విశాఖపట్నంలో భూకబ్జాలపై సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. విశాఖని రాబంధుల్లా పీక్కుతింటున్నారు వైసీపీ కబ్జాకోరులు అంటూ ఫైర్ అయ్యారు.. కన్నుపడిన ప్రతి గజాన్ని కబ్జా చేస్తూ విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేస్తున్నారని విమర్శించిన ఆయన.. ఏకంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఎస్పీకి చెందిన స్థలాన్నే వైసీపీ ఎంపీ ఆక్రమించడం వైసీపీ కబ్జాపర్వంలో సరికొత్త కోణం అన్నారు. స్థలం కబ్జా చేయడమే కాకుండా రివర్సులో ఎంపీ మనుషులు ఎస్పీకే వార్నింగ్ ఇవ్వడం విశాఖలో […]
ఆ మధ్య ఆంధ్రప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాలతో కడప జిల్లా అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగిపోయింది.. దీంతో ప్రాజెక్టు సమీపంలోని కాలనీలోకి భారీగా నీరు చేరింది.. వరద ఉదృతి కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది.. భారీ వర్షాలు, వరదలతో ఒక్కసారిగా వరద నీరు వచ్చి చేరడంతో రాత్రికి రాత్రే ప్రాణాలరచేత బట్టుకోని బయటపడ్డారు పలు ప్రాంతవాసులు. కొంతమంది ప్రాణాలు కోల్పోగా.. పెద్ద ఎత్తున ఆస్తినష్టం, ప్రాణనష్టం జరిగింది. అయితే, వరదలకు […]
ఆంధ్రప్రదేశ్‌లో నాటుసారా స్థావరాలపై ఉక్కుపాదం మోపుతోంది స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)… రాష్ట్రవ్యాప్తంగా గత 16 రోజుల్లో భారీ ఎత్తున నాటుసారా స్థావరాలపై ఎస్ఈబీ దాడులు చేస్తోంది.. ఆపరేషన్ పరివర్తన్-2.0లో భాగంగా నాటు సారా స్థావరాలపై దాడులు కొనసాగిస్తుంది.. రాష్ట్ర వ్యాప్తంగా 3,403 నాటుసారా కేసుల నమోదు చేసిన అధికారులు, 2,066 మందిని అరెస్ట్ చేసినట్టు చెబుతున్నారు.. ఇక, 44 వేల లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకోగా.. 155 వాహనాలను సీజ్ చేసింది ఎస్ఈబీ.. 16 […]
సంపాదన విలువ తెలియాలంటే రూపాయి.. రూపాయి కూడబెట్టాలి అని చెబుతుంటారు పెద్దలు.. ఓ యువకుడిని చూస్తే అది నిజమేగా అనాల్సిందే.. విషయం ఏదైనా సరే.. దాని వెనుక కృషిని బట్టే ఫలితం ఉంటుంది.. ఆ యువకుడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది… అత్యంత ఖరీదైన బైక్‌ను మొత్తం రూ.1 నాణాలతో కొనుగోలు చేసి వార్తల్లో నిలిచాడు ఆ యువకుడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని సేలంలో భూబాతీ అనే యువకుడు బైక్ కొనాలని […]
అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీగా డబ్బులు వెనుకేసిన రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు.. ఒక్కరేంటి.. చిన్ననుంచి పెద్ద వరకు ఎంతో మందిపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.. అయితే, కొందరు మాత్రం అడ్డంగా బుక్కైన సందర్భాలు ఉన్నాయి.. ఇక, ఎప్పుడో చేసిన తప్పులు.. ఏళ్ల తరబడి వెంటాడి నేతలు కూడా ఉన్నారు.. తాజాగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జార్ఖండ్ విద్యాశాఖ మాజీ మంత్రి, ప్రస్తుత కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బంధు తిర్కీకి మూడేళ్ల జైలు శిక్ష విధించింది సీబీఐ ప్రత్యేక […]
విమానం ఓ కరెంట్ పోల్ ఢీకొన్న గటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్‌లో.. ప్రయాణికులతో ఎస్జీ160 విమానం ఢిల్లీ నుంచి జమ్మూకు వెళ్లాల్సి ఉంది.. ప్రయాణికుల విమానం ఎక్కిన తర్వాత.. పుష్ బ్యాక్ చేస్తున్న సమయంలో విమానం కుడి వైపు రెక్క విద్యుత్ పోల్‌ను తాకింది.. స్పైస్‌జెట్ సంస్థకు చెందిన ఆ విమానం ప్రమాదవశాత్తు విద్యుత్ పోల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.. ప్రయాణికులను […]
ఆనంద్ మహీంద్ర దేశంలో పేరుమోసిన వ్యాపారవేత్త మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో ఎంతోమందికి చేరువైన వ్యక్తి.. కొన్ని సార్లు ఆయన జోకులు వేస్తారు.. నవ్విస్తారు.. కొన్ని వీడియోలతో కట్టిపడేస్తారు.. ఆలోచింపజేస్తారు.. భవిష్యత్ వైపు బాటలు వేసుకునేవిధంగా సూచనలు చేస్తారు.. ఎంతో మందికి తన వంతుగా సాయం చేస్తుంటారు.. వ్యాపార విషయాలతో ఆయన ఎంత బిజీగా ఉన్నా.. వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్నా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ దేశం నలుమూలలా దాగిన ప్రతిభను […]
మేకపాటి గౌతమ్‌రెడ్డి నాకు మంచి మిత్రుడు.. నేను లేకుంటే గౌతమ్ అసలు రాజకీయాల్లోకి వచ్చేవాడు కాదేమో అని వ్యాఖ్యానించారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇవాళ నెల్లూరు వెళ్లిన ఆయన.. దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం గౌతమ్ రెడ్డి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించి.. గౌతమ్‌రెడ్డి సంస్మరణ సభలో పాల్గొని మాట్లాడుతూ.. గౌతమ్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.. గౌతమ్ మన మధ్య లేడనే […]
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ నెల్లూరులో పర్యటించారు.. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి నెల్లూరు పోలీసు కవాతు మైదానంలోని హెలిప్యాడ్‌కు చేరుకున్నారు.. ఆ తర్వాత రోడ్డు మార్గాన బయలుదేరి వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్నారు.. అక్కడ మేకపాటి గౌతమ్‌రెడ్డి సంతాప సభలో పాల్గొన్నారు అనంతరం మళ్లీ తిరుగు ప్రయాణం అయ్యారు.. అయితే, సీఎం వైఎస్ జగన్.. నెల్లూరు జిల్లా పర్యటనలో భద్రతా […]
చట్టాలు చేయాల్సిన సభలను భజన సభలుగా ఎలా మారుస్తారు..? అంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరుపై మండిపడ్డారు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ఈసారి జరిగిన అసెంబ్లీ సమావేశాలు సభ హుందాను దిగజార్చారన్న ఆయన.. 1953-2022 వరకు జరిగిన సమావేశాలలో ఎప్పుడూ ఇంత ఘోరంగా జరగలేదన్నారు.. ప్రజల సమస్యలు, పరిష్కారంపై చర్చే లేదు.. ఏక పక్షంగా నిర్ణయాలు ఆమోదించుకోవడం, ప్రతిపక్ష సభ్యులను తిట్టడానికే అసెంబ్లీ సమావేశాలా..? పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరితే అరెస్టులు […]