Rythu Bandhu : గుడ్‌న్యూస్ చెప్పిన కేసీఆర్.. ఇక, ఖాతాల్లోకి రైతు బంధు నిధులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు గుడ్‌న్యూస్ చెప్పారు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు.. ఈ వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద అందించే రైతుబంధు నిధులను విడుదల చేయాలని నిర్ణయించారు.. ఈ నెల 28వ తేదీ నుంచి లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో రైతు బంధు సొమ్మును జమ చేయాలని నిర్ణయించారు కేసీఆర్. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్‌కు ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ సీఎం.. ప్రతీ పంటకు ఎలాగైతే రైతు బంధు నిధులు విడుదల చేస్తామో.. అదే తరహాలో రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేయాలని స్పష్టం చేశారు. దీంతో.. ఈ నెల 28 నుంచి రైతుబంధు పథకం పెట్టుబడి సాయం నిధులు.. రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.. గుంట పొలం ఉన్నా.. తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు అందిస్తున్న విషయం తెలిసిందే.. ఎప్పటిలాగే రైతుల భూ విస్తీర్ణం ప్రకారం వరుస క్రమంలో తక్కువ నుంచి ఎక్కువకు లబ్ధిదారుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయనున్నారు.
Read Also: Maharashtra Political Crisis: మౌనం వీడిన ఉద్దవ్ థాక్రే.. రెండింటికీ రాజీనామాకు రెడీ..!
Also Read
కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు ప్రతీ ఏడాది రెండు సీజన్లకు పంట పెట్టుబడా సాయం అందిస్తుంది.. ఎకరాకు రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం చేస్తున్న సంగతి విదితమే.. ఈసారి ఈ పథకం కింద అర్హులైన మరికొంత మంది రైతులు చేరారు.. ఇక, రైతుబంధు పథకం కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.7,700 కోట్లు విడుదల చేసింది.. మరోవైపు, రైతు బంధుకు సంబంధించిన సొమ్మును ఎప్పటిలాగే ఈ వానాకాలం సీజన్‌లోనూ అందిస్తామని రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని వ్యవసాయ శాఖ మంత్రి ఈరోజే తెలిపారు.. నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లోని రైతుబంధు సమితి కార్యాలయంలో వ్యవసాయ శాఖ కాల్ సెంటర్‌ను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లడుతూ.. వ్యవసాయ శాఖ కాల్ సెంటర్‌కు త్వరలోనే టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను రైతులకు వివరించడం, రైతుల విజ్ఞప్తులు స్వీకరించడం కోసమే ఈ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు మంత్రి నిరంజన్ రెడ్డి.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!