టెలికం మార్కెట్‌లో జియో ఎంట్రీ తర్వాత ఆ రంగంలోని ఉన్న సంస్థల అంచనాలు తలకిందులయ్యాయి.. ఫ్రీ ఆఫర్ ఎత్తివేసి.. జియో కొత్త టారిప్‌లు తెచ్చినా.. చార్జీలు పెంచుతున్నా.. ఆ సంస్థకు ఆదరణ తగ్గడం లేదనే చెప్పవచ్చు.. కొన్ని సందర్భాల్లో జియో చందాదారులు తగ్గిపోయినా.. మళ్లీ పుంజుకుంది.. ఏప్రిల్‌లో కొత్తగా 16.8 లక్షల మంది చందాదారులు చేరడం విశేషం.. దీంతో.. జియో మొబైల్ యూజర్ల సంఖ్య 40.5 కోట్లకు పెరిగి.. దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థగా కొనసాగుతోంది.
Read Also: Hyderabad: మరో దారుణం… పబ్‌లో బర్త్ డే పార్టీ.. యువతిపై అఘాయిత్యం..!
ఇక, జియో తర్వాత భారతీ ఎయిర్‌టెల్ కూడా సత్తా చాటింది.. ఏప్రిల్‌లో కొత్తగా 8.1 లక్షల మంది చందాదారులను చేర్చుకుంది.. దీంతో.. ఎయిర్‌టెల్ మొబైల్ చందాదార్ల సంఖ్య 36.11 కోట్లకు చేరింది.. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) గురువారం జారీ చేసిన నెలవారీ సబ్‌స్క్రైబర్ డేటా ప్రకారం.. ఏప్రిల్ 2022లో Vodafone Idea దాదాపు 15.7 లక్షల మంది మొబైల్ యూజర్లను కోల్పోయింది.. దీంతో.. మొత్తం సబ్‌స్క్రైబర్ బేస్ 25.9 కోట్లకు పడిపోయింది.. ట్రై డేటా ప్రకారం, ఏప్రిల్ 2022 చివరి నాటికి భారతదేశం యొక్క మొత్తం వైర్‌లెస్ కస్టమర్ల సంఖ్య 114.3 కోట్లకు చేరుకున్నారు. ఏప్రిల్ చివరి నాటికి, పట్టణ ప్రాంతాల్లో మొబైల్ యూజర్లు 62.4 కోట్లకు తగ్గగా, గ్రామీణ మార్కెట్లు 51.8 కోట్లకు పెరిగారు.. పట్టణ ప్రాంతాల్లో వృద్ధి రేటు -0.07 శాతంగా ఉంటే.. గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ వృద్ధి రేటు 0.20 శాతానికి పెరిగింది..