ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు బహిరంగ లేఖ రాశారు తెలుగు మహిళా అధ్యక్షురాలు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత… వైసీపీ నేతలు కాలకేయుల మాదిరి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని పేర్కొన్న ఆమె… మచిలీపట్నం వీవోఏ నాగలక్ష్మిది ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. వైసీపీ నేత గరికపాటి నరసింహారావు వేధింపులపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లిన ఆమె.. ఈ మూడేళ్లలో మహిళలపై 1500కు పైగా అత్యాచారాలు, లైంగిక దాడులు జరిగితే ఏం […]
గ్రామ స్వరాజ్యం అంటూ మహాత్మా గాంధీ చెప్పిన విషయాన్ని చేసి చూపిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అంటూ ప్రశంసలు కురిపించారు మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి.. ఎంపీటీసీ సభ్యులకు, కో-ఆప్షన్ సభ్యులకు ఏర్పాటు చేసిన ట్రైనింగ్ ప్రొగ్రామ్‌లో ఆయన మాట్లాడుతూ.. అందరికీ అభినందనలు తెలిపారు.. ఇక, గతంలో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారని.. స్థానిక సంస్థలు అందరికీ ఉపయోగకరంగా ఉండాలంటే సభ్యులకు బాధ్యతను గుర్తు చేయాలని సీఎం సూచించారని.. అందుకే ఎంపీటీసీ సభ్యులకు, కో-ఆప్షన్ సభ్యులకు ట్రైనింగ్ […]
తుఫాన్ల కంటే వేగంగా విశాఖను విజయసాయి రెడ్డి ధ్వంసం చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.. విశాఖలో మీడియాతో మాట్లాడిన టీడీపీ ఉత్తరా౦ధ్ర ఇంఛార్జ్ బుద్దా వెంకన్న.. రాష్ట్ర ప్రజలంతా ‘జే’ టాక్స్ కడుతుంటే… విశాఖ ప్రజలు ‘వీజే’ టాక్స్ కడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. తుఫాన్ల కంటే వేగంగా విశాఖను విజయసాయి రెడ్డి ధ్వంసం చేస్తున్నారన్న ఆయన.. సీఎం జగన్ ఉత్తరాంధ్రలో ప్రజాదర్బార్ పెడితే ఆయనకి తెలిసినవి, తెలియకుండా విజయసాయి రెడ్డి […]
ఉక్రెయిన్, రష్యా యుద్ధం కొనసాగుతోంది. అమెరికా, ఐరోపా ఆంక్షలను లెక్కచేయడంలేదు. అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును కూడా గౌరవించడంలేదు. న్యాయస్థానం తీర్పును తాము పరిగణలోకి తీసుకోవడంలేదంటూ రష్యా ప్రకటించింది. తమ డిమాండ్లకు ఒప్పుకుంటేనే యుద్ధానికి ముగింపు అని స్పష్టంచేసింది. ఉక్రెయిన్ పై దాడులను రష్యా మరింత ఉద్ధృతం చేసింది. నగరాల్లో నివాసప్రాంతాలు, ఆస్పత్రులు, స్కూళ్లను టార్గెట్ చేస్తూ బాంబులతో విరుచుకుపడుతోంది. విధ్యంసం చేస్తోంది. పోలండ్ సరిహద్దులకు అత్యంత చేరువగా ఉన్న లీవ్ నగరం ఇప్పటివరకు పెద్దగా రష్యా దాడులకు […]
కామాంధులు కన్నుమిన్ను ఎరగకుండా దారుణాలకు ఒడిగడుతూనే ఉన్నారు.. ఇలాంటి ఘటనలపై కేసులు నమోదు చేస్తున్నా.. కఠిన శిక్షలు అమలు చేస్తున్నా… నిత్యం ఏదో ఒక చోట మాత్రం అత్యాచార ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. తాజాగా, ఓ దుర్మార్గుడు.. ఓ మహిళపై కన్నేశాడు.. పొలాల్లోకి లాక్కెళ్లి.. అత్యాచారం యత్నం చేశాడు.. ఇక, మహిళ గట్టిగా కేకలు వేయడంతో.. మహిళను కాపాడేందుకు వెళ్లాడు.. ఆమె భర్త.. దీంతో.. బాధితురాలి భర్తపై దాడి చేసిన నిందితుడు.. అతడిని తీవ్రంగా గాయపర్చి.. అక్కడి […]
రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఇప్పటికే పలు దేశాల్లో పర్యటించారు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్.. ఎన్నో ప్రాజెక్టులను, కొత్త సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టేలా చేశారు.. ఇక, రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా మంత్రి కేటీఆర్ ఇతర ఉన్నతాధికారుల బృందం అమెరికా పర్యటనకు బయల్దేరింది.. ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన మంత్రి కేటీఆర్ టీమ్.. అమెరికాలోని లాస్ ఏంజిల్స్, శాన్ డియాగో, సానో హోజే, బోస్టన్, న్యూయార్క్ వంటి నగరాల్లో పర్యటించి […]
జీ-23 కాంగ్రెస్ అసమ్మతి నేతల వరుస భేటీలు దేశ రాజకీయాల్లో కాకరేపాయి. రెబల్స్ నేతల సమావేశాలపై హాట్‌హాట్‌గా చర్చలు, విశ్లేషణలు సాగాయి. అయితే వరుస భేటీలతో హీట్ పెంచిన సీనియర్లు మొత్తానికి చల్లబడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ భేటీ అయ్యారు. 10 జనపథ్‌లోని ఆమె నివాసంలో సమావేశమై గంటకు పైగా పలు కీలక అంశాలపై చర్చించారు. సోనియాతో ముఖ్యంగా ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఆజాద్ […]
తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి.. రికార్డు స్థాయిలో ఉష్ట్రోగ్రతలు పెరిగిపోతుండటంతో మధ్యాహ్నం వేళ ప్రజలు బయట అడుగుపెట్టడానికి భయపడి పోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నంద్యాల, రెంటచింతల ప్రాంతాల్లో గరిష్టంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయవాడలో కూడా 41 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అవుతోంది. ఓవైపు ఎండలు మరోవైపు వడగాలులు ప్రజల్ని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. ఇక, మరో మూడు రోజులపాటు ఎండలు, వడగాలుల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు వాతావరణశాఖ అధికారులు. ఎండకు […]
సోషల్ మీడియా ఇప్పుడు ఎంతో మందికి చేరువైపోయింది.. పిల్లలు, యూత్, పెద్దలు అనే తేడా లేకుండా అంతా సోషల్ మీడియాలో అడుగు పెడుతున్నారు.. యాక్టివ్‌గా ఉంటున్నారు.. అన్ని విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.. ఇక, ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీలు, సంస్థలు, వ్యక్తులు ఇలా.. ఎంతో మంది తమ కార్యక్రమాలు, కార్యాచరణ అన్నీ షేర్ చేసుకుంటున్నారు.. ఇదే సమయంలో.. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా ఖాతాలను హ్యాకర్స్ బెడద వెంటాడుతూనే ఉంది.. ఇటీవల కాలంలో ఎంతో మంది సెలబ్రిటీల […]
కడపలో ఈ రోజు రాయలసీమ రణభేరి సభ నిర్వహించేందుకు కమలనాథులు సిద్ధమయ్యారు. సీమలో పెండింగ్ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు రణభేరి సభకు బీజేపీ పిలుపునిచ్చింది. ఈ వేదికపై రాయలసీమ అభివృద్ధి, ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపు, పెండింగ్ ప్రాజెక్టు సాధన కోసం వరుస ఆందోళనలు చేపట్టే దిశగా కార్యాచరణ ప్రకటించనున్నారు. రాయలసీమ విషయంలో తమ పార్టీ వైఖరి ఏమిటో మరోసారి స్పష్టం చేయనున్నారు. రాయలసీమ రణభేరి సభలో పెండింగ్ ప్రాజెక్టులు, రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని […]