ఇవాళ్టి నుంచి స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేయనున్నారు.. ఉదయం 10:30కు వరలక్ష్మీనగర్, విజయవాడ ఈస్ట్, ఎన్టీఆర్ జిల్లా.. మధ్యాహ్నం 12:00 గంటలకు కంకిపాడు, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణా జిల్లాలో.. ఇంటింటికి స్మార్ట్ రైస్ కార్డుల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.
ఎమ్మెల్యేలు మాట వినకపోతే ఇక మాటల్లేవ్... అని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇకపై మాటల్లేవ్... యాక్షన్ మాత్రమే ఉంటుందన్నారు.. గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలకు సరిచేసుకోమని ఒకసారి చెప్తా అన్నారు.. అయినా తీరు మారకుంటే రెండో సారి పిలిచి చెప్తా..., అప్పటికీ మారకుంటే ఇక చెప్పటాలుండవు, నేను తీసుకోవాల్సిన చర్య తీసుకుంటా అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు..
వైసీపీ ప్రతిపక్షం కాదు.. ఒక విషవృక్షం అంటూ ధ్వజమెత్తారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. పార్లమెంట్ కమిటీల కూర్పుపై సమావేశం నిర్వహించారు చంద్రబాబు.. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి 75 మంది పార్టీ నేతలు హాజరయ్యారు.. పార్లమెంట్ పార్టీ కమిటీల ఏర్పాటు కోసం ఏర్పాటు చేసిన త్రి సభ్య కమిటీలతో చంద్రబాబు భేటీ అయ్యారు..
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దారెటు..? ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇదే హాట్ టాపిక్. పోలీస్ ఆంక్షల కారణంగా... సొంత నియోజకవర్గం తాడిపత్రికి వెళ్లలేరు. 14 నెలల నుంచి ఆయన టౌన్లోకి రాకుండా ఇటు జేసీ ప్రభాకర్రెడ్డి, అటు పోలీసులు అడ్డుకుంటున్నారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానంటూ తన సైన్యాన్ని సిద్ధం చేస్తారు జేసీ. నువ్వు అటు వైపు చూసినా... లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందంటారు పోలీసులు. దీంతో... సొంత ఇంటికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు పెద్దారెడ్డికి.
రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే శిరీష, ఆమె భర్త భాస్కర్ అవినీతికి అంతే లేకుండా పోతుందన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. ఎమ్మెల్యే దంపతుల వ్యవహారశైలి సొంత టీడీపీ నేతలకే నచ్చడం లేదట. ఇప్పటికే అనేక సార్లు సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేని పిలిచి వార్నింగ్ ఇచ్చినా, అదేమీ పట్టనట్టు యధావిధిగా నియోజకవర్గంలో దందాలు కొనసాగిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే అవినీతి కార్యకలాపాలపై బహిరంగ చర్చకు సిద్ధమని మాజీ ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మిసవాల్ చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చంటున్నారు.
అంతా శాఖాహారులే..... కానీ... బుట్టలోని రొయ్యలు మాత్రం మాయం. ప్రస్తుతం రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ ఎపిసోడ్కు ఈ సామెత సరిగ్గా సరిపోతుందంటున్నారు పొలిటికల్ పండిట్స్. ఈ కేసుకు సంబంధించి పేర్లు బయటికి వచ్చిన నేతలంతా... మాకు సంబంధం లేదంటే మాకు లేదంటున్నారు. కానీ... పెరోల్ మాత్రం వచ్చింది, రచ్చ అయ్యాక మళ్లీ శ్రీకాంత్ని లోపలికి నెట్టారు. కానీ.. ఇక్కడ అసలు దోషులెవరన్నది బిగ్ క్వశ్చన్. ఒక హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న, అంతకు ముందు కూడా నేర చరిత్ర ఉన్న వ్యక్తిని పెరోల్…
సెప్టెంబర్ నుంచి అమరావతి పనులు క్లియర్ గా కనిపిస్తాయన్నారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.. 40 నుంచి 50 వేల కోట్ల రూపాయల పనులు త్వరలో జరగబోతున్నాయన్నారు.. గత 5 ఏళ్లలో వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశారన్న ఆయన.. రెండు మూడు సంవత్సరాల్లో మంచి నగరాన్ని చూస్తారని తెలిపారు.. చిన్న సమస్యలను ఉంటే వాటిని మేం పరిష్కరిస్తాం.. ఏ రాష్టానికి లేని సంస్థలు, ఉద్యోగాలు ఏపీకి మూడు, నాలుగు సంవత్సరాల్లో రాబోతున్నాయి..