రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి ఎవరు? అనే ఉత్కంఠ కొనసాగుతోన్న సమయంలో.. జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న అజిత్ దోవల్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ.. దోవల్ పేరును పరిశీలిస్తోంది..
మరోసారి మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఓ మంత్రి సహా దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లడం అధికార పార్టీకి షాక్ తగిలినట్టు కాగా.. సీఎం ఉద్ధవ్ ఠాక్కే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు
త్వరలోనే రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు పేరు దాదాపు ఖరారైనట్టుగా ప్రచారం సాగుతోంది..
గత రెండేళ్లుగా కోవిడ్ ప్రభావంతో ఆర్టీసీ గడ్డు కాలమే చూసింది.. అయితే, కోవిడ్ తగ్గుముఖం పట్టడం, ప్రయాణికులు ప్రజా రవాణా ఉపయోగించటంతో మళ్లీ ఆర్టీసీకి మంచి రోజులు వచ్చినట్టు అయింది. తాజాగా పెళ్లిళ్ల సీజన్ రావటం, వేసవి సెలవులతో ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఆర్టీసీలో ప్రయాణించే వారి సంఖ్య అధికమైంది. ప్రస్తుతం ఎన్టీఆర్, కృష్ణా పరిధిలో అక్యుపెన్సి రేషియో సగటున 70 శాతానికి పైగా చేరుకుంది. ఏప్రిల్, మే నెలల్లో ఏసీ బస్సుల్లో అక్యూపెన్సీ రేషియో 80 […]
మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత బాబును గతనెల 23న అరెస్ట్ చేశారు పోలీసులు… అప్పటి నుంచి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్నారు.. ఇవాళ్టితో ఆయన రిమాండ్ ముగియడంతో ఆయనను మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు… భద్రతా కారణాల దృష్ట్యా ఆయనకు ఎస్కార్ట్ కల్పించలేమని జడ్జికి విన్నవించారు పోలీసులు… దాంతో అనంతబాబును ఆన్లైన్లో మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు… అయితే, జులై 1వ తేదీ వరకు మెజిస్ట్రేట్ రిమాండ్ ను పొడిగించారు… […]
రాష్ట్రపతి ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు భారతీయ జనతా పార్టీ కూటమి ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఉమ్మడిగా అభ్యర్థిని పోటీలో పెట్టాలని ప్రతిపక్షాలు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నాయి.. ఇందులో భాగంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే, అభ్యర్థుల విషయంలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. అంతే కాదు.. విపక్షాలు అభ్యర్థిగా ఎవరు అనుకున్నా.. నా వల్ల కాదు బాబోయ్ అన్నట్టుగా.. అంతా తప్పుకుంటున్నట్టుగా తెలుస్తోంది.. ఇప్పటికే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, జమ్ము కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా […]
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కాంగ్రెస్ ప్రతినిధి బృందం రాష్ట్రపతిని కలిసింది.. మెమోరాండం సమర్పించింది.. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రతినిధి బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు అందజేసిన లేఖను కూడా ఆయన జత చేశారు. సాయుధ బలగాల రిక్రూట్మెంట్ విధానంలో సమూల మార్పును ప్రకటించే ముందు, ప్రభుత్వం విస్తృతస్థాయి […]
అగ్నిపథ్ పథకం ఇప్పుడు కాకరేపుతోంది.. ఓవైపు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు, బంద్‌లు కొనసాగుతుంటే.. మరోవైపు ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదన్నట్టుగా నోటిఫికేషన్లకు విడుదల చేస్తోంది కేంద్రం.. దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌పై ఆందోళన నేపథ్యంలో ఇప్పటికే త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశం నిర్వహించగా.. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ రంగంలోకి దిగారు.. రేపు అనగా మంగళవారం త్రివిధ దళాధిపతులతో సమావేశం కాబోతున్నారు ప్రధాని మోడీ.. కర్ణాటక పర్యటనలో అగ్నిపథ్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేసిన ఆయన.. కొన్ని […]
ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా రచ్చ జరిగింది.. పలు ప్రాంతాల్లో భారీ విధ్వంసమే జరిగింది.. ఆ పథకాన్ని వెనక్కి తీసుకోవాలంటూ విపక్షాలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.. అయితే, కేంద్రం మాత్రం వెనక్కి తగ్గకుండా మరో ముందుడుగు వేసి నోటిఫికేషన్లు కూడా జారీ చేసింది.. ఇక, అగ్నిపథ్‌పై ఆందోళన వ్యక్తం అవుతోన్న సమయంలో.. అగ్నిపథ్, ఆ పథకాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతోన్న ఆందోళనపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. కర్ణాటక పర్యటనలో […]