ప్రయాణాల్లో లగేజీ, విలువైన వస్తువులు మర్చిపోవడం.. కొన్నిసార్లు మారిపోవడం సర్వ సాధారణ విషయమే.. ఎంత జాగ్రత్త పడినా.. ఆ ఇబ్బందులు కొన్నిసార్లు తప్పువు.. ఇక, పోయిన లగేజీ తిరిగి పొందడం కూడా సవాల్‌తో కూడుకున్న విషయమే.. అయితే, మారిపోయిన తన లగేజీ కోసం ఓ ప్రయాణికుడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన ఆ ప్రయాణికుడు… తన లగేజీ కోసం సదరు విమానయాన సంస్థను సంప్రదించాడు.. అయితే, అవతలి ప్రయాణికుడి […]
తెలంగాణలో మార్చిలోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదు అయ్యాయి.. కొమురం భీం జిల్లా కెరమెరిలో ఇవాళ అత్యధికంగా 43.9, కౌటాలలో 43.7, చెప్రాలలో 43.8 డిగ్రీలుగా నమోదు కాగా.. జైనాథ్‌లో 43.8 డిగ్రీలు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది.. అయితే, ఎండ తీవ్రత నేపథ్యంలో పాఠశాలల సమయం కుదించాలని ఆదేశాలు జారీ చేశారు సీఎస్ సోమేష్ కుమార్.. రాష్ట్రంలో ఎండ తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా […]
ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల ఏర్పాటునకు ముహూర్తం ఖరారు చేసింది ప్రభుత్వం.. ఏప్రిల్ 4వ తేదీన ఉదయం 9.05 గంటల నుంచి 9.45 గంటల మధ్య కొత్త జిల్లాల అవతరణ జరగనుంది… ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త జిల్లాలకు రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర పడిన విషయం తెలిసిందే.. మరోవైపు… జిల్లా పునర్విభజనకు సంబంధించిన ఫైనల్ డ్రాఫ్ట్ కూడా సిద్ధం అయ్యింది.. దీనికి కాసేపటి కిత్రమే కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.. వర్చువల్‌గా సమావేశమైన ఏపీ కేబినెట్.. […]
విద్యుత్ చార్జీలను పెంచుతూ ఏపీ ఈఆర్సీ తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. పార్టీ నాయకులు, శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ప్రభుత్వంపై దశలవారీ పోరాటానికి టీడీపీ నిర్ణయం తీసుకుంది.. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల పెంపును ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.. జగన్ రెడ్డి అధికారం చేపట్టిన మూడేళ్లల్లో ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు.. ఏడు దశల్లో ప్రజలపై […]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరుసగా వడ్డింపుల పర్వానికి తెరలేపాయి.. ఇప్పటికే ఏపీలో విద్యుత్ చార్జీల పెంపునకు ఏపీ ఈఆర్సీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే కాగా… ఓవైపు పెట్రో ధరల పెంపుతో సతమతం అవుతున్న వాహనదారులకు మరో దిమ్మ తిరిగే షాక్ తగులనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి టోల్ ట్యాక్స్ అనుసరిస్తూ భారత జాతీయ రహదారుల సంస్థ టోల్ ప్లాజాల వారీగా ఉత్తర్వులు జారీ చేసింది. తేలికపాటి వాహనాల సింగిల్ జర్నీ కి టోల్ కాంట్రాక్టర్ నిర్వహిస్తున్న […]
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో రోజువారి పెట్రోల్ ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది.. అయితే, ఎన్నికలు ముగియడం.. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో.. మళ్లీ క్రమంగా పైకి కదులుతూ సామాన్యుడికి గుది బండగా మారుతున్నాయి పెట్రో ధరలు.. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. పెట్రో ధరల పెంపుపై తీవ్రంగా మండిపడ్డ ఆయన.. పెట్రో ధరల పెంపు అనేది ప్రధాని నరేంద్ర […]
రేవంత్ రెడ్డి ఐరన్ లెగ్.. ఆయన అడుగుపెట్టడంతో తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ జీరో కాబోతోంది అని వ్యాఖ్యానించారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద.. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. రేవంత్ రెడ్డి ఫాల్తూ మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.. పార్లమెంట్ సెంట్రల్ హాల్ ఇమేజ్ను అపహాస్యం చేసేలా రేవంత్ మాట్లాడారని.. బీసీ జనగణను తక్కువ చేసి వ్యాఖ్యానించారని.. వెంటనే బీసీలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.. రేవంత్ రెడ్డిని ఇప్పటికే […]
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది… అసెంబ్లీ లోపల, బయట అనే తేడాలేదు.. విషయం ఏదైనా.. రెండు పార్టీల మధ్య తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణల పర్వం కొనసాగుతోంది.. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి… పెట్రోల్, డీజిల్ ధరలపై మాట్లాడని టీడీపీ నేతలు కరెంట్ ఛార్జీల పెంపుపై మాట్లాడుతారా? అంటూ నిలదీసిన ఆయన.. చంద్రబాబు […]
ధాన్యం కొనుగోళ్ల విషయంలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆరోపణపర్వం కొనసాగుతూనే ఉంది… రాష్ట్రాలను కేంద్రం తప్పుబడుతుంటే.. తప్పంతా కేంద్రానిదే అంటున్నాయి తెలంగాణ సహా పలు రాష్ట్రాలు.. అయితే, ఈ నేపథ్యంలో బాయిల్డ్ రైస్‌పై మరోసారి తన విధానాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేసింది కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాల నుంచి బాయిల్డ్ రైస్ సేకరించేది లేదని లోక్‌సభలో స్పష్టం చేసింది కేంద్రం.. ఎంపీ దుష్వంత్ సింగ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ సహాయ మంత్రి సాధ్వి […]