తెలంగాణ ప్రభుత్వం హిందూ పండగలపై ఆంక్షలు విధిస్తుందని.. కేసీఆర్ సర్కార్‌కి బతుకమ్మపై ఉన్న శ్రద్ధ వినాయక చవితి ఉత్సవాలపై ఎందుకు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్‌రావు.. దీక్షకు దిగిన విషయం తెలిసిందే.. హిందూ పండగలపై ఆంక్షలు విధించాలని చూస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించిన ఆయన.. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ ఆరోపించారు. అయితే, బేగంబజార్‌లోని భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి కార్యాలయంలో నిన్న మధ్యాహ్నం 12 గంటలకు నిరాహార దీక్ష చేపట్టిన ఆయన.. ఇవాళ విరమించారు..
Read Also:Red Sandle Smuggling: పార్టీ లేదు పుష్ప.. దొరికిపోయాం..!!
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని అధికారుల నుంచి ప్రకటన వచ్చింది.. అందుకే దీక్ష విరమిస్తున్నట్టు వెల్లడించారు. ఎల్లుండే గణేష్ నిమజ్జనం జరుగుతుంది.. తాము ప్రభుత్వ అధికారులకు పూర్తిగా సహకరిస్తామని ప్రకటించారు భగవంత్‌రావు.. ఇక, గణేష్ నిమజ్జనం రోజు అసోం ముఖ్యమంత్రి వచ్చి ప్రసంగిస్తారని తెలిపిన ఆయన.. ప్రశాంతంగా నిమర్జనం జరిగే విధంగా ప్రభుత్వ అధికారులు సహకరించాలి అని సూచించారు.. మరోవైపు.. రేపు హుస్సేన్‌సాగర్ దగ్గర ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను పరిశీలిస్తాం అన్నారు. ఇక, హిందువులు అందరూ కలిసి ఐక్యంగా ఉండి సాధించిన విజయం ఇది అని పేర్కొన్నారు భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్‌రావు.