కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్లీ మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది.. కఠిన నిబంధనలు పాటిస్తోంది.. అయితే, కరోనా నిబంధనల పేరుతో అధికారులు ప్రదర్శించి అత్యుత్సాహం విమర్శలకు దారితీసింది. షాంఘై సిటీలో కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలుచేస్తోన్న విషయం తెలిసిందే కాగా.. ప్రజలు క్వారెంటైన్కే పరిమితం కావాల్సిన పరిస్థితులు దాపురించాయి.. ఇదే సమయంలో, కోవిడ్ నెగిటివ్గా ఫలితం వచ్చినవాళ్లను కూడా సిటీకి దూరంగా ఏర్పాటుచేసిన పాక్షిక నివాస కేంద్రాలకు తరలిస్తున్నారని సమాచారం. షాంఘై సిటీలో 2.5 కోట్ల జనాభా ఉండగా.. […]
యాదాద్రి ఆలయంలో పునర్ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు ప్రైవేట్ వాహనాలను కొండపైకి అనుమతించలేదు అధికారులు.. ఎవ్వరైనా భక్తులు కొండపైకి చేరుకోవాలంటే.. ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కల్పించారు.. లేదా మెట్ల మార్గంలో కూడా కొండపైకి చేరుకోవచ్చు.. అయితే, మే 1వ తేదీ (రేపటి) నుంచి యాదగిరిగుట్టపైకి ప్రైవేట్ వాహనాలను కూడా అనుమతించనున్నారు.. ఇదే, సమయంలో భక్తులకు షాకిచ్చే ఓ నిర్ణయం తీసుకున్నారు యాదాద్రి ఆలయ అధికారులు.. కొండపైకి అనుమతించే వాహనాలకు భారీగా పార్కింగ్ రుసుం వసూలు చేయనున్నారు.. కొండపైకి […]
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. చైనాకు చెందిన దిగ్గజ మొబైల్ కంపెనీ షియోమీకి షాక్ఇచ్చింది.. ఏకంగా రూ.5,551.27కోట్ల డిపాజిట్లను స్తంభింపజేసింది.. ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈ నిర్ణయం తీసుకుంది ఈడీ.. చైనాకు చెందిన షియోమీ గ్రూప్ అనుబంధ సంస్థ అయిన షియోమీ ఇండియా.. 2014 ఏడాది నుంచి భారత్లో కార్యకలాపాలు సాగిస్తుంది.. కానీ, భారత్లో కార్యకలాపాలు ప్రారంభించిన ఏడాది నుంచే.. అంటే 2015 ఏడాది నుంచే ఆ కంపెనీ అక్రమంగా నిధులను ఇతర దేశాలకు తరలిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.. […]
హైదరాబాద్ నుంచి ఏపీ రాజధాని అమరావతి ప్రాంతానికి వచ్చి పని చేస్తున్న ఉద్యోగుల ఉచిత వసతి సదుపాయాన్ని మరో రెండు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏప్రిల్ 30వ తేదీ అంటే ఇవాళ్టితో గతంలో పొడిగించిన సమయంలో ముగియడంతో.. మే 1 తేదీ నుంచి జూన్ 30 తేదీ వరకూ ఉచిత వసతి సదుపాయాన్ని పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సచివాలయం మహిళా ఉద్యోగుల సంఘం, ఏపీ ఎన్జీఓలు, ఏపీ […]
ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖమంత్రి మన్సుఖ్మాండవీయతో సమావేశం అయ్యారు ఏపీ సీఎం వైఎస్ జగన్… రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో పాల్గొన్న తర్వాత కేంద్ర మంత్రితో భేటీ అయిన ఆయన.. వైద్యకళాళాలలకు అనుమతులపై చర్చించారు.. ఈ మేరకు కేంద్రమంత్రికి లేఖ అందించారు ఏపీ సీఎం.. విభజన తర్వాత రాష్ట్రంలో అత్యాధునిక వైద్య సదుపాయాల కొరత ఏర్పడిందని.. దీని కోసం హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.. కోవిడ్ […]
