* నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టీ-20.. మధ్యా్హ్నం 1.45 గంటలకు కరార వేదికగా టీ-20 మ్యాచ్
* బీహార్‌లో తొలివిడత ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. తొలివిడతలో 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకోనున్న 3.75 కోట్ల మంది ఓటర్లు.. బరిలో 1,314 మంది అభ్యర్థులు.. నవంబర్ 14న ఫలితాల ప్రకటన
* తొలివిడతలో బీహార్‌లో 121 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు.. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్.. కోసి, మగధ్, మిధిలాంచల్ ప్రాంతాలకు చెందిన మొత్తం 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇవాళ ఎన్నికలు
* విజయవాడ: నేడు జోగి బ్రదర్స్ బెయిల్ పిటిషన్లపై ఎక్సైజ్ కోర్టులో విచారణ.. నకిలీ మద్యం కేసులో బెయిల్ ఇవ్వాలని జోగి రమేష్, జోగి రాము పిటిషన్లు
* ఇవాళ ఉదయం 9 గంటలకు లండన్ నుంచి హైదరాబాద్‌కు సీఎం చంద్రబాబు.. హైదరాబాద్ నుంచి నేరుగా ఏపీ సచివాలయానికి వెళ్లనున్న సీఎం.. మధ్యాహ్నం సచివాలయంలో మంత్రులతో సీఎం చంద్రబాబు హై లెవల్ మీటింగ్
* తాడేపల్లి: ఇవాళ ఉదయం 10 గంటలకు వైసీపీ విద్యార్థి విభాగం నాయకులతో వైఎస్ జగన్ భేటీ.. విద్యార్థుల సమస్యలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, మెడికల్ కాలేజీల వ్యవహారంపై చర్చ
* అమరావతి : తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రజాసంకల్పం పాదయాత్ర మొదలుపెట్టి 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉదయం 10 గంటలకు కేక్ కటింగ్ కార్యక్రమం.. హాజరుకానున్న పార్టీ ముఖ్యనేతలు..
* అంబేద్కర్ కోనసీమ: నేడు రామచంద్రాపురం బంద్ కి పిలుపునిచ్చిన జేఏసీ.. రామచంద్రాపురం నియోజకవర్గాన్ని కోనసీమ నుంచి కాకినాడ జిల్లాలో కలపాలని డిమాండ్..
* నెల్లూరు: ఇటీవల మరణించిన టీడీపీ నేత మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించనున్న మంత్రి లోకేష్.. ఎమ్మెల్యే కావ్య కి, సుబ్బానాయుడు వర్గానికి మధ్య ఉన్న విభేదాలకు లోకేష్ ఫుల్ స్టాఫ్ పెట్టే అవకాశం
* తిరుమల: 21 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 63,239 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 23,436 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.78 కోట్లు
* అమరావతి: తిరువూరు పంచాయితీ పై నివేదిక రెడీ.. ఇవాళ సాయంత్రం సీఎం చంద్రబాబు కు చేరనున్న నివేదిక.. ఎమ్మెల్యే కొలికపూడి. ఎంపీ కేశినేని చిన్నితో టీడీపీ క్రమ శిక్షణ సంఘం భేటీ తర్వాత నివేదిక తయారు చేసిన కమిటీ. చంద్రబాబు కు నివేదిక చేరిన తర్వాత చర్యలు ఉండే అవకాశం.