తెలంగాణ రాజకీయాలు మొత్తం ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతున్నాయి.. అన్ని పార్టీల జాతీయ నేతల నుంచి రాష్ట్ర నేతలు, ఇతర జిల్లాల నేతలు.. ఇలా అంతా మునుగోడుకే క్యూ కడుతున్నారు.. తమ పార్టీ తరపున ప్రచారం చేస్తూ.. ఓట్లు అడుగుతున్నారు.. అయితే, మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో ఇవాళ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్.. ప్రచారంలో ఎదురుపడ్డారు.. దీంతో.. నమస్తే ప్రవీణ్ అన్నా అంటూ.. ఆర్‌ఎస్ ప్రవీణ్ దగ్గరకు వెళ్లి పలుకరించి ఆలింగనం చేసుకున్నారు రేవంత్‌రెడ్డి.. ఇక, ఇద్దరూ కలిసి ఫొటోలకు పోజులిచ్చారు.. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన రేవంత్‌రెడ్డి.. సంతోషాన్ని వ్యక్తం చేశారు..
Read Also: Etela Rajender : ప్రపంచం మొత్తం మునుగోడు వైపు చూస్తుంది
”మునుగోడుకు వెళ్తూ మార్గం మధ్యలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ గారిని కలిశాను. మా ఈ కలయిక యాధృచ్ఛికమే… సమ సమాజ ఉన్నతి కోసం ప్రవీణ్ లాంటి వారితో కలిసి భావాలు పంచుకోవడం సమాజానికి అవసరం, నాకు సంతృప్తి.” అంటూ రాసి.. ఆ ఫొటోలను షేర్ చేశారు రేవంత్‌రెడ్డి.. కాగా, మునుగోడులో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ, ప్రజాశాంతి లాంటి పార్టీలతో పాటు పెద్ద సంఖ్యలో ఇండిపెండెంట్లు కూడా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.. కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అయిన విషయం తెలిసిందే.. కాంగ్రెస్‌ను వీడిన ఆయన.. ఈ సారి బీజేపీ నుంచి తన అదృష్ట్యాన్ని పరిక్షించుకోవడానికి సిద్ధం అయ్యారు. నవంబర్ 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.
మునుగోడుకు వెళుతు మార్గమధ్యంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ గారిని కలిశాను. మా ఈ కలయిక యాదృచ్ఛికమే. సమ సమాజ ఉన్నతి కోసం ప్రవీణ్ లాంటి వారితో కలిసి భావాలు పంచుకోవడం సమాజానికి అవసరం, నాకు సంతృప్తి.@RSPraveenSwaero pic.twitter.com/mcLmGgegtO
— Revanth Reddy (@revanth_anumula) October 11, 2022