Hospital Negligence: వైద్యుల నిర్లక్ష్యం.. ఆపరేషన్ చేశారు.. మహిళ కడుపులోనే సర్జికల్ బ్లేడ్ మరిచారు..
- నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం..
- చిన్న ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరిన నరసరావుపేటకి చెందిన రమాదేవి..
- రమాదేవికి ఆపరేషన్ చేసిన డాక్టర్ నారాయణ స్వామి, ఆయన సిబ్బంది..
- ఆపరేషన్ తర్వాత తీవ్ర కడుపు నొప్పి రావడంతో మరోసారి ఆస్పత్రికి..
- స్కానింగ్ చేయగా కడుపులో సర్జికల్ బ్లేడు ఉన్నట్లు చూసి షాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hospital Negligence: పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణమైన ఘటన వెలుగు చూసింది.. ఆపరేషన్ తర్వాత వైద్యుల తీవ్ర నిర్లక్ష్యానికి సంబంధించిన సంఘటన చోటుచేసుకుంది. చిన్న ఆపరేషన్ కోసం ఆసుపత్రికి వచ్చిన 22 ఏళ్ల రమాదేవి అనే యువతికి ఆపరేషన్ చేసిన డాక్టర్ నారాయణ స్వామి మరియు ఆయన సిబ్బంది. అయితే, ఆపరేషన్ తర్వాత రమాదేవికి తీవ్రమైన కడుపు నొప్పి మొదలయ్యింది. ఈ విషయం ఆసుపత్రి సిబ్బందికి తెలియజేసినప్పటికీ, కడుపు నొప్పి సాధారణం అని వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది ఆమెకు సర్దిచెప్పి.. లైట్‌గా తీసుకున్నారు.. కానీ, కడుపు నొప్పి తగ్గక పోవడంతో మరోసారి స్కానింగ్ చేయగా, రమాదేవి కడుపులో సర్జికల్ బ్లేడు ఉన్నట్టు స్కానింగ్‌లో చూసి షాక్ తిన్నారు.. ఈ విషయాన్ని తెలుసుకున్న రమాదేవి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వాటిలో బంధువులు ఆసుపత్రి సిబ్బంది మరియు డాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.. న్యాయం కోసం ఆందోళనకు దిగారు.. ఆసుపత్రి నిర్వాహకులు, స్థానిక అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో, బాధితురాలికి అవసరమైన వైద్యం అందజేయడం, ఘటనపై పూర్తి విచారణ జరిపించడం కోసం చర్యలు తీసుకుంటున్నట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు.
Read Also: Railway Concessions:స్టూడెంట్ ఐడీ కార్డ్ ఉంటే చాలు.. రైల్వే టికెట్ లో భారీ డిస్కౌంట్..
Also Read
- CM Chandrababu: రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వివాహితపై అత్యాచారం..
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
- Palnadu Police Crime: పల్నాడులో క్రిమినల్స్‌గా మారిపోయిన పోలీసులు.. వరుస ఘటనలు.. తాజాగా లాయర్ హత్య..
తాజావార్తలు
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
-
Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
-
Ajit Agarkar: భారత క్రికెట్లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్‌బై!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
ట్రెండింగ్
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!