విశాఖలో ఇవాళ, రేపు ఈ-గవర్నెన్స్పై జాతీయ స్ధాయి సదస్సు నిర్వహిస్తోంది ప్రభుత్వం. సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరవుతారు. వివిధ రాష్ట్రాల ప్రతినిధులు ఈ సమ్మిట్లో పాల్గొంటారు. విశాఖపట్నం డిక్లరేషన్ ఆన్ ఈ-గవర్నెన్స్ 2025ను ఈ సమావేశంలో ప్రకటించనుంది ఏపీ సర్కార్.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో నేడు కీలక చర్చలు జరగనున్నాయి.. దాంతో, పలు సభలో కీలక బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది కూటమి ప్రభుత్వం.. అసెంబ్లీలో నేడు వ్యవసాయ రంగంపై చర్చ జరగనుండగా.. వ్యవసాయ రంగంపై కీలక ప్రకటన చేయనున్నారు సీఎం చంద్రబాబు.
ఐఫోన్ కొనివ్వలేదని యువకుడు సూసైడ్ చేసుకున్నాడు.. విశాఖపట్నంలో పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.. పెందుర్తి సుజాతానగర్ లో నివాసం ఉంటున్న మృతుడు సాయి మారుతి తండ్రి చంద్రశేఖర్ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతూ ఉంటాడు.. అతని కుమారుడు సాయి మారుతి కెవిన్ కొంతకాలం హైదరాబాద్ లో సినిమా పరిశ్రమలో పనిచేసి, ఇటీవలే ఇంటికి వచ్చాడు.
నేటి నుంచి జీఎస్టీ 2.o అమల్లోకి రానుంది.. ఇవాళ్టి నుంచి అమల్లోకి జీఎస్టీ కొత్త శ్లాబ్లు అమలు చేస్తున్నారు.. దీంతో, పలు రకాల వస్తువుల ధరలు తగ్గనున్నాయి.. జీఎస్టీ కౌన్సిల్ 2025 సెప్టెంబర్ 3న చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై రెండు ప్రధాన పన్ను స్లాబులు 5 శాతం, 18 శాతం మాత్రమే ఉంటాయి. అదనంగా, విలాస వస్తువులపై 40 శాతం ప్రత్యేక పన్ను విధించనున్నారు.
Head Constable Help Students: తోటివారి కష్టాన్ని చూసి వెంటనే స్పందించి వారికి తోచిన సాయం చేసేవాళ్లు ఉంటారు.. ఐదో.. పదో ఇచ్చి తాము సాయం చేశాం అనుకునేవాళ్లు ఉంటారు.. అయితే, మండుటెండలో కాళ్లకు చెప్పులు లేకుండా స్కూల్కు వెళ్తున్న కొంతమంది పిల్లలను చూసి చలించిపోయారు వెంకటరత్నం అనే హెడ్ కానిస్టేబుల్. పెనమలూరు ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తోన్న వెంకటరత్నం.. విద్యార్థులను చూసి వదిలేయకుండా.. వెంటనే వారిని తీసుకుని సమీపంలోని ఫుట్వేర్ షాపుకు వెళ్లారు.. అక్కడ […]
బెజవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఆశ్విజ శుద్ధ పాడ్యమి సోమవారం దేవీ నవరాత్రి ఉత్సవాల్లో తొలిరోజున అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.
Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీలు టీడీపీలో చేరారు. శుక్రవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరాలని అనుకున్నామని, కానీ, మండలి చైర్మన్ తమ రాజీనామాలను ఆమోదించకుండా పక్కన పెట్టారని మర్రి రాజశేఖర్ ఆరోపించారు. దాని వెనుక ఆయనకు ప్రత్యేక అజెండా ఉందని చెప్పారు. టీడీపీలో చేరడం సొంతగూటికి వచ్చినట్లు ఉందన్నారు కల్యాణ్ […]
Off The Record: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పుకుంటున్నారు. ఒకవైపు అధికారంలో ఉన్న టీడీపీ దూకుడు పెంచుతుంటే… ప్రతిపక్షం మాత్రం తట్టుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతోందట. అలా ఎందుకంటే… పార్టీలో గ్రూపు రాజకీయలేనన్నది కేడర్ సమాధానం. నేతలు తలో దిక్కులా ఉంటే….కార్యకర్తలు దిక్కులు చూస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్గా మాజీ ఎంపీ బుట్టా రేణుక ఉన్నారు. అటు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వయసు రీత్యా అంత చురుగ్గా […]
Off The Record: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. అధికార పార్టీ కావడంతో… గెలుపు ఈజీ అని లెక్కలేసుకుంటూ… ఎవరికి వారు రేస్లోకి దూసుకొస్తున్నారు. ఇప్పటికే పార్టీ నాయకత్వం డివిజన్స్ వారీగా పని మొదలుపెట్టింది. ఈ గ్రౌండ్ వర్క్ చూస్తున్న చాలామంది ఆశావహుల పొలాల్లో మొలకలొస్తున్నాయట. వాళ్ళు చేస్తున్న హడావిడితో… పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. అంతకు మించి పార్టీలో గందరగోళ వాతావరణం ఎక్కువ అవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. బీసీ రిజర్వేషన్స్ విషయంలో […]