వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి… మృతి చెందారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈక్వెడార్‌కు సమీపంలోని ఓ ద్వీపంలో ఉంటున్న నిత్యానంద.. కొద్దిరోజుల కిందట అనారోగ్యంతో చనిపోయినట్లు వార్తలొచ్చాయి. అయితే, తప్పుడు వదంతులపై నిత్యానంద క్లారిటీ ఇచ్చారు. తాను సమాధిలోకి వెళ్లానని… తన అనుచరులు, భక్తులు, శిష్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం మాట్లాడలేకపోతున్నట్లు వివరించిన నిత్యానంద… వైద్యుల బృందం చికిత్స చేస్తున్నట్లు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. మనుషులు, పేర్లు, ప్రాంతాలను గుర్తుపట్టలేకపోతున్నానని… […]
చెన్నై పెళ్లి వేడుకలో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. లిఫ్ట్ రోప్ తెగిపోయి కిందపడ్డ ఘటనలో ఇంటర్ విద్యార్థి చనిపోయాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లిలో భోజనం వడ్డించడానికి నలుగురు యువకులు లిఫ్ట్‌లో వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడు విఘ్నేష్‌గా గుర్తించారు. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండిలోని ఓ కళ్యాణ మండపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విఘ్నేష్ ఇంటర్ చదువుకుంటూ పార్ట్ టైం క్యాటరింగ్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు… కానీ, ఆ పార్ట్ టైం జాబే […]
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉంది… ఉక్రెయిన్ నుంచి రష్యాకు తీవ్ర స్థాయిలో ప్రతిఘటన తప్పడంలేదు.. రష్యా సరిహద్దుల్లోని ఖార్కివ్‌ను మళ్లీ ఉక్రెయిన్ చేజిక్కించుకుంది. రష్యా దళాల్ని ఉక్రెయిన్ సైన్యం సమర్థవంతంగా వెనక్కి పంపిస్తోంది. సిటీ కోసం జరిగిన పోరులో తాము గెలిచినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఖార్కివ్ నుంచి శత్రు దేశ దళాలు వెనుదిరుగుతున్నట్లు తెలిపింది. ఐతే ఖార్కివ్ సమీప ప్రాంతాలపై రష్యా ఇంకా బాంబు దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖార్కివ్‌కు పది కిలోమీటర్ల దూరంలో […]
దేశం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన సమయంలో శ్రీలంక ప్రధానిగా బాధ్యతలు అందుకున్న రణిల్ విక్రమసింఘే కీలక నిర్ణయం తీసుకున్నారు.. తన మంత్రివర్గంలోకి నలుగురిని చేర్చుకున్నారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడం కోసం ప్రభుత్వ ఏర్పాటును వేగవంతం చేశారు. ఆయన మంత్రివర్గంలో గరిష్ఠంగా 20 మంది మంత్రులు మాత్రమే ఉంటారని తెలుస్తోంది. పార్లమెంటులో ఆయన మెజారిటీని నిరూపించుకోవడానికి అధికార పార్టీ అయిన శ్రీలంక పొదుజన పెరమున సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మొత్తంగా.. జీఎల్ పెయిరిస్, దినేశ్ గుణవర్ధనే, […]
భర్త రెండో పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో రగిలిపోతున్న మొదటి భార్య చేసిన పనికి ఏకంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.. బీహార్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సుపౌల్బాజార్కు ఖుర్షీద్ ఆలం అనే వ్యక్తి 10 సంవత్సరాల క్రితం బీబీ పర్వీన్ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు.. అయితే, ఎంతకీ వారికి సంతానం కలగకపోవడంతో.. పిల్లల కోసం రెండు సంవత్సరాల క్రితం రోష్మి ఖతూన్ అనే మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు ఖుర్షీద్. […]
కరోనా పుట్టినిల్లు చైనాలో ఇప్పటికీ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది.. డ్రాగన్ కంట్రీ నుంచి ప్రపంచదేశాలను చుట్టేసి కోవిడ్.. ఇప్పటికే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్.. ఇలా విరుచుకుపడుతూనే ఉంది.. అయితే, ఇటీవలే ఒమిక్రాన్ వేరియంట్ల కారణంగా చైనీయులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు వెలుగు చూస్తుండడంతో.. కట్టడికోసం సుదీర్ఘ లాక్డౌన్లు విధిస్తోంది చైనా సర్కార్.. దీంతో, ప్రజలు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారనే వార్తలు వస్తున్నాయి.. ఇదే […]
త్రిపుర రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈ పరిణామాలకు ప్రాధాన్యత ఏర్పడింది.. త్రిపుర సీఎం పదవికి బిప్లవ్దేవ్రాజీనామా చేయగా.. ఎంపీ మాణిక్సాహాను కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు.. బిప్లవ్ దేశ్ రాజీనామా తర్వాత సమావేశమైన బీజేపీ ఎమ్మెల్యేలు.. బీజేఎల్పీ నేతగా మాణిక్ సాహాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో, త్వరలోనే త్రిపుర సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు మాణిక్ సహా.. అయితే, ఎంపీగా, ప్రస్తుతం త్రిపుర బీజేపీ […]
తన సొంత నియోజకవర్గంలో కుప్పంలో ఇల్లు నిర్మించుకునేందుకు సిద్ధం అవుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇటీవలే మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించిన ఆయన.. కుప్పంలో ఇల్లు కడుతున్నా.. ప్రతీ మూడు నెలలకు నియోజకవర్గంలో పర్యటన ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇక, కుప్పం-పలమనేరు జాతీయ రహదారి సమీపంలో శాంతిపురం మండల పరిధిలోని కడపల్లె, కనమలదొడ్డి గ్రామాల మధ్య శివపురం దగ్గర చంద్రబాబు ఇల్లు కోసం స్థలం తీసుకున్నారని.. త్వరలోనే భూమి పూజలు చేసి.. నిర్మాణ […]
ఇసుక సరఫరా మరోసారి ఏపీలో రచ్చగా మారింది.. ఇసుక విక్రయాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా.. ఇసుకను ఆన్లైన్లో విక్రయిస్తున్నాం.. కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ అధికార పార్టీ కౌంటర్ ఇస్తుంది.. ఇక, ఇసుక వివాదంపై స్పందించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఇసుక పాలసీపై తప్పుడు ప్రచారం చచేస్తున్నారని మండిపడ్డ ఆయన.. నూతన ఇసుక విధానం పారదర్శకంగా ఉందన్నారు. చంద్రబాబు హయంలో ఇసుక మాఫియా రెచ్చిపోయిందన్న విమర్శించిన ఆయన.. చంద్రబాబు ఇంటి పక్కన ఇసుక అక్రమ తవ్వకాలు […]
మురమళ్ల సభలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది జనసేన పార్టీ… సీఎం వైఎస్ జగన్‌పై కౌంటర్ ఎటాక్‌కు దిగారు ఆ పార్టీ నేతలు.. సీఎం జగన్ ఈ రాష్ట్రానికి ఉత్తుత్తి పుత్రుడు అంటూ సెటైర్లు వేశారు కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్.. రాజకీయ విమర్శలు చేయడానికే సీఎం జిల్లాకు వచ్చారని దుయ్యబట్టిన ఆయన.. విద్యుత్ ఉద్యోగులకు 13వ తేదీ వరకు జీతాలు ఇవ్వలేదు.. వాటి సంగతి చూడండి […]