Nara Lokesh Kavali Visit: కావలి రాజకీయాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. నేడు మంత్రి నారా లోకేష్ కావలి నియోజకవర్గంలోని దగదర్తికి పర్యటనకు రానున్నారు. ఇటీవల మృతి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అయితే, ఈ పర్యటన వెనుక రాజకీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కావలి టీడీపీలో నెలకొన్న అంతర్గత విభేదాలకు లోకేష్ పుల్‌స్టాప్ పెట్టబోతున్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. గతంలో మాలేపాటి వర్గం మరియు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అనుచరుల మధ్య తలెత్తిన విభేదాలు తీవ్ర స్థాయికి చేరిన విషయం తెలిసిందే. మాలేపాటి ఉత్తరక్రియలకు హాజరయ్యేందుకు వచ్చిన కావ్యను ఆ వర్గం అడ్డుకోవడం, ఆ తర్వాత జరిగిన వాగ్వాదం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మాలేపాటి మానసిక క్షోభకు కారణం కావ్య వేధింపులేనని ఆయన అనుచరులు ఆరోపించిన నేపథ్యంలో, ఈ రోజు లోకేష్ పర్యటనకు మరింత ప్రాధాన్యత లభించింది. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో కలిసి లోకేష్ దగదర్తికి రావడం, సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించడం, ఆ తరువాత రెండు వర్గాల మధ్య పంచాయతీ జరగనుందనే ప్రచారం కావలి టీడీపీలో ఉత్కంఠ వాతావరణాన్ని మరింత పెంచింది.
Read Also: ఉద్యోగాల పేరుతో.. యువతులను గలీజ్ దందాలోకి దింపుతున్న ముఠా అరెస్ట్