వినాయక చవితి తెలంగాణలో ఘనంగా నిర్వహిస్తారు.. గణేష్ చవితి అనగానే రాష్ట్ర ప్రజలకు గుర్తొచ్చేది హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేషుడే… ప్రతి ఏడాది భిన్నమైన రూపాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఆకట్టుకునే ఆ మహాగణపతి.. ఈ ఏడాది భక్తులను అనుగ్రహించేందుకు సిద్ధం అవుతున్నాడు.. అందులో భాగంగా ఇవాళ ఖైరతాబాద్ గణేష్ మండపం దగ్గర మహా గణనాథుడి విగ్రహ నిర్మాణ పనులు కర్ర పూజతో ప్రారంభించారు.. నిర్జల ఏకాదశి పురస్కరించుకుని ఖైరతాబాద్ మహాగణపతికి కర్రపూజ నిర్వహించింది గణేష్ ఉత్సవ కమిటీ.. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఈ సారి ఖైరతాబాద్ మహాగణపతి మట్టితో తయారు చేయనున్న విషయం తెలిసిందే కాగా.. ఈ ఏడాది 50 అడుగుల ఎత్తులో కొలువుదీరనున్నాడు ఖైరతాబాద్ మహా గణపతి.. భక్తులకు పంచముఖ లక్ష్మీ గణపతిగా దర్శనము ఇవ్వనున్నారు మహా గణపయ్య.. ఈ రోజు నిర్వహించిన కర్ర పూజలో ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయరెడ్డి, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, సెంట్రల్ జోన్ డీసీపీ, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Read Also: Karate Kalyani: శివలింగంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి