జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మరోసారి ధ్వజమెత్తారు ఏపీ మంత్రి ఆర్కే రోజా.. తిరుపతిలో వైయస్సార్ వాహనమిత్రా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా ఆటో నడిపారు.. ఇక, ఆ కార్యక్రమంలో రోజా మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. పవన్ కల్యాణ్‌ను చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేసిన ఆమె… పార్టీ పెట్టి ఎన్నికల్లోకి వెళ్లకుండా ఇతర పార్టీలకు ఓట్లేయమని చెప్పిన ఒకే ఒక వ్యక్తి పవన్ కల్యాణ్ అంటూ సెటైర్లు వేశారు.. ఇప్పుడు […]
కృష్ణాజిల్లా గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.. గుడివాడలో రోడ్లకు మరమ్మత్తులు చేయాలంటూ కొడాలి నాని ఇంటి ముట్టడికి యత్నించారు జనసేన పార్టీ శ్రేణులు.. దీంతో, జనసేన నేతలను పోలీసులు అడ్డుకున్నారు.. ఇరువురి మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకోవడంతో.. కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.. ఇక, జనసేన నాయకులను అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించగా.. తామేం నేరం చేశామంటూ ఎదురు తిరిగారు జనసైనికులు.. దీంతో, భారీగా పోలీసులను మోహరించారు.. […]
ఏ అవకాశం దొరకినా.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వంపై ఓరేంజ్‌లో విరుచుకుపడుతున్నారు తెలంగాణ సీఎం, గులాబీపార్టీ దళపతి కె.చంద్రశేఖర్‌రావు.. ఈ మధ్య మీరు గోకకున్నా.. నేను గోకుతూనే ఉంటానంటూ ప్రధాని మోడీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను, విధానాలను ఎండగడుతూ హాట్ కామెంట్లు చేస్తూ వస్తున్న కేసీఆర్.. ఇప్పుడు మరోసారి కేంద్రంపై యుద్ధం ప్రకటించారు.. దానికి పార్లమెంట్‌ను వేదికగా చేసుకోబోతున్నారు.. తమ ఎంపీలను ఈ పోరాటంలో భాగస్వాములను చేస్తూనే.. ఇతర […]
గోదావరి ఉగ్రరూపం దాల్చింది.. భద్రాచలం దగ్గర క్రమంగా గోదావరిలో నీటి ఉధృతి పెరుగుతోంది.. గోదావరి పరివాహక ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుంటున్నాయి.. భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం ఇప్పటికే 70 అడుగులకు చేరువైంది.. మరింత పెరిగే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం అవుతోంది.. భద్రాచలానికి వెంటనే హెలికాప్టర్, అదనపు రక్షణ సామగ్రి తరలించండి అంటూ సీఎస్ సోమేష్ కుమార్‌ను ఆదేశించారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. భారీ వానలతో గోదావరి ఉగ్రరూపందాల్చి ప్రవహిస్తున్న ప్రకృతి విపత్తు నేపథ్యంలో, […]
ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం ఏం చేసిందన్న దానిపై.. మేము చర్చకు సిద్ధమని సవాల్ చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుకు మేం (కేంద్ర ప్రభుత్వం) బాకీలేము… ఆ ప్రాజెక్టును భ్రష్టుపట్టించారని మండిపడ్డారు.. పోలవరాన్ని కేంద్రం కట్టించి ఉంటే ప్రాజెక్టు ఇప్పటికే పూర్తయ్యేది.. కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారని ఆరోపించారు సోమువీర్రాజు… ఇక, ఈ సమయానికే పోలవరం పూర్తి అయిఉంటే మిగులు జలాలతో […]
గోదావరిలో అంతకంతకు వరద ఉధృతి పెరుగుతూనే ఉంది.. ఎగువన భద్రాచలం వద్ద గంటగంటకు గోదావరి ప్రవాహం పెరుగుతూ.. మూడో ప్రమాదహెచ్చరిక స్థాయిని దాటుతుండగా.. పోలవరం ముంపు ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి.. ఇక, ధవళేశ్వరం దగ్గర కాటన్ బ్యారేజీకి భారీ స్థాయిలో వరదనీరు వచ్చిచేరుతోంది.. దీంతో.. అదేస్థాయిలో సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. గోదావరి వరద ఉధృతి కారణంగా ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.. […]
గోదావరి ఉగ్రరూపం దాల్చింది.. భద్రాచలం దగ్గర క్రమంగా వరద ఉధృతి పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది.. దీంతో.. దిగువ ప్రాంతంలో ప్రజలు అల్లాడిపోతున్నారు.. ముఖ్యంగా పోలవరం ముంపు మండలాల్లో పరిస్థితి దయనీయంగా తయారింది.. గోదావరి ఉగ్రరూపంతో అతలాకుతలం అవుతున్నాయి పోలవరం ముంపు మండలాలు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు ప్రజలు.. ఇప్పటికే అనేక గ్రామాలు జల దిగ్బంధంలోకి వెళ్లిపోగా.. మరోవైపు గంట గంటకు పెరుగుతున్న నీటి మట్టం.. ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది.. […]
వైఎస్సార్ వాహన మిత్ర పథకం కింది మరోసారి నిధులు విడుదల చేసేందుకు సిద్ధం అయ్యింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వరుసగా నాలుగో ఏడాది కూడా రవాణా రంగంలో స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు నిధులు మంజూరు చేస్తోంది.. ఈ పథకం కింది 2,61,516 మందికి లబ్ధి చేకూరనుండగా.. రూ.261.51 కోట్లను ఖర్చు చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. అర్హులైన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సిక్యాబ్ డ్రైవర్లకు ఒక్కో లబ్ధిదారునికి రూ.10వేల చొప్పున.. మొత్తంగా రూ.261.51 కోట్లను ఇవాళ విశాఖలో నిర్వహించే […]