టును విజయాల బాట పట్టించిన జార్ఖండ్ డైనమెట్ ఎంఎస్ ధోనీ పేరు చెప్పగానే వెంటనే గుర్తుకు వచ్చేది జెర్సీ నెంబర్ 7.. ధోనీ వికెట్ల వెనుక చురుకుగా కదిలే విధానం.. బ్యాటింగ్, కెప్టెన్సీ.. ఇలా అన్నీ ఆ నెంబర్‌కు […]
కువైట్ ఆర్దియ హత్యకేసుల నిందితుడు వెంకటేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. కువైట్ సెంట్రల్ జైలులోనే సూసైడ్‌కు పాల్పడ్డాడు. కువైట్‌లో ముగ్గురిని హత్యచేసిన కేసులో వెంకటేష్ మీద ఆరోపణలు రావడంతో.. అక్కడి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఆత్మహత్యకు గల కారణాలపై అధికారుల ఆరా తీస్తున్నారు. వెంకటేష్ స్వస్థలం కడప జిల్లా. జైల్లోనే ఉరివేసుకొని మరణించాడని అక్కడి అధికారులు వెల్లడించారు. మంచానికి ఉన్న వస్త్రంతో ఉరివేసుకొని చనిపోయినట్లు తెలిపారు. బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. Read Also: […]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతీ రోజు నిరసనలు, ఆందోళనకు కొనసాగుతున్నాయి.. ఇప్పటికే పలు దఫాలుగా టీడీపీ సభ్యులను సభ నుంచి స్పీకర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.. ఇక, ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఏడోరోజు బడ్జెట్ సమావేశాల్లోనూ నిరసనలు తప్పలేదు.. మరోవైపు సభలోకి సెల్ ఫోన్లు తీసుకురావడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం.. దీనిపై స్పీకర్ తమ్మినేని రూలింగ్ ఇచ్చారు. అయితే, స్పీకర్ రూలింగ్‌పై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.. సభలో […]
తగ్గినట్టే తగ్గిన కరోనా మళ్లీ పంజా విసురుతోంది.. కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు మరోసారి ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఇజ్రాయెల్‌లో మరో కొత్త వేరియంట్‌ను గుర్తించారు. బెన్ గురియోన్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల్లో కరోనా కొత్త వేరియంట్ బయటపడినట్లు ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఒమిక్రాన్‌కు చెందిన రెండు సబ్ వేరియంట్లు BA.1, BA.2లను కొత్త వేరియంట్ కలిగి ఉన్నట్లు తెలిపింది. కొత్త వేరియంట్ సోకిన ఇద్దరు వ్యక్తులకు జ్వరం, తలనొప్పి, కండరాల బలహీనత వంటి […]
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై తీవ్రస్తాయిలో విరుచుకుపడ్డారు ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు ఆర్యవైశ్యులపై కపట ప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారు.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాచర్లలో గోపవరపు మల్లిఖార్జునరావును వేధించడంతో హఠాత్తుగా చనిపోయారని విమర్శించిన ఆయన.. చంద్రబాబు నిర్ణయాలతో ఆయన భార్య శ్రీదేవి కూడా చనిపోయారన్నారు.. ఇక, సొంత పార్టీలో ఉన్న శిద్ధా రాఘవరావును అవమానాలకు గురి చేశారని పేర్కొన్న మంత్రి వెల్లంప్లి… అమరజీవి […]
చెల్లెలి క్షేమం కోరుకోని అన్న… అన్నయ్య శ్రేయస్సు కాంక్షించని చెల్లెలు ఉండరని చెబుతారు.. తల్లిదండ్రులు ఉన్నా.. గతించినా తల్లి అంశ చెల్లిలో.. తండ్రి అంశ అన్నలో చూసుకుంటారు.. అది రక్తసంబంధం.. యుగాలుగా ఏర్పడింది.. యుగాంతం వరకూ ఉంటుంది.. ఇక, ఇంట్లో ఏ శుభకార్యం అయినా.. చెల్లి ఇంట్లో అన్నదే సందడి.. అన్న ఇంట్లో చెల్లిదే అంతా.. ఇప్పుడు పరిస్థితులు కొంత మారినా.. ఇది మాత్రం కొనసాగుతూనే ఉంది. అయితే, ఓ చెల్లి తన ఇంట్లో ఓ శుభకార్యం […]
హోలీ వేడుకలతో జంటనగరాల పరిధిలో పోలీసులు 48 గంటల పాటు ఆంక్షలు విధించారు. హైదరాబాద్ పరిధిలో హోలీ రోజు మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బులు మూసివేయాలని ఆదేశించారు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలపై నిషేధం విధించారు. అపరిచిత వ్యక్తులు, వాహనాలు, భవనాలపై రంగులు పోయడం చేయకూడదని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని […]
ఎల్ఐసీ ఐపీవో ద్వారా 5 శాతం వాటాను విక్రయించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కేరళ అసెంబ్లీ వ్యతిరేకించింది. ఐపీవోకు వ్యతిరేకంగా ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. జాతి అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఎల్ఐసీ విషయంలో కేంద్రం పునరాలోచన చేయాలని కోరింది. ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఎల్ఐసీని ప్రైవేటీకరించడం లేదని, ఐపీవో ద్వారా ఐదు శాతం వాటాలను మాత్రమే విక్రయిస్తున్నామని ప్రభుత్వం వాదిస్తోందని చెప్పారు విజయన్. […]
ఇందిరా పార్క్ వద్ద ఈ రోజు బీజేపీ తల పెట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షకు ఎక్కటేలకు అనుమతి ఇచ్చారు హైదరాబాద్ పోలీసులు.. తెలంగాణ అసెంబ్లీ నుండి బీజేపీ సభ్యుల సస్పెన్షన్‌ను నిరసిస్తూ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్‌లో బీజేపీ ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేయాలని నిర్ణయం తీసుకోగా… పోలీసులు అనుమతి నిరాకరించారు.. దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ బీజేపీ నేతలు.. ప్రజాస్వామ్యం గొంతు నులిమే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.. ఇందిరా పార్క్ వద్ద సీఎం ధర్నా […]
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. ఉక్రెయిన్‌పై మూడు వారాలుగా దండయాత్ర కొనసాగిస్తున్న రష్యాకు అంతర్జాతీయ న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీచేసింది. ఉక్రెయిన్‌పై సైనిక ఆపరేషన్‌ను వెంటనే నిలిపివేయాలని సూచించింది. ఉక్రెయిన్‌పై దాడులు నిలిపివేసి.. ఆ దేశ భూభాగం నుంచి రష్యా తన భద్రతా బలగాలను ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. ఉక్రెయిన్ భూభాగంపై ఇక నుంచి రష్యా సేనలు గానీ, దానికి మద్దతిచ్చే సాయుధ బృందాలు గానీ ఎలాంటి చర్యలకు పాల్పడరాదని హెచ్చరించింది. రష్యాపై అంతర్జాతీయ న్యాయస్థానంలో వేసిన […]