గత కొంత కాలంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పేరు నిత్యం వార్తలలో వినిపిస్తోంది. కాంగ్రెస్‌లో చేరుతున్నారని హడావుడి చేశారు. ఇంతలో అదేం లేదని పీకే తేల్చేశారు. మరోవైపు, ఆయన ఇప్పటికీ టీఎంసీ, వైఎస్ఆర్సీపీ, డీఎంకే, టీఆర్ఎస్ వంటి పార్టీలకు కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ట్విటర్లో ఆయన చేసిన ప్రకటన రాజకీయ వర్గాలలో ఆసక్తిని రేపుతోంది. ప్రశాంత్ కిశోర్ తన తాజా ట్వీట్ ద్వారా పార్టీ స్థాపించే సంకేతం ఇచ్చానిపిస్తోంది. ఐతే అది ఎప్పడు […]
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్ష పత్రాల లీకేజ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. మొదటి పరీక్ష మొదలైనప్పటి నుంచి ప్రశ్నాపత్రాలు ఏదో ఒక చోట లీక్ అవుతూనే ఉన్నాయి. నంద్యాల, చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో జరిగిన పేపర్ లీకేజ్ ఘటనల్ని ఇంకా మరువకముందే.. మరోసారి కృష్ణా, కర్నూలు జిల్లాల్లో పేపర్ లీక్ వ్యవహారం సంచలనంగా మారింది. సోమవారం మ్యాథ్స్ పేపర్ సెల్ఫోన్లో ప్రత్యక్షం అవ్వడంతో.. అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. Read Also: IMD: వాతావరణశాఖ చల్లని […]
ఎప్పుడూ లేనంతగా ఎండలు దంచికొడుతున్నాయి.. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.. వడగాల్పులతో అల్లాడిపోతున్నారు జనం.. అవసరం ఉంటేనే ఇళ్ల నుంచి బయటకు రండి అంటూ వాతావరణశాఖ హెచ్చరికలు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే కాగా.. ఇప్పుడు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. వడగాల్పులు తగ్గడంతో పాటు.. వర్షలు కురిసే అవకాశం ఉందని ఈ రోజు వెల్లడించింది.. ఈ నెల 4వ తేదీ వరకు దేశంలోని వాయువ్య ప్రాంతంలో ఉరుములతోపాటు ఈదురు గాలులు వీచే […]
ఇటీవల గుంటూరు జిల్లా రేపల్లెలో జరిగిన అత్యాచార ఘటన రాష్ట్రంలో రాజకీయంగా అగ్గి రాజుకుంటోంది. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. అధికార పార్టీ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరాలు చోటు చేసుకుంటున్నాయని ప్రతిపక్ష పార్టీ నేతలు ఆరోపిస్తుండగా, వైసీపీ నేతలు అందుకు తగ్గ రీతిలోనే కౌంటర్స్ వేస్తున్నారు. తాజాగా మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రతిపక్షంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. Read Also: TS Inter Exams: ఇంటర్ పరీక్షలు.. ఆ నిబంధన […]
తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను ఇప్పటికే విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు.. మే 6 నుంచి 23 వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ జరగనుండగా.. ఇంటర్ సెంకడ్ ఇయర్ పరీక్షలను మే 7 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్నారు.. కోవిడ్, ఎండలను దృష్టిలో పెట్టుకొని ఇంటర్ పరీక్షల ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ఉమర్ జలీల్.. పరీక్షలు ముగిసిన నెల రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామని.. ఇక, ఫలితాలు వచ్చిన […]
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై దాడి జరిగింది.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.. కేఏ పాల్ వస్తున్నారనే సమాచారంతో ముందుగా జిల్లా సరిహద్దుకి చేరుకున్నారు టీఆర్ఎస్ నాయకులు, జిల్లా సరిహద్దులోని సిద్దిపేట జిల్లా జక్కపూర్ గ్రామం వద్ద ఆయన్ని అడ్డుకున్నారు.. ఇక, ఆయన మీడియాతో మాట్లాడుతుండగా.. డీఎస్పీ పక్కనే ఉండగా.. ఓ వ్యక్తి వచ్చి పాల్‌పై దాడి చేశాడు.. పాల్ చెంపపై […]
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.. అందులో భాగంగా హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో.. ఆయనతో ఓ కార్యక్రమం నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నా అనుమతి మాత్రం దొరకలేదు.. ఇక, ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది.. అయితే, ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతిపై వీసీదే తుది నిర్ణయమని చెప్పింది హైకోర్టు.. ఓయూ విద్యార్థులు వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. రాహుల్ గాంధీ టూర్ అనుమతికి సంబంధించిన అవకాశాన్ని పరిశీలించాలని […]
ఇప్పుడు వరంగల్‌లో రాజకీయ పరిణామాలు హీట్ పెంచుతున్నాయి.. ఇప్పటికే వరంగల్‌లో పలు సార్లు మంత్రి కేటీఆర్ పర్యటించారు.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పర్యటన ఖరారైన తర్వాత కూడా ఈ మధ్యే వరంగల్‌కు వెళ్లివచ్చారు.. ఇప్పుడు మరోసారి అదే జిల్లాలో టూర్‌కు సిద్ధం అయ్యారు. అది కూడా రాహుల్ గాంధీ సభ ముగిసిన మరుసటి రోజే కావడం ఆసక్తికరంగా మారింది. ఈ నెల 6వ తేదీన వరంగల్ వస్తున్నారు రాహుల్.. రైతు సంఘర్షణ సభ పేరుతో భారీ […]
ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేసి 9 నెలలే గడిచింది.. ఇప్పుడు ఆయన్ని మార్చేపనిలో పార్టీ అధిష్టానం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.. దీనికి కారణం లేకపోలేదు.. బీజేపీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ మాట్లాడుతూ.. కింది నుంచి పై స్థాయి వరకు తాము మార్పులు చేయాలనుకుంటే చేసేస్తామని, అందులో ఏమాత్రం సంకోచించడం లేదన్నారు.. గుజరాత్, ఢిల్లీ స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ వ్యాఖ్యలు చేయగా.. ఆయన కామెంట్లపై ఇప్పుడు కర్ణాటకలో తీవ్రమైన చర్చసాగుతోంది.. […]
నిరుద్యోగిత రేటు మరింతపైకి కదిలింది.. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తాజాగా విడుదల చేసిన నివేదిక నిరుద్యోగిత పెరిగినట్టు స్పష్టం చేసింది.. ఈ ఏడాది మార్చిలో 7.60 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు.. తర్వాత నెలలలో మరింత పైకి కదిలి.. ఏప్రిల్‌లో 7.83 శాతంగా నమోదైంది. అయితే, పట్టణ, గ్రామీణ ప్రాంతాలను పరిశీలిస్తే మాత్రం భిన్నంగా ఉంది.. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు మార్చి నెలలో 8.28 శాతం ఉంటే.. ఏప్రిల్ నెలలో అది […]