హైదరాబాద్ కాటేదాన్‌లో అదృశ్యమైన సాయిప్రియ అనే యువతి.. చివరకు శవమై కనిపించింది… ఇంటి నుంచి వెళ్లిపోయిందనుకున్నారు.. ఎక్కడో ప్రాణాలతోనే ఉంటుంది అనుకున్నారు.. అంతేకాదు.. ఆమె మొబైల్ నుంచి.. ఆమె తండ్రికి వచ్చిన మెసేజ్‌లను బట్టి చూస్తే.. నేను ప్రేమించిన వ్యక్తిని నువ్వు కాదన్నావు.. అందుకే లేచిపోతున్నానంటూ సందేశాలు పంపారు.. దీంతో, ఆ యువతి ఎక్కడో ఉండే ఉంటుంది అనే నమ్మకంతో ఉన్నారు.. కానీ, ఆమె ప్రాణాలే తీశాడు.. ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడంతో ప్రియుడే ఆమెను దారుణంగా హత్య చేశాడని పోలీసులు చెబుతున్నారు. పెళ్లి ప్రతిపాదన తీసుకొస్తే.. నిరాకరించి దూరం పెట్టిన ఆ యువతని.. మాట్లాడాదామని తీసుకెళ్లిన శ్రీశైలం హత్య చేసి పూడ్చిపెట్టాడు.. పోలీసుల విచారణలో ఈ సంచలన విషయాలు వెలుగు చూశాయి..
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కాటేదాన్‌లోని టీఎన్జీవోస్ కాలనీలో ఉంటున్న సాయిప్రియ సెప్టెంబర్ 5న కాలేజీకి వెళ్తానంటూ ఇంటి నుంచి వెళ్లిపోయింది… అయితే, ఇంటికి తిరిగి రాకపోవడంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయిప్రియ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. సాయిప్రియ మాజీ ప్రియుడు శ్రీశైలంపై అనుమానంతో కేసు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో శ్రీశైలం యువతిని హత్య చేసినట్లు గుర్తించారు. అయితే, సాయి ప్రియ హత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది… వివాహం చేసుకోవాలని వేధిపులకు గురిచేశాడు శ్రీశైలం.. దీంతో, 6 నెలలుగా శ్రీశైలం ఫోన్‌నెంబర్ బ్లాక్ చేసింది సాయిప్రియ.. దీంతో, స్నాప్ చాట్‌లో చాటింగ్ ద్వారా వేధించాడు శ్రీశైలం.. ఒక సారి కలుద్దామంటూ వనపర్తికి రప్పించాడు.. వనపర్తి సమీపంలో 2 గంటల పాటు మాట్లాడుకున్నారు సాయిప్రియ, శ్రీశైలం.. అయితే, ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్తున్నాని చెప్పింది సాయిప్రియ.. పెళ్లి చేసుకున్న తర్వాత అమెరికా వెళ్లొచ్చని బలవంతపెట్టాడు శ్రీశైలం.. కానీ, పెళ్లి చేసుకునేందుకు సాయిప్రియ నిరాకరించడంతో.. ఆగ్రహించిన శ్రీశైలం.. సాయిప్రియ చున్నితోనే ఉరి వేసి హత్య చేశాడు.. ఆ తర్వాత బావమరిదితో కలిసి సాయిప్రియ మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు.. వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండలం మానాజీపేట గ్రామంలో యువతి మృతదేహాన్ని గుర్తించారు.
అయితే, మానాజీపేటకు చెందిన అంజన్న.. శంషాబాద్ సమీపంలో కుటుంబంతో ఉంటున్నాడు. అంజన్న చిన్న కుమారుడే శ్రీశైలం.. అతడికి హైదరాబాద్‌లో కాటేదాన్‌కు చెందిన సాయిప్రియతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. వారి ప్రేమ విషయాన్ని శ్రీశైలం ఇరు కుటుంబ సభ్యులకు కూడా చెప్పినట్టుగా సమాచారం.. కానీ, సాయి ప్రియ కుటుంబ సభ్యులు వారి ప్రేమకు అంగీకరించలేదు. దీంతో.. సాయి ప్రియ.. శ్రీశైలాన్ని దూరం పెట్టింది.. మాట్లాడటం మానేసింది. కానీ, సాయి ప్రియను వేధించడం ఆపలేదు శ్రీశైలం… ఫోన్ బ్లాక్ చేయడంతో.. ఆమెతో చాట్ చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతికాడు.. చివరకు స్నాప్ చాట్ ద్వారా సాయిప్రియకు టచ్‌లోకి వెళ్లాడు.. మళ్లీ ఆమెను ట్రాప్ చేశాడు.. దీంతో వారి మధ్య మూడు నెలల క్రితం నుంచి మళ్లీ మాటలు మొదలైనట్టుగా తెలుస్తోంది.. ఒకసారి కలిసి మాట్లాడుకుందామని చెప్పడంతో ఈ నెల 5న సాయిప్రియ భూత్పూర్‌కు వెళ్లింది.. అక్కడి నుంచి తమ బైక్ పై సాయిప్రియను మానాజీపేటకు తీసుకెళ్లాడు శ్రీశైలం… గ్రామంలోని ఓ చోటుకు తీసుకెళ్లి మళ్లీ పెళ్లి ప్రతిపాదన తెచ్చాడు. యువతి నిరాకరించడంతో.. మాటామాట పెరిగి గొడవ పెద్దదైంది.. దీంతో, క్షణికావేశంలో సాయిప్రియను చున్నీతో గొంతు నులిమి చంపేశాడు శ్రీశైలం… అనంతరం తన బంధువు శివ సహాయంతో కేఎల్ కాల్వ దగ్గర గొయ్యి తవ్వి.. సాయిప్రియ మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. అయితే, ఫోన్ సిగ్నల్ ఎక్కడ ఆగిపోయిందన్న కోణంలో విచారణ జరపగా.. ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చిందని చెబుబుతున్నారు పోలీసులు.