దాదాపు ఐదు నెలల విరామం తర్వాత పెట్రో ధరలు మళ్లీ పైకి కదులుతున్నాయి… వరుసగా రెండు రోజులు పెరిగిన పెట్రో ధరలు.. నిన్న మాత్రం స్థిరంగా ఉండగా.. ఇవాళ మళ్లీ వడ్డించాయి ఇంధన సంస్థలు.. లీటరు పెట్రోల్, డీజిల్‌పై 80 పైసల చొప్పున పెంచేశాయి.. దీంతో ఈ వారంలో పెట్రో ధరలు మూడోసారి పెరిగినట్టు అయ్యింది.. ఇక, తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.97.01 నుంచి రూ.97.81కి పెరగగా.. డీజిల్ ధర లీటరుకు రూ.88.27 నుంచి […]
నేడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న యోగి ఆదిత్యానాథ్.. యూపీ సీఎంగా రెండోసారి యోగికి బాధ్యతలు, సాయంత్రం 4 గంటలకు యూపీ సీఎంగా యోగి ప్రమాణం, హాజరుకానున్న ప్రధాని మోడీ, బీజేపీ అగ్రనేతలు.. నేడు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలకు బీజేపీ పిలుపు.. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ఆందోళన. తూర్పుగోదావరి జిల్లా: నేడు జాతీయ సంస్కృతి మహోత్సవాల్లో భాగంగా అమలాపురంలో శోభాయాత్ర అనంతపురం కదిరి శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామివారి […]
మేషం : ఈ రోజు ఈ రాశిలోని వ్యాపార రంగాల్లో వారికి అధికారులతో సమస్యలు తలెత్తిన తెలివితో పరిష్కరిస్తారు. విద్యార్థినులకు ఏకాగ్రత, ప్రశాంత వాతావరణం అనుకూలిస్తాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. మీపై శకునాలు, పట్టింపులు తీవ్ర ప్రభావం చూపుతాయి. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం వల్ల పైఅధికారులతో మాటపడవలసి వస్తుంది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. దూర ప్రయాణాలలో చిన్న చిన్న సమస్యలు తలెత్తుతాయి. స్త్రీలకు విదేశీ వస్తువులపై […]
బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది నాంపల్లి కోర్టు.. గతంలో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను చించివేయడం.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ని దుర్బాషలాడిన కేసు విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం.. ఈ కేసులో ఎంపీ అర్వింద్ విచారణకు హాజరుకాని కారణంగా నాన్‌బెయిల్‌బుల్ వారెంట్ ఇష్యూ చేసింది.. Read Also: KCR: కొల్హాపూర్‌లో కేసీఆర్ దంపతులు.. శ్రీ మహాలక్ష్మీకి ప్రత్యేక పూజలు కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. […]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొల్హాపూర్‌లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి బయల్దేరి వెళ్లిన కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు.. మహారాష్ట్రలోని కొల్హాపూర్ చేరుకున్నారు.. ఆ తర్వాత దేశంలోని శక్తి పీఠాల్లో ఒకటైన.. అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవ శక్తిపీఠమైన కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మీ అంబాబాయి అమ్మవారిని దర్శించుకున్నారు.. ప్రత్యేక పూజలు చేశారు కేసీఆర్ దంపతులు. అంతకుముందు కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ దంపతులకు అర్చకులు […]
హిజాబ్ వ్యవహారంపై అత్యవసర విచారణకు మరోసారి నిరాకరించింది సుప్రీంకోర్టు.. హిజాబ్‌పై కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ముస్లిం విద్యార్థులు వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.. విద్యార్థుల తరఫు సీనియర్ న్యాయవాది దేవదత్ కామత్ వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు ఆదేశాల కారణంగా విద్యార్థులకు వార్షిక పరీక్షలో సమస్య ఏర్పడిందని సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు.. విద్యార్థులు పరీక్షలకు హాజరుకాలేరు మరియు ఒక సంవత్సరం నష్టపోలేరు కాబట్టి సమస్య అత్యవసం అన్నారు.. దీనిపై ప్రధాన […]
జీడీపీ పెంచమంటే.. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచేస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. సికింద్రాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీస్ వద్ద టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె… ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రంపై ఫైర్ అయ్యారు.. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలే మనల్ని రోడ్లపైకి తీసుకువచ్చిందన్న కవిత.. తెలంగాణ ప్రజలను రోడ్లపైకి తీసుకువచ్చిన ఘనత మోడీ సర్కార్ కు దక్కుతుందని ఎద్దేవా చేశారు.. తెలంగాణలో రైతులు […]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనే కాదు.. మండలిలోనూ సస్పెన్షన్ల పర్వం కొనసాగుతూనే ఉంది.. మద్యం ఎపిసోడుపై వరుసగా ఎనిమిదో రోజూ టీడీపీ ఎమ్మెల్సీల నిరసన వ్యక్తం చేశారు.. మద్య నిషేధంపై మహిళలకు జగన్ ఇచ్చిన హామీ గోవిందా గోవిందా అంటూ ఎమ్మెల్సీల నినాదాలు చేశారు.. 42 మంది మరణాలపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ శాసన మండలి వరకు నిరసనగా ర్యాలీ చేపట్టిన ఎమ్మెల్సీలు.. మృతుల ఫోటోలకు నివాళులర్పిస్తూ నల్ల కండువాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు.. కల్తీ సారా బాధిత […]
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రోజురోజుకు తీవ్రతరం అవుతోంది. గత ఏడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనివిధంగా శ్రీలంక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వంటగ్యాస్, నిత్యావసరాలు కొండెక్కి కూర్చున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. సరఫరా కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇంధనం కోసం ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద క్యూలైన్లో గంటలకొద్దీ నిల్చోలేక ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు ఆందోళనకు దిగుతుండటంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తున్నాయి. దీంతో శ్రీలంక సర్కారు పెట్రోలు బంకుల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులకు తోడుగా […]