Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Telangana Cm Kcr Review On Independent India Diamond Festival

Independent India Diamond Festival: కేసీఆర్‌ ఆదేశాలు.. ప్రతీ ఇంటికీ జాతీయ జెండా పంపిణీ..

Published Date :August 2, 2022 , 9:06 pm
By Sudhakar Ravula
Independent India Diamond Festival: కేసీఆర్‌ ఆదేశాలు.. ప్రతీ ఇంటికీ జాతీయ జెండా పంపిణీ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు.. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను అడుగడుగునా దేశభక్తి భావన, స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో మేల్కొలిపే విధంగా సమున్నత స్థాయిలో, అంగరంగ వైభవంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యార్థులు మొదలు కొని ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు యువతీ యువకులు, యావత్ తెలంగాణ సమాజం ఈ ఉత్సవాలల్లో ఉత్సాహంగా పాలుపంచుకోవాలని… రాష్ట్రంలోని మొత్తం 1 కోటీ 20 లక్షల గృహాలకు జాతీయ జెండాలను ఉచితంగా పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.. దేశానికి స్వాతంత్ర్య సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘ స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహం ’ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఆగస్టు 8 నుంచి 22 వరకు జరిగే కార్యక్రమాలు వాటి అమలు తీరుపై సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కె.కేశవరావు నేతృత్వంలోని కమిటీ సభ్యులు ఇతర ముఖ్యులతో ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం’ లో భాగంగా ఆగస్టు 8 నుంచి 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగే రోజు వారీ కార్యక్రమాలను సమీక్షించారు. ఆగస్టు 15 న ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రతిఇంటి పై జాతీయ జెండా కార్యక్రమం విజయవంతమయ్యే విధంగా తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. ఇందుకు సంబంధించి 9వ తేదీనుంచే రాష్ట్రవ్యాప్తంగా జాతీయ పతాకాల పంపిణీ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Read Also: Common Wealth Games 2022: టేబుల్ టెన్నిస్‌లో అద్భుత విజయం.. భారత్ ఖాతాలో మరో స్వర్ణం

వజ్రోత్సవ వేడుకల ప్రారంభోత్సవ సమారోహాన్ని హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.. ఇందులోభాగంగా ఆర్మీ/పోలీస్ బ్యాండుతో రాష్ట్రీయ సెల్యూట్.. జాతీయ గీతాలాపన,. స్వాతంత్ర్య స్పూర్తిని రగిలించే సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన నిర్వహించాలన్నారు. అనంతరం స్వాగతోపన్యాసంతో పాటు, అధ్యక్షులవారి తొలిపలుకులు., కేసీఆర్‌ వజ్రోత్సవ వేడుకల ప్రత్యేక సందేశం ప్రసగం, వందన సమర్పణ ఉంటుంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మేయర్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ అధ్యక్షులు, అన్నిజిల్లాల రైతుబంధుసమితి అధ్యక్షులు, జెడ్పిటీసీ సభ్యులు, ఎంపీపీలు, వివిధ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, అన్ని శాఖల హెచ్ వోడీలు, జిల్ లాకేంద్రాల్లో ఉండే అందరు ఐఎఎస్, ఏపిఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, ఆర్మీ ఎయిర్ ఫోర్స్ తదితర రక్షణ రంగానికి చెందిన కమాండర్స్, వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ముఖ్యాధికారులను, తదితర రెండు వేల మంది ఆహుతుల సమక్షంలో ప్రాంరభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని కేసీఆర్‌ నిర్ణయించారు.

ఇక, ఈ సమావేశంలో కీలక సూచనలు చేశారు సీఎం కేసీఆర్..

* బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులు, స్టార్ హోటల్లు, దవాఖానాల్లో, షాపింగ్ మాల్స్ లలో ప్రత్యేకాలంకరణలను చేపట్టేవిధంగా చర్యలు తీసుకోవాలి.
* ప్రభుత్వ భవనాలు ఇతర ప్రతిష్టాత్మక భవనాలను ముఖ్యమైన పబ్లిక్ ప్లేసుల్లో ఈ పదిహేను రోజుల పాటు విద్యుత్ దీపాలు, ప్రత్యేకాలంకరణలను ఏర్పాటు చేయాలి. జాతీయ జెండా ఎగరవేయాలి.
* ప్రభుత్వ మరియు ప్రయివేట్ పాఠశాల, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు, వక్తృత్వ పోటీ , వ్యాస రచన పోటీ, చిత్రలేఖనం, దేశభక్తి గీతాల పోటీలు.
* ఉపాధ్యాయులు, లెక్చరర్లకు దేశభక్తి పై కవితారచన పోటీలు నిర్వహించాలి.
* ప్రతిరోజూ ప్రార్థన సమయంలో అన్ని రకాల విద్యాసంస్థల్లో ఎంపిక చేసిన దేశభక్తి గీతాలను మైకుల ద్వారా వినిపించాలి.
* రిచర్డ్ అటెన్ బరో నిర్మించి దర్శకత్వం వహించిన …గాంధీ…సినిమాను రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో.. ప్రభుత్వ మరియు ప్రయివేటు విద్యాసంస్థల విద్యార్థినీ విద్యార్థులకు ప్రతిరోజూ ప్రదర్శించాలి.
* గ్రామం మండల జిల్లా రాష్ట్ర స్థాయిల్లో… ఫ్రీడం కప్ పేరుతో ఆటల పోటీల నిర్వహించాలి. విజేతలకు బహుమతులు ప్రధానం చేయాలి.
* వజ్రోత్సవాల సందర్భంగా విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర వర్గాల వారిని కలుపుకొని ప్రత్యేక ర్యాలీలు నిర్వహించాలి.
* ఈ పదిహేను రోజుల వేడుకల్లో ఒక రోజున రాష్ట్రమంతటా ఏక కాలంలో, ఎక్కడివాల్లక్కడ ‘ తెలంగాణ రాష్ట్ర సామూహిక జాతీయ గీతాలాపన ’జరిపించాలి. ఇందుకు పోలీసు శాఖ బాధ్యత వహించాలని డీజీపీ మహేందర్ రెడ్డికి సూచించారు.
* స్వాతంత్ర్య సమరం ఇతివృత్తంగా రాష్ట్రవ్యాప్తంగా కవిసమ్మేళనాలను, ముషాయిరాలను నిర్వహించాలని సాంస్కృతిక శాఖ అధికారులకు ఆదేశాలు.
* వనమహోత్సవం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలి. ఫ్రీడం పార్కులను ఏర్పాటు చేయాలి.
* యువతీయువకులు క్రీడాకారులు ఇతర వర్గాల భాగస్వామ్యంతో ప్రీడం 2కె రన్ నిర్వహించాలి.
* స్వాతంత్ర్య స్పూర్తిని రగలించే విధంగా బెలూన్ల ప్రదర్శన.
* రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో రక్తదాన శిబిరాలను నిర్వహించాలి.
* దవాఖానాల్లో, అనాథ శరణాలయాల్లో, జైల్లల్లో, వృద్ధాశ్రమాలల్లో పండ్లు, స్వీట్లు పంపిణీ.
* వజ్రోత్సవాల సందర్భంగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించాలి. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయితీలు, మండల పరిషత్, జిల్లాపరిషత్ , మున్సిపల్ సహా ప్రజల చేత ఎన్నిక కాబడిన అన్ని రకాల లోకల్ బాడీలు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలి.
* ఈ వజ్రోత్సవ సమాశాల్లో స్వాతంత్య్ర పోరాట వీరులకు ఘన నివాళులు అర్పించాలని నిర్ణయం.
* వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా 15 ఆగస్టుకు ముందురోజు, 14న.. తాలుకా, జిల్లా కేంద్రాల్లో, హైదరాబాద్‌ ట్యాంక్ బండ్ పై ఘనంగా బాణాసంచా కార్యక్రమాలను నిర్వహించాలి.
* జిల్లా స్థాయిలో ఇంఛార్జ్‌ మంత్రి అధ్యక్షులుగా కలెక్టరు, కన్వీనర్ గా వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు.. సభ్యులుగా ప్రత్యేక నిర్వహణ కమిటీలు వేయాలని నిర్ణయం.
* దేశ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ గాయకులు, సంగీత విద్వాంసులతో ప్రత్యేక సంగీత విభావరిని నిర్వహించాలి.
* సమాజంలోని అట్టడుగు వర్గాలను నిరాదరణకు గురైన వర్గాలను గుర్తించి ఆదుకోవడం కోసం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలి.
* జిల్లాకొక… ఉత్తమ గ్రాపంచాయితీని, మున్సిపాలిటీని, పాఠశాల, ఉత్తమ రైతు డాక్టర్, ఇంజనీరు, పోలీస్ అధికారి, తదితర ఉధ్యోగులు, కళాకారుడు, గాయకుడు, కవిని గుర్తించి సత్కరించాలని నిర్ణయం.
* రవీంద్రభారతిలో 15రోజుల పాటు స్వాతంత్ర్య సమర స్పూర్తి ఉట్టిపడే విధంగా ప్రత్యేకమైన సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm kcr
  • Independent India Diamond Festival
  • Independent India Festival
  • KCR Review
  • telangana

తాజావార్తలు

  • LG QNED Evo TV: 4K క్వాలిటీ, 330Hz గేమింగ్, AI ఫీచర్లతో.. ఎల్జీ 115 అంగుళాల స్మార్ట్ టీవీల ఆవిష్కరణ

  • CM Revanth Reddy : యువత బాట.. ఆటపాట.. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’

  • Hyundai Car Discounts: భారీ డిస్కౌంట్లు ప్రకటించిన హ్యూందాయ్.. ఏకంగా రూ.1.10 లక్షలు..

  • Rayalaseema Special Chutney : అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్ హెల్తీ రెసిపీ.. పది నిమిషాల్లో రాయలసీమ స్టైల్‌లో రెడీ చేసుకోండి!

  • Gas Prices Hiked: శ్రీలంకలో మరోసారి గ్యాస్ ధరలు పెంపు.. అర్థరాత్రి నుంచే అమలు.

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions