కడపలో ఈ రోజు రాయలసీమ రణభేరి సభ నిర్వహించేందుకు కమలనాథులు సిద్ధమయ్యారు. సీమలో పెండింగ్ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు రణభేరి సభకు బీజేపీ పిలుపునిచ్చింది. ఈ వేదికపై రాయలసీమ అభివృద్ధి, ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపు, పెండింగ్ ప్రాజెక్టు సాధన కోసం వరుస ఆందోళనలు చేపట్టే దిశగా కార్యాచరణ ప్రకటించనున్నారు. రాయలసీమ విషయంలో తమ పార్టీ వైఖరి ఏమిటో మరోసారి స్పష్టం చేయనున్నారు. రాయలసీమ రణభేరి సభలో పెండింగ్ ప్రాజెక్టులు, రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని […]
తగ్గినట్టే తగ్గిన కరోనా మహమ్మారి.. మళ్లీ పంజా విసురుతోంది.. ఆసియా ఖండంతో పాటు యూరోప్ దేశాల్లో కరోనా విజృంభిస్తుండటం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ప్రపంచ దేశాలను మరోసారి అలెర్ట్ చేసింది. కరోనా ఇంకా చాలా దృఢంగానే ఉందని వైరస్ సులభంగానే వ్యాపిస్తోందని వెల్లడించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ తగ్గుముఖం పట్టడంతో వ్యాప్తి విస్తృతమవుతున్నట్లు తెలిపింది. వైరస్ ఇంకా పూర్తిగా క్షీణించలేదని, సీజనల్ వ్యాధిలా మారలేదని డబ్ల్యూహెచ్ఓ అత్యవసర విభాగాధిపతి డాక్టర్ మైక్ ర్యాన్ స్పష్టం చేశారు. […]
ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ కీలక మ్యాచ్ ఆడుతోంది భారత మహిళల జట్టు.. ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో ఓడి 4 పాయింట్లతో 4వ స్థానంలో ఉన్న మిథాలీ సేన.. వరుస విజయాలతో జోరుమీదున్న ఆస్ట్రేలియా జట్టుతో తలపడుతోంది.. ఇక, టాప్ 4లో స్థానం దక్కాలంటే మాత్రం.. ఈ మ్యాచ్‌లో భారత జట్టు తప్పనిసరిగా విజయం సాధించాలి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా… టీమిండియాకు బ్యాటింగ్ అప్పగించింది. ఈ సిరీస్‌లో ముందుకు సాగాలంటే.. ఈ మ్యాచ్ […]
నేడు కడపలో బీజేపీ బహిరంగసభ, రాయలసీమ రణభేరి పేరుతో బీజేపీ సభ, హాజరుకానున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పురంధేశ్వరి, ఇతర రాష్ట్ర నేతలు. నేడు మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు కీలక మ్యాచ్, ఆక్లాండ్ వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనున్న భారత మహిళల జట్టు. పంజాబ్‌లో ఇవాళ కొత్త మంత్రివర్గ ప్రమాణస్వీకారం.. ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో కేబినెట్ ప్రమాణస్వీకారం. ఏపీ వ్యాప్తంగా నేడు, రేపు నిరసనలకు టీడీపీ పిలుపు, నాటుసారా నిషేధించాలంటూ టీడీపీ ఆందోళన. ఒంగోలు ఇవాళ్టి నుండి […]
మేషం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులకు శ్రమ పనిభారం అధికమైన మున్ముందు సత్ఫలితాలు ఉంటాయి. పత్రికా సంస్థలలోని వారికి ఏకాగ్రత అవసరం. పరిశోధనాత్మక విషయాలపై ఆశక్తి చూపుతారు. బిల్డింగ్ కాంట్రాక్టర్లకు తాపి పనివారితో సమస్యలు తలెత్తుతాయి. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళుకువ ఏకాగ్రత చాలా అవసరం. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం […]
యాదాద్రి నరసింహ స్వామి దర్శనాల కోసం ఎదురుచూస్తున్న భక్తులకు శుభవార్త.. గతంలో నిర్ణయించిన ప్రకారమే స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి బాలాలయంలో కాకుండా ప్రధాన ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు అనుమతి ఇస్తారు.. యాదాద్రి స్వామివారి స్వయంభువుల దర్శనాలు ఈ నెల 28న ఉదయం 11.55 గంటలకు నిర్వహించనున్న మహాకుంభ సంప్రోక్షణతో ప్రారంభం అవుతాయని తెలిపారు ఆలయ ఈవో గీతారెడ్డి.. ఈ నెల 21 నుంచి వారం రోజుల పాటు బాలాలయంలో […]
తెలంగాణ వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయి.. కరోనా కారణంగో గత రెండేళ్లుగా సామూహిక వేడకలకు దూరమైన ప్రజలు.. ఈ సారి హోలీ పండుగను మంచి జోష్‌లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే, హోలీ వేడుకల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వ్యవహారం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది.. తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో పాల్గొన్న మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్.. చేతులో మందు బాటిల్ పట్టుకుని కార్యకర్తలతో కలిసి చిందులేశారు.. ఇక, మందు బాటిల్‌తో […]
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి రోజులు, వారాలు గడుస్తున్నాయి. వరుసగా 23వ రోజు ఉక్రెయిన్‌లో రష్యా ఎడతెగని విధ్వంసాన్ని కొనసాగిస్తోంది. ఉక్రెయిన్ ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులు చేస్తోంది. బాంబుల వర్షం కురిపిస్తోంది. ఒకవైపు చర్చలు అంటూనే.. మరోవైపు మారణహోమం సృష్టిస్తోంది. జనావాసాలపైనా రాకెట్ బాంబులు ప్రయోగిస్తోంది. దీంతో ఉక్రెయిన్ ప్రధాన నగరాలు మరుభూమిని తలపిస్తున్నాయి. గతంలో ఎంతో సుందరంగా, ఆహ్లాదంగా కనిపించిన ఉక్రెయిన్ నగరాలు.. ఇప్పుడు కకావికలంగా మారాయి. ఎక్కడ చూసిన కూలిన భవనాలు, […]
పెగాసెస్ స్పైవేర్‌పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్వో సంస్థ నాలుగైదేళ్ల క్రితం పెగాసస్ స్పైవేర్‌ను తమకు అమ్మేందుకు బెంగాల్ వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు ఆమోదం కానందున ఆ సంస్థ ఆఫర్‌ను తాము తిరస్కరించామని చెప్పారు దీదీ. నాలుగైదు ఏళ్ల క్రితం ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. పెగాసస్ స్పైవేర్ విక్రయించడానికి బెంగాల్ పోలీస్ డిపార్ట్మెంట్ను సంప్రదించిందని చెప్పారు. 25 కోట్లు డిమాండ్ చేశారని […]