హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో లీక్ ఎపిసోడ్‌లో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది… అమెరికాలోని ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ అంటూ టీడీపీ ప్రచారం చేస్తున్న లేఖ ఒరిజనల్ కాదని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ స్పష్టం చేయడంతో మరోసారి దీనిపై చర్చ తెరపైకి వచ్చింది.. దీనిపై ఏపీ సీఐడీ పెట్టిన మెయిల్ కు సంబంధిత ల్యాబ్ నుంచి వివరణ వచ్చిందని చెబుతున్నారు.. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ… ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియోపై దుమారం రేగింది.. ఆ వీడియో మార్ఫింగ్ అని ఎంపీ మాధవ్ స్పష్టం చేశారని తెలిపారు.. ఇదే సమయంలో ప్రైవేట్ ల్యాబ్‌లకు సంబంధించిన నివేదికలు చట్టబద్ధం కాదని స్పష్టం చేశారు. ఎక్లిప్స్ ల్యాబ్ పేరుతో కొందరు ఇచ్చిన సర్టిఫికెట్ ఫేక్ అని తేలిందన్న ఆయన.. ఎక్లిప్స్ సంస్థకి చెందిన జిమ్ స్టాఫర్డ్ పేరుతో తిరుగుతోన్న నివేదిక తనది కాదని స్టాఫర్డి నాకు మెయిల్ ద్వారా రిప్లై ఇచ్చారని వెల్లడించారు.
Read Also: AP CID Live: AP CID Briefs Media Over MP Gorantla Madhav Video Call Case
సర్కులేషన్‌లో ఉన్న వీడియో ఒరిజనలేనని మాత్రమే ఎక్లిప్స్ సంస్థ చెప్పింది… కానీ, ఓ స్క్రీన్ మీద రన్ అవుతున్నదాన్ని తీసిన వీడియో చూసి రియలా..? ఫేకా..? అనేది ఎవ్వరూ తేల్చలేరని స్పష్టం చేశారు సునీల్ కుమార్.. ఒరిజనల్ ఫుటేజ్ ఉంటేనే వాస్తవాలు నిగ్గు తేలుతాయని జిమ్ స్టాఫర్డ్ కూడా చెప్పారన్న ఆయన.. తానిచ్చిన నివేదికలో మార్పులు చేర్పులు చేయాల్సిందిగా పోతిని తనను కోరారని జిమ్ స్టాఫర్డ్ స్వయంగా చెప్పారంటూ మరో బాంబ్ పేల్చారు.. ఇక, ఫేక్ డాక్యుమెంట్ సర్కులేట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. ప్రసాద్ పోతిని సహా తప్పుడు ప్రచారం చేసిన వారిపై ఐటీ యాక్ట్ 67 ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు, జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నుంచి నోటీసులు వచ్చాయా..? లేదా..? అనేది డీజీపీనే అడగాలని.. ఆయనే చెబతారని తెలిపారు ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్.