అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో నిర్వహించిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.. అంతే కాదు.. విధ్వంసాన్ని సృష్టించింది. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.. అయితే, ఈ విధ్వంసానికి కారణం రైల్వే పోలీసులే అంటున్నారు ఆందోళనకారులు.. పోలీసులు చెదరగొట్టేందుకు ప్రయత్నించినా.. రైల్వే పట్టాలపైనే తిష్టవేసిన ఆందోళనకారులు.. నిరసన తెలిపేందుకు మేం రైల్వే స్టేషన్‌కు వచ్చాం.. ముందే ప్లాన్ చేసుకున్నామని తెలిపారు.
Read Also: Agnipath Scheme: న్యాయం కావాలని అడిగితే చంపేస్తారా?
శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన మాపై రైల్వే పోలీసులు లాఠీచార్జ్ చేశారని మండిపడ్డారు ఆందోళనకారులు.. రైల్వే స్టేషన్‌లో ఈ పరిస్థితి, విధ్వంసానికి కారణం పోలీసుల లాఠీఛార్జ్‌యేనని ఆరోపిస్తున్నారు. నిరసన కార్యక్రమం నిర్వహించాలనే ముందురోజే వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్‌లు పెట్టుకున్నాం.. కేవలం రైళ్లు ఆపి నిరసన తెలుపుదాం అనుకున్నాం.. కానీ, ఉద్రిక్త పరిస్థితులకు పోలీసులే కారణం అన్నారు. ఇక, మాకు ఇప్పటికే ఫిజికల్, మెడికల్ టెస్ట్‌లు పూర్తయ్యాయి.. రెండేళ్లుగా రాతపరీక్ష కోసం ఎదురుచూస్తున్నాం.. అగ్నిపథ్ పథకం తీసుకొస్తే మా పరిస్థితి ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. సికింద్రాబాద్ ఘటనపై సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆరా తీస్తోంది.. ఆందోళనకారుల వాట్సాప్ చాటింగ్‌పై నిఘా పెట్టింది.. రెండు రోజుల క్రితమే స్టేషన్‌పై దాడికి ప్లాన్ జరిగినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి..