శాసనసభ సమావేశాలకు దూరంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ... శాసన మండలిలో మాత్రం ప్రభుత్వాన్ని నిలదీస్తోంది.. దీంతో, మండలిలో కూటమి వర్సెస్ వైసీపీగా మారింది పరిస్థితి.. ఇవాళ మండలిలో మంత్రి నారా లోకేష్ వర్సెస్ విపక్షనేత బొత్స సత్యనారాయణగా మారింది పరిస్థితి.
ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు.. దివ్య మంగళ స్వరూపుడై.. రకరకాల రూపాల్లో తనకిష్టమైన వాహనాలపై ఊరేగుతూ అభయాన్ని ప్రసాదిస్తుంటే ఆ భాగ్యాన్ని వర్ణించతరమా?. కేవలం బ్రహ్మోత్సవాలకు మాత్రమే ఆవిష్కృతమయ్యే అద్భుతం ఇది. రేపటి నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.. ఇవాళ రాత్రి 7 గంటలకు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు..
ఇసుక మాఫియా దందాకు ఏడుగురు బలయ్యారు. మూడు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. చిన్నారులు అనాథలుగా మారారు. ఇంత జరిగినా ప్రమాదానికి కారకులైన నిందితులను పోలీసులు అరెస్ట్ చేయలేదు. పైగా సిల్లీ రీజన్స్తో కేసు పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతకూ నెల్లూరు జిల్లాలో ఏం జరుగుతోంది.
మరో వాన గండం ఉందంటూ వాతావరణశాఖ అలర్ట్ చేసింది. ఈ నెల 25న తూర్పు మధ్య, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలపింది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు ఏపీలోని ఉత్తరాంధ్ర, కోస్తాతో పాటుగా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
తిరుపతి GST అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. రాజధాని అమరావతి మునిగిపోయిందంటూ ఫొటోలుతో ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు సుభాష్... వాణిజ్య పన్నులశాఖ తిరుపతి ప్రాంతీయ ఆడిట్, ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్ (FAC)గా పనిచేస్తున్న ఎస్.సుభాష్ చంద్రబోస్.. రాజధాని అమరావతిపై ఫేస్బుక్లో వివాదాస్పద పోస్టులు పెట్టారు.
కొద్దిరోజుల క్రితం మోహన్ భగవత్ 75 ఏళ్లకు రిటైర్మెంట్ పై చేసిన వ్యాఖ్యల గురించి పెద్ద చర్చ జరిగింది. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అంతకంటే ఎక్కువ చర్చ జరుగుతోంది. ఎందుకంటే సమీప భవిష్యత్తుపై భరోసా లేని రాజకీయం నడుస్తున్న ఈరోజుల్లో ఏకంగా 2047 దాకా మోడీనే దేశానికి ప్రధానిగా ఉంటారన్న రాజ్నాథ్ వ్యాఖ్యలు ఆసక్తిని రేకేత్తిస్తున్నాయి. ఈ అంశంపై ప్రాక్టికల్ పాజిబులిటీ గురించి ఎలాగో అభిప్రాయాలు వస్తున్నాయి. అప్పటిదాకా ఉండేదెవరు, ఊడేదెవరూ అనే కామెంట్లు ముందే వచ్చాయి. ఇంకా అప్పటిదాకా బీజేపీనే…
దసరా ఉత్సవాల్లో రెండవ రోజున కనక దుర్గమ్మ శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల వేద స్వరూపం గాయత్రీ దేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత. ముక్త, విద్రుమ, హేమ, నీల ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో, శంఖం, చక్రం, గద, అంకుశం, ధరించి దర్శనమిస్తుంది. గాయత్రీ ఉపాసానతో మంత్రసిద్ధి, బ్రహ్మ జ్ఞానం కలుగుతాయి. గాయత్రీ మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది.