పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసి అధికారంలోకి వచ్చింది ఆమ్ఆద్మీ పార్టీ.. ఇక, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ పగ్గాలు చేపట్టిన తర్వాత.. పలు కీలక నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు.. ఇక, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌ను తక్షణం పంజాబ్‌కు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తోంది పంజాబ్ సర్కార్.. దీనిపై పంజాబ్ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్రపాలిత ప్రాంతం నిర్వహణలో సమతుల్యతను దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించిన సీఎం.. పంజాబ్ […]
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)… తన ఖాతాదారులకు కీలక సమాచారాన్ని చేరవేసింది… డిజిటల్ లావాదేవీలకే ఎక్కువగా మొగ్గుచూపుతోన్న తరుణంలో.. తాత్కాలికంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యోనో బిజినెస్ సేవలు నిలిచిపోయాయని సూచించింది.. వార్షిక ఆర్థిక కార్యకలాపాల ముగింపు సందర్భంగా.. ఈ రోజు (ఏప్రిల్ 1 శుక్రవారం) మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో ఆధారిత సేవలు అందుబాటులో ఉండవని […]
తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతల దృష్ట్యా ఒంటిపూట బడుల సమయాన్ని కుదించింది ప్రభుత్వం.. ఉదయం 8 గంటల నుంచి 11.30 వరకే పాఠశాలలు పనిచేస్తున్నాయి.. ఇక, ఒకటో తరగతి నుండి 9వ తరగతి వరకు ఫైనల్ పరీక్షల తేదీలను రీషెడ్యూల్ చేసింది విద్యాశాఖ… గతంలో నిర్ణయించిన ప్రకారం.. ఏప్రిల్ 7వ నుండి కాకుండా.. ఏప్రిల్ 16వ తేదీ నుండి ప్రారంభమై ఏప్రిల్ 22వ తేదీ వరకు నిర్వహించనున్నారు.. ఇక, ఏప్రిల్ 23వ తేదీన ఫలితాలు వెల్లడించాల్సి ఉంటుంది.. అదే […]
సిద్దిపేట జిల్లా మిర్దొడ్డిలో ఇవాళ ఉద్రిక్తత నెలకొంది.. తనకు సరైన భద్రత కల్పించడం లేదంటూ పీఎస్ లో దీక్షకు దిగారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.. దీంతో.. ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం బెజ్జంకి పీఎస్‌కు తరలించారు. ఈసందర్భంగా పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు అడ్డుపడటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.. అయితే, రఘునందన్ రావును బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. సిద్దిపేట సీపీకి ఫోన్ చేసిన ఆయన.. కొందరు […]
అవిశ్వాస తీర్మానంపై పోరాటం చేస్తున్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన.. తాను రాజీనామా చేసే ప్రసక్తేలేదని మరోసారి స్పష్టం చేశారు.. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు విదేశీ శక్తులతో కలసి ముగ్గురు దొంగలు పనిచేస్తున్నారని మండిపడ్డారు.. కొన్ని విదేశాల నుంచి మాకు మెసేజ్‌లు వస్తున్నాయని తెలిపారు.. విదేశీ శక్తులు కుట్ర చేస్తుంటే.. దేశం లోపల వారికి సహకరించే శత్రువులు కూడా ఉన్నారని, ఇద్దరు కీలక మిత్రపక్షాలు ఫిరాయించిన తర్వాత […]
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీలను పెంచుతూ ఏపీ ఈఆర్సీ ప్రకటించిన తర్వాత… ప్రజలు, ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి.. ఇప్పటికే టీడీపీ, వామపక్షాలు, బీజేపీ విద్యుత్ ఛార్జీలపై పోరాటానికి దిగుతుండగా… ఇప్పుడు జనసేన పార్టీ కూడా ఇందులో చేరింది.. విద్యుత్ ఛార్జీలపై ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అందులో భాగంగా.. రేపు అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు జనసేన నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోందన్న ఆయన.. ఒక్కసారి పవర్ ఇవ్వండి నా పవర్ […]
సమయం ఏదైనా.. సందర్భం ఏదైనా.. చుక్కా, ముక్కా ఉండాల్సిందే.. అదే మందు.. మటనో.. చికెన్ ఉండాల్సిందే.. ఇదే ఇప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తూ మద్యం అమ్మకాలు జరిగేలా చేసింది.. 2021-22 ఏడాదిలో తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు సాగాయి.. ఈ ఆర్థిక సంవత్సరంలో మద్యం డిపోల నుండి రూ.30,711 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి.. ఈరోజు ఒక్క రోజే రూ.235 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని అధికారులు వెల్లడించారు.. మొత్తంగా ఇవాళ్టితో […]
తెలంగాణలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం కొత్త రికార్డులు సృష్టించింది… ఈ ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం వచ్చినట్టు గణాంకాలు వెల్లడించారు అధికారులు.. ఒక్క మార్చి నెలలోనే రూ.1,501 కోట్ల ఆదాయం రాగా… ఈ ఆర్థిక సంవత్సరంలో (2021-22) మొత్తంగా రూ. 12,364 కోట్ల ఆదాయం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రభుత్వ ఖజానాకు చేరింది.. ఇక, గత ఏడాదితో పోలిస్తే ఇది చాలా ఎక్కువ.. ఎందుకంటే.. గత […]
చాలా రాష్ట్ర ప్రభుత్వాలు మద్యంపై ఆధారపడే నడుస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి.. ఇదే సమయంలో కొన్ని రాష్ట్రాల్లో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నారు.. బీహార్‌లో కూడా మద్యపాన నిషేధం అమలు చేస్తున్నారు.. ఇదే సమయంలో.. కల్తీ మద్యం తాగి మృతిచెందేవారి సంఖ్య కూడా పెరిగిపోతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో సీఎం నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. మద్యం సేవించే వారందరూ మహా పాపులని అభివర్ణించిన ఆయన.. వారిని భారతీయులుగా తాను భావించనని పేర్కొన్నారు.. […]
యాదాద్రిలో పునర్ నిర్మించిన శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో దర్శనాలు ప్రారంభం అయ్యాయి… క్రమంగా భక్తుల తాకిడి కూడా పెరుగుతోంది… యాదాద్రిలో పునర్ నిర్మితమైన అద్భుతమైన ఆలయాన్ని చూసి పరవశించిపోతున్నారు భక్తులు.. ఇప్పటికే ఆలయంలోనిర్వహించే వివిధ రకాల పూజలు, దర్శనాలకు సమయాలను ప్రకటించిన అధికారులు.. మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. క్రమంగా అన్ని సదుపాయాలను కల్పించే పనిలో పడిపోయారు.. అందులో భాగంగా.. రేపటి నుంచి యాదాద్రి కొండపైకి ఉచిత బస్సు సర్వీసులు ప్రారంభించనున్నారు.. లక్ష్మీ […]