ఎండలు దంచికొడుతున్నాయి.. ఏళ్ల క్రితం నమోదైన రికార్డులను భానుడి భగభగలు బ్రేక్ చేస్తున్నాయి.. ఏప్రిల్ నెలే.. మే, జూన్ మాసాలుగా మారిపోయి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి.. మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి అడుగు బయటకు పెట్టాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి దాపురించింది. ఇప్పటికే చాలా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది ఐఎండీ.. ఇక, 122 ఏళ్లలో నార్త్ ఇండియాతో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి లేదు.. దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉత్తర, వాయవ్య, మధ్య భారతంలో రికార్డ్స్థాయిలో […]
జి.కొత్తపల్లి వైసీపీ గ్రామ అధ్యక్షుడు గంజి ప్రసాద్ హత్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.. స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై గ్రామస్తులు దాడికి యత్నించారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.. హత్యకు గురైన గంజి ప్రసాద్ ఫ్యామిలీతో పాటు.. మరికొందరు ఎమ్మెల్యే తలారిపై ఆరోపణలు చేస్తున్నారు.. ఈ వ్యవహారంపై స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. ఎమ్మెల్యే తలారి వెంకట్రావు సహకారంతోనే హత్య జరిగిందని కుటుంబ సభ్యులు, గ్రామస్థులూ చెబుతున్నారు.. మరి ఎమ్మెల్యే తలారి విషయంలో […]
చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కెప్టెన్గా మళ్లీ ఎంఎస్ ధోనీ రంగంలోకి దిగారు… ఈ సీజన్లో ఇప్పటికే 8 మ్యాచ్లు ఆడిన చెన్నై.. 6 పరాజయాలను చవిచూసింది.. రెండు మాత్రమే గెలిచింది.. ఒక్కప్పుడు తిరుగులేని విజయాలతో దూసుకుపోయిన ఆ జట్టు.. ఈ సీజన్లో డీలా పడడం.. ఆ జట్టు అభిమానులు, ముఖ్యంగా ఎంఎస్ ధోనీ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే సమయంలో కెప్టెన్గా ఉన్న రవీంద్ర జడేజాపై విమర్శలు పెరిగాయి.. దీంతో.. ఆటపై కూడా దృష్టిపెట్టలేకపోతున్నాడట.. వరుస ఓటములతో […]
ఏపీలో టెన్త్ పరీక్షల సమయంలో ప్రశ్నాపత్రాల లీక్లు ఆందోళనకు గురిచేస్తున్నాయి.. అయితే, పేపర్ లీక్ల వ్యవహారంపై స్పందించిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నాం, విద్యార్ధులు ఎటువంటి ఆందోళనకు గురి కావొద్దు, ప్రశాంతంగా పరీక్షలు రాయడంపై దృష్టి పెట్టాలని సూచించారు. పరీక్షలపై ప్రభుత్వం, అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉన్నాం.. పేపర్ల లీకేజి, కాపీయింగ్ కాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. Read […]
సీఎం వైఎస్ జగన్ వల్లే బీసీలకు గుర్తింపు వచ్చింది.. ఏపీ సీఎంకు జీవితాంతం బీసీలు తోడుగా ఉంటారని వ్యాఖ్యానించారు మంత్రి విడదల రజిని.. గుంటూరులో జరిగిన ముదిరాజ్ మహాసభ సన్మానానికి హాజరైన ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం జగన్ వల్లే బీసీలకు గుర్తింపు వచ్చింది.. బీసీలకు ఇచ్చిన గుర్తింపును నిలబెట్టుకుంటామన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కార్పొరేషన్లు, 10 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారని ప్రశంసలు కురిపించిన ఆమె.. ప్రభుత్వ పథకాల్లో ఎక్కువగా లబ్ధిపొందుతున్నది బీసీలే […]