తెలంగాణలో ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక కాకరేపుతోంది.. ఏ పార్టీ నేతలు మాట్లాడినా.. ఇప్పుడు మునుగోడును లింక్ చేసే మాట్లాడుతున్నారు.. నవంబర్ 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా.. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.. అయితే, టీఆర్ఎస్, బీజేపీ దాగుడు మూతలు ఆడుతున్నాయి.. కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నాయని సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. హైదరాబాద్ గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్ లెవల్‌లో చీకటి ఒప్పందం జరిగిందని విమర్శించారు.. బీజేపీ, టీఆర్ఎస్ వంద కోట్లు సిద్ధం చేసుకుని ఎన్నికలకు వెళ్తున్నాయని మండిపడ్డారు.. ప్రజలు ఇప్పటికైనా ఆలోచన చేయాలి అని పిలుపునిచ్చారు జగ్గారెడ్డి.
Read Also: School Girl Marriage At Bus Stop: బస్టాండ్‌లోనే స్కూల్ విద్యార్థినికి తాళి కట్టేశాడు.. అంతా షాక్..
ఇక, టీఆర్ఎస్, బీజేపీ ఎన్నికల్లో ఖర్చు చేసే డబ్బులు ప్రజలవేనని ప్రజలు గమనించాలని సూచించారు జగ్గారెడ్డి.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కేసీఆర్ ది… సెంట్రల్ ఎన్నికల కమిషన్ నరేంద్ర మోడీది.. దీంతో, మేం ఏం ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు ఇచ్చే డబ్బులను తీసుకోండి… కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి.. డబ్బులు పంచితే ఓట్లు వేయరు అని సంకేతం ఇవ్వండి అని విజ్ఞప్తి చేశారు.. మరోవైపు.. ఎన్నికల ప్రచారానికి ఎవరు రాకున్నా.. కాంగ్రెస్ కి నష్టం లేదు అని స్పష్టం చేశారు జగ్గారెడ్డి.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమ్ముడు పోటీలో ఉన్నాడు కాబట్టి ప్రచారానికి రాలేను అని అధిష్టానానికి చెప్పారట.. ఫ్యామిలీ ప్రాబ్లమ్ వస్తుంది అని పోవడటం లేదు అని చెప్పారట అన్నారు.. అయితే, అధిష్టానానికి చెప్పారు అని వార్తలు తాను చూశాను.. అధిష్టానం అంగీకారం చెప్పిందో లేదో నాకు తెలియదు అన్నారు జగ్గారెడ్డి.
చండూర్ లో పార్టీ ఆఫీసు తగల బెట్టడం వెనక టీఆర్ఎస్, బీజేపీలు ఉన్నాయని మండిపడ్డారు జగ్గారెడ్డి.. పోలీసులు కేసీఆర్ చెప్పినట్టు వింటారని.. మోడీ దగ్గరా కూడా పోలీసు ఉందన్నారు.. టీఆర్ఎస్, బీజేపీలకు రెండు హోమ్ శాఖలు చేతిలో ఉన్నాయని ధీమాతో ఉన్నాయని.. మా దగ్గర ఏ హోం శాఖ లేదు అని వాళ్ల ధైర్యం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. దాడులు చేసి సంస్కృతి మాకు లేదని.. మేం చేస్తే కేసులు, రిమాండ్ చేస్తారన్న ఆయన.. కొందరు పోలీసులు పట్టించుకునే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు పోలీసులు వెనకాల ఉండి చేస్తున్న దాడులే ఇవి.. పోలీసుల మద్దతు లేకుండా జరిగే పని కాదన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.