వాహనదారుల అప్రమత్తం కండి… భారీ డిస్కౌంట్ల ఆఫర్ త్వరలోనే ముగియనుంది.. మరో ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉంది.. తెలంగాణ ప్రజలపై పెండింగ్ చలానా వాహనదారులపై ఆర్థిక భారం తగ్గించడానికి పోలీస్ శాఖ భారీ డిస్కౌంట్లను ప్రకటించిన విషయం తెలిసిందే.. మీరు ఊళ్లో లేకపోయినా సరే.. ఆన్లైన్లో అయినా పెండింగ్ ఛలానాలు చెల్లించమంటున్నారు పోలీస్ అధికారులు. రాయితీ వర్తింపు గడువులోగా చలాన్లు క్లియర్ చేసుకోలేకపోతే తర్వాత భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పెండింగ్ చలాన్ అమలులోకి […]
పశ్చిమ బెంగాల్లో బీర్భూమ్ జిల్లా బోగ్టూయి గ్రామంలో జరిగిన సామూహిక సజీవదహనాల అంశం కీలక మలుపు తిరిగింది. బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినా… ఘటన తీవ్ర దృష్ట్యా రాష్ట్ర పోలీసులు నిస్పక్షపాతంగా దర్యాప్తు చేయాలేరని అభిప్రాయపడింది కోల్‌కతా హైకోర్టు. నిజానిజాలను వెలికి తీసే బాధ్యతను సీబీఐకి అప్పగించింది. సామూహిక సజీవదహనాలపై సమగ్ర దర్యాప్తు చేసి… ఏప్రిల్ 7వ తేదీలోగా తమకు నివేదిక ఇవ్వాలని సీబీఐకి స్పష్టం చేసింది కోల్‌కతా హైకోర్టు. కేసుకు […]
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తిరుగులేని విజయాన్ని అందుకుంది భారతీయ జనతా పార్టీ… ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యానాథ్ ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా సాగింది. వరుసగా రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసి చరిత్ర సృష్టించారు యోగి. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో, రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్.. యోగితో ప్రమాణం చేయించారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ […]
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం, అంతర్గత కుమ్ములాటలు, అసంతృప్తులతో బేజారైపోతున్న కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన చేసేందుకు ఆపార్టీ అధినేత్రి సోనియాగాంధీ సిద్దమయ్యారు. ఢిల్లీలో కీలక భేటీని ఏర్పాటు చేశారు. ఏఐసీపీ ప్రధాన కార్యాలయంలో సోనియా అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శులు అటెండ్ అవుతారు. పార్టీ బలోపేతంపై ప్రధానంగా చర్చిస్తారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంపై నేతల నుంచి వివరాలను తీసుకోనున్నారు సోనియా. పార్టీలో […]
క్రికెట్ ప్రేమికులకు అసలైన మజా ప్రారంభం కాబోతోంది.. క్రికెట్లో పొట్టి పార్మాట్ అయిన టీ-20 మ్యాచ్‌లకు మంచి క్రేజ్ ఉంది.. ఇక, ఐపీఎల్లో అది మరింత పీక్కు వెళ్లింది.. కరోనా కంటే ముందు స్టేడియానికి వెళ్లే సందడి చేస్తే.. కోవిడ్ కారణంగా టీవీల ముందు ఎంజాయ్ చేశారు.. ఇప్పుడు పరిస్థితులు మళ్లీ కొంత మారడంతో.. స్టేడియానికి వెళ్లే అవకాశం మళ్లీ వచ్చేసింది.. ఇక, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ ఇవాళే షురూకానుంది.. […]
మేషం: ఈ రోజు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. రుణ విముక్తులు కావటంతో పాటు కొత్త రుణ యత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలతో మితంగా సంభాషించటం మంచిది. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులకు గురవుతారు. వ్యవహారాల్లో జయం, సమర్థతకు గుర్తింపు పొందుతారు. వృషభం : ఈ రోజు ఈ రాశివారి కుటుంబీకుల మధ్య ఒక శుభకార్య విషయం ప్రస్తావనకు వస్తుంది. ఖర్చుల విషయంలో ఏకాగ్రత వహించండి. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళన తప్పవు. నిశ్చితార్థం, […]
సీఎం వైఎస్ జగన్ ఎంత త్వరగా విశాఖ వెళ్లి కూర్చొంటే మాకు మరిన్ని సీట్లు పెరుగుతాయన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్.. ఇప్పటికే విశాఖలో అరాచకం.. భూకబ్జాలు పెరిగాయి.. సీఎం వెళ్తే మరింతగా పెరుగుతాయని.. విజయసాయి దెబ్బకు ఇప్పుడు విశాఖలో అందరూ భయపడుతున్నారు.. రేపు సీఎం వెళ్తే ఆయనకు భయపడతారని మీడియా చిట్‌చాట్‌లో పేర్కొన్నారు.. 1200 గజాల భూమి ఉన్న ప్రతి విశాఖ వాసి గజగజలాడుతున్నాడన్న లోకేష్… పరిపాలనా కేంద్రీకరణ.. అభివృద్ధి వికేంద్రీకరణతోనే […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు లేఖ రాశారు.. తనను ఇంకా సస్పెన్షన్‌లో కొనసాగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పేర్కొన్న ఆయన.. ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీతోనే రెండేళ్లు నిండాయని లేఖలో గుర్తుచేశారు.. రెండేళ్లకు మించి సస్పెన్షన్ ను కొనసాగించాలంటే.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి తప్పనిసరనే విషయాన్ని లేఖలో ప్రస్తావించిన ఏబీవీ. గడువులోగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకోలేదు […]