తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మరోసారి ఫైర్ అయ్యారు మంత్రి ఆర్కే రోజు.. ఇవాళ ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.. చంద్రబాబు వరద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డ ఆమె.. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు… పోలవరం ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని మండిపడ్డారు.. పోలవరం ప్రాజాక్ట్‌ని చంద్రబాబు ఏటీయం కార్డులా వాడుకున్నారని సంచలన ఆరోపణల చేసిన రోజా… కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. పోలవరం పూర్తి చేస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. ఇక, కుప్పంని మున్సిపాలిటీగా కూడా చేయలేని వ్యక్తి చంద్రబాబు.. పోలవరం ముంపు గ్రామాలను జిల్లాగా చేస్తారా? అంటూ ఎద్దేవా చేశారు మంత్రి ఆర్కే రోజా..
Read Also: Telangana Exams: అలర్ట్ .. నేడు ఈసెట్.. టెన్త్ , ఇంటర్ పరీక్షలు
కాగా, టీడీపీ అధికారంలోకి పోలవరం ముంపు ప్రాంతాలన్నింటిని కలిపి జిల్లాగా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.. తాజాగా, గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలు, విలీన మండలాల్లో పర్యటించిన ఆయన.. ముంపు బాధితులకు న్యాయం జరిగే వరకూ తాను అండగా ఉంటానని తెలిపారు. రాష్ట్రం బాగుపడటం కోసం త్యాగం చేసిన ముంపు బాధితులను ఆదుకోవడం కష్టం కాదన్న ఆయన.. ఒకప్పుడు పాదయాత్ర చేసి అందరికీ ముద్దులు పెట్టిన జగన్.. ఇప్పుడు గాల్లో తిరుగుతున్నాడన్నారు. పదికిలోమీటర్ల దూరం రావడానికి రెండు హెలిప్యాడ్లు కావాల్సి వచ్చిందా..? అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును కట్టలేకపోతే వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామా చేయాలని టీడీపీ అధినేత డిమాండ్ చేసిన విషయం తెలిపిందే.