ఏపీ సీఎం వైఎస్ జగన్ చరిత్రను తిరగరాస్తున్నారంటూ ప్రశంసలు కురిపించారు మంత్రి ఆర్కే రోజా.. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెళ్లేరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగన్నని విమర్శించే ఆ బ్లడీ ఫూల్స్ అందరికీ బాక్సులు బద్దలయ్యేలా ఫ్యాన్ గుర్తుకి ఓట్లు వేయండి అంటూ పిలుపునిచ్చారు.. ఈ రాష్ట్రాన్ని 15 మంది ముఖ్యమంత్రులు పాలించారు.. కానీ, వారందరి చరిత్రను తిరగరాస్తున్న చరిత్రకారుడు వైఎస్ జగన్ అని పేర్కొన్న ఆమె.. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు.
Read Also: Viral: కిలో తగ్గితే వెయ్యి కోట్లిస్తానని సవాల్.. బరువు తగ్గేందుకు ఎంపీ కసరత్తు
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో మరోసారి సత్తా చాటే అవకాశం వచ్చింది.. రూ. లక్ష 40 కోట్లతో ప్రజలకు అనేక రకాల సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదే అన్నారు రోజా.. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ కు ధీటుగా తీర్చిదిద్దారు… ఆర్‌బీకేల ద్వారా రైతులకు ఎరువులు, వ్యవసాయ పరికరాలు అందిస్తున్నారని గుర్తుచేశారు.. ఇక, టీడీపీ ప్రభుత్వంలో అర్హులకు పింఛన్ లు ఇచ్చిన దాఖలాలు లేవని మండిపడ్డ రోజా.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అర్హులకు పింఛన్లు 1వ తేదీ ఉదయం వాలంటర్ మీ ముగింటకే వచ్చి అందజేస్తున్నారని తెలిపారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో మేకపాటి విక్రమ్ రెడ్డిని లక్షకు పైగా మెజార్టీతో గెలిపించి జగన్ మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు మంత్రి ఆర్కే రోజా. కాగా, మాజీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణంతో.. ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగుతోన్న విషయం తెలిసిందే.. ఈ ఎన్నికల్లో మేకపాటి విక్రమ్‌రెడ్డిని బరిలోకి దింపారు సీఎం వైఎస్ జగన్.